[ఆగస్టు 8 బెహరా వెంకట సుబ్బారావు గారి 28వ వర్ధంతి సందర్భముగా, ‘మధ్యతరగతి మందహాసం’ అనే పుస్తకం ఆవిర్బావం, ప్రభ గురించి వివరిస్తున్నారు శ్రీ బెహరా సత్యనారాయణ మూర్తి.]
ప్రముఖ తెలుగు దిన, వార, మాస పత్రికలలో 1957-97 మధ్య ప్రచురించబడిన తన కథలను ఒక సంకలనముగా తీసుకు రావాలన్నది మా నాన్నగారు, ప్రముఖ రచయిత బెహరా వెంకట సుబ్బారావు గారి స్వప్నం. అయితే మధ్యతరగతి కష్టాల కారణంగా దాన్ని సాఫల్యం చేసుకోలేకపోయారు. ఆ ప్రయత్నం కొనసాగుతుండగానే 1998 ఆగస్టు 8న క్యాన్సర్ వ్యాధి బారిన పడి మరణించారు. ఆ తర్వాత ఆ విషయం మరుగున పడిపోయింది.
కరోనా సమయంలో ఆ విషయం తెలుసుకొన్న విజయనగరం కౌముది పరిషత్ వ్యవస్థాపకులు అయిన కానూరి ఆదినారాయణ రావు గారి అబ్బాయి నా బాల్యమిత్రుడు కానూరి బాపూజీ ఒకరోజు కథలన్నిటినీ తీసుకొని చదివి వాటిపై సమగ్రమైన సమీక్షను రాసి 2020 సంచిక అంతర్జాల పత్రికలో సంపాదకుడు కస్తూరి మురళీకృష్ణ గారి ప్రోత్సాహంతో ప్రచురింప చేశాడు. ఆ సమీక్షకు వచ్చిన స్పందనకు ఆనందపడిన బాపూజీ ఒకరోజు సాయంత్రం నాకు ఫోన్ చేసి కథలన్నిటిని సంకలనముగా తీసుకురావాల్సిన అవసరం గురించి గంటకు పైగా మాట్లాడాడు.
అలా సంచికలో ప్రచురించబడిన వ్యాసం, దానికి పాఠకుల స్పందన మొత్తం కథలను ఒక సంకలనంగా పుస్తక రూపం కల్పించాలి అన్న ఆలోచనకు నాలో బీజం వేసింది.
అయితే కార్యాలయపు పని ఒత్తిడి, ఆర్థిక కారణాల వలన ఆ కార్యక్రమం ముందుకు వెళ్ళలేదు. నాకు సీనియర్ కొలీగ్ అయిన డాక్టర్ VVV రమణ గారి ప్రోత్సాహంతో ఆ కార్యక్రమం కు 2025 జనవరిలో మరలా శ్రీకారం చుట్టడమైనది.
అయితే 73 కథలు 2 సీరియల్స్తో కూడిన పెద్ద సంకలనం కావడంతో ఆ ఆలోచన రూపుదాల్చడం అంత సులభం కాలేదు. జూన్ 28, 2025 న నాన్నగారి 90వ జన్మదినం సందర్భముగా పుస్తకం తీసుకురావాలన్న సంకల్పంతో మూడు నెలల పాటు నేను, నాతో పాటు రమణ గారు, దత్త శర్మ గారు పిల్లలు పుష్య, స్ఫూర్తి కష్టపడి మొత్తం పుస్తకాన్ని అయిదు, ఆరు సార్లు చదివి ప్రూఫ్ రీడింగ్ చేయడంతో నేను ఆ పనిలో సఫలీకృతుడిని అయ్యాను. ఆ సమయంలో మిత్రుడు రత్నాల బాలకృష్ణ సహకారం మరువలేనిది.
శ్రీయుతులు వెంకయ్యనాయుడు, గరికపాటి, రాజేంద్రప్రసాద్, తనికెళ్ళ భరణి గార్లకు పుస్తకం అందిస్తూ
ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోల సంఘం రాష్ట్ర కార్యదర్శి మిత్రులు శ్రీ డి.వి. రమణ గారి సహకారంతో సంకలనం ఆవిష్కరణకు విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరం లాంటి ఒక అద్భుతమైన వేదిక లభించింది. ఆ విధముగా బెహరా వెంకట సుబ్బారావు సర్వ లభ్య రచనల సంకలనం ‘మధ్యతరగతి మందహాసం’ జూన్ 29, 2025 సంవత్సరమున విజయనగరం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లోజరిగిన సభలో సాహితీ ప్రముఖుల మద్య ఆవిష్కరించడం జరిగినది. సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశానికి దాదాపు 350 మంది సాహిత్యాభిమానులు హాజరు కావడం విశేషం. ఇందులో నాన్నగారితో పాటు పోస్టల్ డిపార్టుమెంటులో కలిసి పనిచేసిన వారు, బాల్య మిత్రులు వుండడం విశేషం.
శ్రీయుతులు యండమూరి వీరేంద్రనాథ్, గుండు సుదర్శన్, కిరణ్ ప్రభ, చంద్రబోస్ గార్లకు పుస్తకం అందిస్తూ
శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు తన నాలుగు దశాబ్దాల సాహిత్య సేవలో ప్రచురితమైన దాదాపు రెండు వందలు కథలు, రెండు సీరియల్స్లో మనకు లభ్యమైన డెబ్బై మూడు కథలు, రెండు సీరియల్స్ సంకలనంలో ప్రచురించడం జరిగినది.
~
మల్లాది వెంకట కృష్ణమూర్తి, ప్రముఖ రచయిత.
పుస్తకానికి ప్రాచుర్యం లబించాలని అది ప్రతీ సాహిత్యాభిమాని వద్ద ఉండాలనే ముఖ్య ఉద్దేశ్యంతో గౌరవ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, ఆంద్ర రాష్ట్ర మంత్రి సత్య కుమార్ గారు, తెలంగాణా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు సహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు, భరత్ గారు (MP), GVL నరసింహం గారు (MP), కామినేని శ్రీనివాస్ గారు (MLA), మండలి బుద్ధ ప్రసాద్ గారు (MLA), పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు, PV ప్రసాద్ గారు, IAS, సినీ ప్రముఖులు హీరో రాజేంద్ర ప్రసాద్ గారు, డా. గుండు (సూరంపూడి) సుదర్శన్, కోదండరామి రెడ్డీ, వర ముళ్ళ పూడి, తనికెళ్ళ భరణి, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, ప్రముఖ మాటల రచయతలు దివాకర్ బాబు, చింతగింజ శ్రీనివాస్ ప్రముఖ రచయతలు యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణ మూర్తి, పెనుకొండ లక్ష్మినారాయణ, వాడ్రేవు పిన వీరభద్రుడు, డాక్టర్ చిల్లర భవాని దేవి, ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి, దుగ్గిరాజు శ్రీనివాస రావు, రెంటాల జయదేవ, అమెరికా నుంచి పని చేస్తూ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కౌముది కిరణ్ ప్రభ, ప్రముఖ చిత్రకారులు బ్నిం, కూచి, డాక్టర్ ఇండ్ల సుబ్బరామిరెడ్డి, డాక్టర్ రఘు రామారావు, డాక్టర్ కొచ్చెర్లకోట జగదీష్, రాంభట్ల నృసింహ శర్మ, ప్రొఫెసర్ మేడిపల్లి రవి కుమార్, ప్రొఫెసర్ కె.ఎస్. చలం, ప్రొఫెసర్ వి. బాల మోహన దాస్, ప్రొఫెసర్ సిమ్మన్న, ప్రొఫెసర్ కోలవెన్ను మలయవాసిని, ప్రొఫెసర్ జర్రా అప్పారావు, డా. మృణాళిని, డాక్టర్ చిల్లర భవాని దేవి, ద్విభాష్యం రాజేశ్వర రావు, గండ్రేడు గౌరీ నాయుడు, అట్టాడ అప్పల నాయుడు, మేడ మస్తాన్ రెడ్డి, డాక్టర్ అయినాపురపు రామలింగేశ్వర రావు, అద్దంకి శ్రీనివాస్, ఉప్పలపాటి అప్పల రాజు, సర్వసిద్ధి హనుమంత రావు, బసుపోతన, డాక్టర్ వై.ఎస్. చంద్రశేఖర్, లీడర్ పత్రిక సంపాదకులు రమణ మూర్తి గార్లను వ్యక్తిగతంగా కలిసి ‘మధ్యతరగతి మందహాసం’ పుస్తకం అందజేయడం జరిగింది.
శ్రీయుతులు ఎమెస్కో విజయ్ కుమార్, గుండు వల్లీశ్వర్, ముళ్ళపూడి వర, బ్నిం, వేమూరి బలరాం గార్లకు పుస్తకం అందిస్తూ
వారితో పాటు ప్రముఖ సాహిత్యవేత్తలు గుండు వల్లీశ్వర్, ఎమెస్కో విజయ్ కుమార్, ఓలేటి పార్వతీశం, జె పి శర్మ, డాక్టర్ దామెర వెంకట సూర్యారావు, చలపాక ప్రకాష్ గారు, శ్రీకంఠ స్ఫూర్తి గారు డాక్టర్ దేవులపల్లి పద్మజ, చీకటి దివాకర్, ఖదీర్ బాబు గార్లు వంటి ఎంతమందో ప్రముఖులను కలిసి ‘మధ్యతరగతి మందహాసం’ పుస్తకం అందజేసి వారి ఆశీస్సులు, శుభాకాంక్షలు అందుకోవడం జరిగినది. నన్ను ఎంతగానో ప్రోత్సహించిన నవోదయ కోటేశ్వర రావు, విశాలాంధ్ర మనోహర్ నాయుడు, పల్లవి పబ్లికేషన్స్ ఎస్.వి. నారాయణ గార్లకి ధన్యవాదాలు.
అతి ముఖ్యమైన వ్యక్తీ నన్ను ‘కొడకా’ అంటూ పలకరించే స్వాతి పత్రిక సంపాదకులు వేమూరి బలరాం గారి ఆత్మీయత నేను మర్చిపోలేనిది. అడిగిన వెంటనే నాన్నగారి సాహిత్యంపై రెండు పేజీల శీర్షిక వారి పత్రికలో వేసినందుకు వారికి, వారిని పరిచయం చేసిన కిరణ్ గారికి కూడా ధన్యవాదములు తెలుపుకొంటున్నాను.
శ్రీయుతులు మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వోలేటి పార్వతీశం, వాడ్రేవు చినవీరభద్రుడు గార్లకు పుస్తకం అందిస్తూ
దేశంలో వున్న జాతీయ గ్రంథాలయాలు, సాహిత్య అకాడమీ కార్యాలయాలకు మాత్రమే కాక రాష్ట్రంలో అనేక జిల్లా గ్రంథాలయాలకు (ప్రైవేటు మరియు ప్రభుత్వ), విశ్వవిద్యాలయ లైబ్రరీలకు, పుస్తకాన్ని పంపించడం జరిగినది. అమెరికాలోని వర్జీనియా తెలుగు కళా సమితి గ్రంథాలయంకు, దుబాయిలో ఉన్న తెలుగు వారి గ్రంథాలయంలో ఈ పుస్తకం చదువరులకు అందుబాటులో వుంచడం జరిగింది.
~
యండమూరి వీరేంద్రనాథ్, ప్రముఖ రచయిత.
శ్రీయుతులు ద్విభాష్యం రాజేశ్వర రావు, జయంతి ప్రకాశ శర్మ, ఆచార్య అప్పారావు, డాక్టర్ G V సూర్యారావు గార్లకు పుస్తకం అందిస్తూ
పుస్తకము విడుదల అయిన కొద్ది కాలము లోనే
- విజయనగరం జిల్లా రచయతల సంఘం, విశాఖ సంస్కృతీ మాస పత్రిక ఆధ్వర్యంలో బెహరా వెంకట సుబ్బారావు మొదటి జాతీయ స్మారక కథల పోటీని 2025లో నిర్వహించి సాహితీ ప్రముఖుల సమక్షంలో విజేతలకు బహుమతి ప్రధానం చేయడం జరిగినది.
- ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీని సంచిక పత్రిక వారి సహకారంతో 2026లో నిర్వహించి విశాఖ రసజ్ఞ వేదిక వారి ద్వారా విశాఖపట్నంలో జరిగిన బెహరా వెంకట సుబ్బారావు 91వ జన్మదినోత్సవ కార్యక్రమంలో బహుమతి ప్రధానం చేయుట జరిగినది.
- విశాఖపట్నం అభ్యుదయ రచయతల సంఘం ఆధ్వర్యంలో ‘మధ్యతరగతి మందహాసం’ పుస్తక పరిచయ కార్యక్రమం విశాఖపట్నంలో ప్రముఖ సాహిత్య వేత్తలచే నిర్వహించ బడినది.
- స్వాతి సపరివార పత్రికలో ప్రముఖ హాస్యనటుడు డాక్టర్ గుండు సుదర్శన్ గారు, ఆంద్రజ్యోతి దినపత్రికలో ‘వివిధ’ పేజీలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ దామెర సూర్యారావు గారు, విశాలాంధ్ర దినపత్రికలో ప్రముఖ సాహితీవేత్త హనుమంత రావు గారు, గ్రంథాలయ సర్వస్వం పత్రికలో డాక్టర్ YSS చంద్ర శేఖర్ గారు, లీడర్ పత్రికలో మేడ మస్తాన్ రెడ్డి గారు, సంచిక అంతర్జాల పత్రిక లో ప్రొఫెసర్ సుశీలమ్మ గారు, శీలా సుభద్రా దేవి గారు, KSS బాపూజీ గారు, కొల్లూరి సోమ శంకర్ గారు, ఉషా పత్రికలో కలిగొట్ల సన్యాసి రాజు గారు, SHAR, శ్రీహరికోట వారి అంతర్గత పత్రిక షార్–వాణీ లో డా. రామలింగేశ్వరరావు గారు రచించిన రివ్యూలు ప్రచురించడం జరిగినది.
- కథారంజని, ఆగష్టు 2025 సంచికలో సుబ్బారావు గారిని కధా మార్గదర్శిగా పేర్కొంటూ శీర్షిక.
- సంచిక అంతర్జాల పత్రికలో నా (బెహరా సత్యనారాయణ మూర్తి) ఇంటర్వూ, మరియు ‘నాకు నచ్చిన నాన్నగారి 15 కథలు’ వ్యాసం ప్రచురణ.
- నాన్నగారి కథలను హిందీ, ఆంగ్లంలోకి అనువదించే కార్యక్రమం పూర్తయ్యింది.
- నాన్నగారి కథలను కన్నడం లోకి అనువదించే కార్యక్రమం ప్రారంభమయ్యింది.
- షార్-వాణి, కథారంజని, విశాఖ సంస్కృతి పత్రికలలో నాన్నగారి కథలు పునర్ముద్రితం అయ్యాయి. అవుతున్నాయి.
- హైదరాబాద్ తపాల ఉద్యోగులు నిర్వహించుకొంటున్న ‘మేఘదూతం’ అంతర్జాల పత్రికలో నాన్నగారి పరిచయం.
- స్ప్రేడింగ్ లైట్స్, తార్నాకకు చెందిన చుట్టుగుంట రామ్ గారు 2 గంటల పాటు ‘మధ్యతరగతి మందహాసం’ పుస్తకము పై ప్రముఖులతో జూమ్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.
- కొల్లి సనత్ కుమార్ గారు మొత్తం కథలను 2 సీరియల్స్ ను విడి విడిగా రివ్యూ చేస్తున్నారు.
- జాతీయ, అంతర్జాతీయంగా పేరు పొందిన పప్పు భోగారావు గారు (కధాస్రవంతి), లక్ష్మి (లక్ష్మి చెప్పే కథలు), అయ్యగారి వసంతలక్ష్మి (వసంత వల్లరి), బండారు హరిత (కథా ప్రపంచం), భాగవతుల పద్మ (కధాజగతి), కొప్పర్తి రాంబాబు (కధా వాహిని), సమీర (కథా సమీరం) కాళీపట్నం వసంత లక్ష్మి, భమిడిపాటి శరత్ జ్యోత్స్న, వెంపటి కామేశ్వర రావు (వినిపించే కథలు), బి.బి. దుర్గాంబ (ఇంటర్నెట్ అక్కయ్య), పంతుల స్వాతి, సమ్మెట ఉమాదేవి, రాధారాణి, నాగ మౌనిక, మను, కథల నేస్తం వంటి చానల్స్ లో సుమారు ఇరవై అయిదు మంది నాన్నగారి కథల ఆడియోలను యూట్యూబ్ లో పెడుతున్నారు.
- రమారవి గారు సుమన్ టీవీలో నాన్న గారి కథలను విశ్లేషించుట జరిగింది.
- డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారు, బొడ్డపాటి చంద్రశేఖర్ గారు సుబ్బారావు గారిని ఆంగ్లంలో పరిచయం చేస్తూ సంచికలో ఒక వ్యాసం ప్రచురించడం జరిగినది.
- B+ విత్ భాస్కర్ షో లో అయ్యగారి వసంత లక్ష్మి గారు మరియు రాధారాణి గారు నాన్నగారి కథలను చదవడం జరిగింది.
- వెంపటి కామేశ్వర రావు గారు చదివిన కథలు టోరీ రేడియోలో ప్రసారం జరిగాయి.
శ్రీయుతులు విశాలాంధ్ర మనోహర్ నాయుడు గారు, ప్రజాశక్తి లక్ష్మన్న గారు, ఆచార్య బాలమోహన్ దాస్,చింతకింది శ్రీనివాసరావు గార్లకు పుస్తకం అందిస్తూ
సంచిక అంతర్జాల పత్రిక సంపాదకుడు కస్తూరి మురళీకృష్ణ సహా సంపాదకుడు కొల్లూరి సోమ శంకర్ గార్ల నిరంతర ప్రోత్సాహంతో ‘మధ్యతరగతి మందహాసం’ పుస్తకానికి రెండు తెలుగు రాష్ట్రాలలో తగు ప్రాచర్యం లభించింది. పుస్తకం ప్రధమ ముద్రణ కాపీలు తొమ్మిది నెలల సమయానికే అయిపోయిన సమయంలో ద్వితీయ ముద్రణ చేయటాని ముందుకు వచ్చిన ‘ఎమెస్కో’ వారికి ప్రత్యక ధన్యవాదాలు. ద్వితీయ ముద్ర ఆవిష్కరణ సభ రవీంద్ర భారతిలో నిర్వహించాలి అన్న నా కల సహకారం అవ్వడానికి కారణభూతులు అయిన డాక్టర్ సాయి రాజు గారికి, ఏనుగు నరసింహారెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సభ జరగడానికి త్రిమూర్తులుగా నాకు సహకరించిన గుండు వల్లీశ్వర్, బ్నిం, డాక్టర్ సుదర్శన్ గార్లకు నేను ఎంతో రుణపడి వుంటాను. జూన్ 14, 2026 అద్భుతంగా జరిగిన సభలో మరిన్ని హంగులతో ‘మధ్యతరగతి మందహాసం’ ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ జరిగినది. తదుపరి జూన్ 28న విశాఖలో ప్రముఖ సాహిత్య సంస్థ విశాఖ రసజ్ఞ వేదిక వారి ఆధ్వర్యములో నాన్నగారి 91వ జన్మదిన వేడుకలు మరియు కథల పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం వైభవంగా జరిగినది.
శ్రీమతి రమా రవి, శ్రీమతి రావి శారద, లీడర్ శ్రీ రమణమూర్తి గార్లకు పుస్తకం అందిస్తూ
ఈ విధంగా గత 18 నెలలుగా ఎంతో ఆనందంగా శ్రమిస్తూ నేను చేపట్టిన కార్యక్రమం ఎంతోమంది సహాయ సహకారాలతో (కొంతమంది పేర్లు మర్చిపోయి ఉండవచ్చును వారు క్షమించవలెను) ‘మధ్యతరగతి మందహాసం’ అనే పేరుతో ఒక పుస్తకం ఉద్భవించి తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా దేశమంతా దేశ విదేశాలలో ఎంతో ప్రాచుర్యత సంపాదించుకొంది. ఈ క్రమంలో నాకు నా కుటుంబానికి ఎంతో మంది ప్రముఖ ఆశీస్సులు లభించాయి. కొందరు అన్నట్టు తండ్రిగా బిడ్డ రుణం తీర్చు కుంటున్నానా లేదా బిడ్డగా తండ్రి ఋణం తీర్చు కుంటున్నానా అన్న ప్రశంస ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నా పేరు, మా తాతగారి పేరు కూడా సత్యనారాయణ. అయితే అందరూ చెబుతున్నట్టుగా నాన్నగారికి సాహితీలోకంలో మళ్ళీ జన్మనిచ్చాను అన్నది నిజం అయితే కావచ్చు ఏమో గానీ నా జీవితం ధన్యం అయ్యే అవకాశం కలిగించిన మా నాన్నగారు బెహరా వెంకట సుబ్బారావు గారికి, రచనా వ్యాసంగంలో నాన్నగారికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన మా అమ్మగారు బెహరా గౌరీకాంతంకు ఈ సందర్భముగా ధన్యవాదములు చెప్పుకుంటున్నాను. ఈ పయనంలో నాకు అత్యంత సంతృప్తి నిచ్చిన ప్రశంస ఏమిటంటే నన్ను ‘నాన్నగారి కొడుకు’ గా మిత్రులు వెంపటి కామేశ్వర రావు గారు సంభోదించడమే.
~
ద్విభాష్యం రాజేశ్వరరావు, ప్రముఖ కథా రచయిత.
ఈ కథా సంకలనం రావడానికి ప్రోత్సహించి సహకరించిన మిత్రులు కానూరి బాపూజీకి, రత్నాల బాలకృష్ణ చౌదరికి, పూజ్యులు డాక్టర్ వి.వి.వి. రమణ గార్కి, ఆత్మీయుడు కలిగొట్ల సన్యాసి రాజుకు, సోదరి చాగంటి సత్యవాణికి, మందవేముల పద్మావతి, సానబోయిన మధుసూదనరావు, రేగిళ్ళ కుమార దత్త శర్మ–స్వాతి దంపతులకు, మా హిందీ టీచర్ పార్వతమ్మ గారికి పుస్తకము ను ప్రముఖులకు అందజేయడంలో సహకరించిన రాజోలు కు చెందిన ప్రముఖ కవి MS సూర్యనారాయణ గారికి, మిత్రుడు ఆదూరి లక్ష్మీనరసింహ సనత్ గారికి, కుటుంబ సభ్యులు ఎర్రం రాజు, నిడమర్తి అనంత విజయ పద్మజలకు, ద్వితీయ ముద్రణకు పూనుకొన్న ఎమెస్కో విజయ్ కుమార్ గారికి, చంద్రశేఖర్ గారికి, గుండు వల్లీశ్వర్ గారికి వారికి ద్వితీయ ముద్రణలో ముందుమాట రాయడానికి అంగీకరించిన యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి, తెలకపల్లి రవి, డాక్టర్ గుండు సుదర్శన్, బ్నిం గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు అన్ని విధాల పూర్తి సహకారం అందించిన అర్ధాంగి పద్మావతి, పిల్లలు పుష్య, స్పూర్తి, ప్రవీణ్ లకు అభినందనలు. పుస్తకానికి విస్తృత ప్రచారం కల్పించడంలో అలుపెరగకుండా నిర్విరామంగా శ్రమిస్తున్న కజిన్ మల్లంపల్లి ప్రసాదుకు ప్రత్యేక అభినందనలు.
మిత్రుడు, సాహిత్య అభిమాని సముద్రాల గురు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వచ్చే సెప్టెంబర్ నెలలో జరగనున్న సభలో నాన్నగారి కథల హిందీ అనువాద పుస్తకం మరియు ఇంగ్లీష్ అనువాద పుస్తకం ఆవిష్కరణ జరుగుతుందని ఈ సందర్భంగా ఎంతో ఆనందంగా తెలియపరుస్తూ ముగిస్తున్నాను.
బెహరా సత్యనారాయణ మూర్తి
డిప్యూటీ డైరెక్టర్, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్
మొబైల్ నెంబర్ 9848318204
శ్రీ బెహరా సత్యనారాయణ మూర్తి భారత ప్రభుత్వ ఎలెక్ట్రానిక్స్ అండ్ ఇన్మర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకి చెందిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారి ఆంధ్ర ప్రదేశ్ శాఖలో, డిప్యూటీ డైరెక్టర్ గా విజయవాడలో పని చేస్తున్నారు. ప్రముఖ రచయిత శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారి కుమారుడు.
