[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘మహారాణి’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
బాపు గీసిన బొమ్మవో
రవివర్మ వేసిన చిత్రానివో
అజంతా శిల్పానివో
నండూరి ఎంకివో
దివిలోని అప్సరసవో
లేలేత చిగురాకువో
మెరిసిన ముత్యానివో
కురిసిన హిమబిందువో
విరిసిన కుసుమానివో
ఏది ఏమైనా కాని..
నా మనసు దోచిన
ప్రేమ యువరాణివి
నా హృదయ సామ్రాజ్యాన్ని
ఏలే పట్టపు మహారాణివి