[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘మధుమాసం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ప్రియా.. నీ చూపులలో బాసలు
నాలో కోటి ఆశలు రేపాయిలే
నీ పలుకులలో భాషలు
నాలో ఉషస్సులను నింపాయిలే
నీ అధరం పై దరహాసం
నాలో విరహాన్ని పెంచాయిలే
నీ వలపుల తలపులు
నా గుండె తలుపులను తెరిచాయిలే
నీ చెక్కిళ్ళ పై సిగ్గులు
నా ఎద వాకిట ముగ్గులు వేసాయిలే
నీ అంతరంగంలోని భావాలు
నా మానస వీణను మీటాయిలే
నీ రాకతో నా జీవితం పరవశంతో
మధుమాసం అయ్యిందిలే..