(జూన్ నెల 28న మహారాష్ట్రలోని అహిల్యానగర్ లో మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ నిర్వహించిన సాహిత్య సాంస్కృతిక కార్యక్రమం వివరాలు అందిస్తున్నది సంచిక టీమ్. ఫోటోలు అందచేసినది మహారాష్ట్ర తెలుసు సాహిత్య అకాడెమీ)
ఈ కార్యక్రమాన్ని సహ సంచాలకులు, సభ్య కార్యదర్శి అయిన శ్రీ సచిన్ నింబాళ్కర్, సారధ్యంలో మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ నిర్వహించింది. ఈ కార్యక్రమ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీ జగన్ బాబు గంజి, శ్రీ అశోక్ కంటె, శ్రీ అంబల్ల జనార్ధన్, శ్రీ సురేఖ కోడంలు ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఎంతో శ్రమపడ్డారు. కార్యక్రమ నిర్వహణలో ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకున్నారు. కార్యక్రమం దిగ్విజయవంతం చేయాలన్న పట్టుదల, దీక్షలతో, సాహిత్య అకాడెమీ సభులు కంటె అశోక్, హరీశ్ లు స్థానిక సమన్వయ కమిటీ సభ్యులు సురేఖా కోడెమ్, భీమరాజు కోడెమ్ లతో కలసి అహిల్యా నగర్ లో నివసిస్తున్న తెలుగు వారినే కాదు, సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి ఉన్న వారందరినీ, వ్యక్తిగతంగా కలసి ఆప్యాయంగా ఆహ్వానించారు. దాంతో, కార్యక్రమం ఆరంభానికి ముందే హాలు కిటకిట లాడటమే కాదు, ఆరోజు అహిల్యా నగర్ మొత్తం అక్కడే ఉన్నట్టనిపించింది.
అనుకున్న సమయానికి సరిగా, వేదమంత్రోచ్చారణ నడుమ దీప ప్రజ్వలనం జరిగింది. సాహిత్య కార్యక్రమాలలో దీప ప్రజ్వలనం చేయకపోవటం అభ్యుదయం, నాగరీకం అనుకునే అనేక తెలుగు సాహిత్య కార్యక్రమాల అలవాటయిన అనుభవం ముందు, వేద మంత్రోచ్చారణ నడుమ, వినాయకుడి విగ్రహం ముందు, శ్రద్ధా భక్తులతో దీపప్రజ్వలనం చేయటం ఒక అద్భుతమైన అనుభవం. దీప ప్రజ్వలనం అవుతూనే, చిన్న, పెద్ద, యువతులు, మహిళలు ముక్తకంఠంతో “గణపతి బప్పా మోరెయా” అని నినదించటం మరపురాని అనుభవం.
కార్యక్రమం ‘సంగీత సరస్వతి లతామంగేష్కర్ వ్యక్తిత్వం’ పై కస్తూరి మురళీకృష్ణ ప్రసంగంతో ఆరంభమయింది. తెలుగులో సాగిన ప్రసంగాన్ని హాలులో ఉన్న అందరూ శ్రద్ధగా విన్నారు. ఆనందాన్ని చప్పట్లతో వ్యక్తపరచారు. కొన్ని దశాబ్దాలుగా మహారాష్ట్రలో స్థిరపడినా తమ మాతృభాషను పదిలపరచుకుంటూ వస్తున్నవారు ఉపన్యాసం పూర్తయిన తరువాత సుదీర్ఘ కరతాళ ధ్వనులతో తమ ఆనండాన్ని వ్యక్త పరచారు.
ముఖ్యంగా బతుకమ్మ, మంగళగౌరీ నృత్యాలకు సంబరాలు అంబరాన్ని దాటాయి. కోలాటం ఆటలో ఆడుతూ పలు విభిన్నమయిన విన్యాసాల ప్రదర్శన మంత్రముగ్ధులను చేసింది. అన్నిటినీ మించి కోలాటమాడుతూ ఏనుగు నడకను ప్రదర్శించినప్పుడు, హాలులో నుంచుని హర్షాతిరేకాలు చేయనివారు లేరు. కొన్ని గంటలు క్షణాల్లా గడచిపోయాయి. అహిల్యానగర్ ఎప్పుడూ ఇలాంటి సంబరాలను చూడలేదని ముక్తకంఠంతో అన్నారందరూ.
ఆ తరువాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ, జ్ఞాపికను, ఒక సర్టిఫికేట్‌నూ అందచేశారు. మొత్తం 108 మంది పాల్గొనేట్టు చేసి సెర్టిఫికేట్లు మొమెంటోలూ ఇవ్వటం లక్ష్యంగా అనుకున్న అకాడెమీ, చివరికి 120 మందికి మొమెంటోలు అందచేసింది. ఆయా సర్టిఫికేట్లు, మొమెంటోలతో అండరూ గ్రూప్ ఫోటో దిగేరు ఈ మధురమైన అనుభవాన్ని నిశ్చల జ్ఞాపక చిత్రంగా మలచుకునేందుకు.
కార్యక్రమం అయిపోయిన తరువాత ప్రతి ఒక్కరూ నిర్వాహకుడు, కంటె అశోక్ ను ‘తదుపరి కార్యక్రమం ఎప్పుడు?’ అని అడిగేవారే. ప్రతి ఒక్కరూ, కంటె అశోక్ ను అందరినీ కలుపుకుని, అత్యంత సమన్వయంతో కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు అభినందిచేవారే!
అంజలి నృత్యాలయ, అహిల్యానగర్
సంచాలకురాలు: శ్రీమతి ప్రతిమా భిమరాజ్ కొండం
సహ శిక్షకురాలు: శ్రీమతి వైష్ణవి సుధాకర్ శ్యామ్
చంద్రచూడ – భరత నాట్యం నృత్యం (సహభాగి నృత్యాంగనలు)
- అనుష్క అమోల్ చౌగులే
- అంజలి అన్మోల్ పన్నసూల్
- అక్షర గణేష్ ఫులసుందర్
- శ్రేయలీ ప్రసాద్ కృష్ణపాటి
- శాలికా సచిన్ షోరే
- పృథ్వి రాజేష్ మఘే
- తీర్థ్ సందీప్ పవార్
- సుజ్ఞాని రితేష్ ఆడప్
స్వాగతం కృష్ణ – భరత నాట్యం నృత్యం (సహభాగి నృత్యాంగనలు)
- ఆర్యా రాజ్ సఖుజా
- ఉన్నతి నిలేష్ సిరసట్
- సమృద్ధి విజయ్ ఘాయమాలి
- సమ్యతి నిలేష్ కటక్
- గీతాంజలి సందీప్ షబ్దక్
- ఖుషీర్ సచిన్ గోసావి
- వంశికా సచిన్ బైకర్
- విశాఖ ముఖేష్ చాందేకర్
- వాగీశ్ నరేంద్ర నాయర్
- ఇషితా అరవింద్ ఘమమ్
- వైదేహి రాజు కొండం
- స్వామి కిరణ్ జటలే
ప్రణవాలయ – భరత నాట్యం నృత్యం (సహభాగి నృత్యాంగనలు)
- సయీ దీపక్ శ్యామ్
- పాణిని నివృత్తి గుండ్
- త్రిషా ఆర్‌పూర్కర్ పాసంకటీ
- లావణ్య సంజయ్ ఘోడ్‌గావుల్
- భావ్య నితిన్ గోరఖ్
- అవనీ సంతాప్ బైకర్
- శ్రేయా ప్రజత్ నాగపల్లె
- తనిష్క అజయ్‌కుమార్ పాసంకటీ
- ఆరాధ్య ఆనంద్ పన్నసూల్
- తన్మయ్ నితిన్ గాయకవ్
- యశస్వి గణేష్ చాటే
- స్వామిని గోరక్షనాథ్ శీతల్
- శృతి నితిన్ గుండ్
బతుకమ్మ – మహిళా నృత్యాంగనలు
- శ్రీమతి వినోద్ చంద్రకాంత్ బెచీ
- శ్రీమతి రమా రాజారాం కొండం
- శ్రీమతి వైశాలి వెంకటేశ్ ఇరావతిన్
- శ్రీమతి రేఖా శ్రీకాంత్ ఆడప్
- శ్రీమతి రోహిణి సతీష్ గుజరాత్
- శ్రీమతి అనుపమా శంకర్ ఇరావతిన్
- శ్రీమతి కవితా విఠల్ మఘే
- శ్రీమతి అరుణ రాజేష్ మఘే
- శ్రీమతి సునందా ప్రశాంత్ గంజీ
- శ్రీమతి అంకితా మిలింద్ దరండే
- శ్రీమతి రూపాలీ శ్రీకాంత్ ఇరావతిన్
- శ్రీమతి మధురీ శ్రీనివాస్ ఇరావతిన్
- శ్రీమతి పూజా రవీంద్ర్ దేవ్
- శ్రీమతి సుజాతా శ్రీనివాస్ బెచీ
- శ్రీమతి సమీరా రాజు షేక్
- శ్రీమతి సురేఖా మల్లికార్జున్ ఇరావతిన్
- శ్రీమతి సునీతా ప్రకాశ్ బెచీ
- శ్రీమతి పుష్పా వెంకటేశ్ సామలే
- శ్రీమతి గీతా అనిల్ ఇరావతిన్
- శ్రీమతి భారత్ భిమరావ్ సిరసట్
- శ్రీమతి రాధా విఠల్ సిరసట్
- శ్రీమతి అరుణా పత్తల్కర్ సామలే
- శ్రీమతి అంజు కృష్ణాజీ మేరుగ్
- శ్రీమతి సప్నా అనిల్ భీమే
- శ్రీమతి మమతా రాజు శ్రీరామ్
- శ్రీమతి మాధురి రవీంద్ర్ పల్యారామ్
- శ్రీమతి రూపాలా లక్ష్మణ్ ఉడతా
- శ్రీమతి జిజీలా ఆనంద్ కామ్టేకర్
- శ్రీమతి అంజలి అనంత్ పాఠీ
- శ్రీమతి బాలామణి అంబాదాస్ ఎక్కలదేవి
కోలాలు నృత్యం – సహభాగి (పురుష) సభ్యులు
- శ్రీ భిమరాజ్ నారాయణ కొండం
- శ్రీ ప్రవీణ్ దత్తాత్రయ్ గుండ్
- శ్రీ విజయ్ రమేష్ సుఖీ
- శ్రీ దీపక్ సుధాకర్ గుండ్
- శ్రీ సత్యనారాయణ పోచిరెడ్డి ఎక్కలదేవి
- శ్రీ సందీప్ నందకుమార్ కొండం
- శ్రీ పవన్ అశోక్ కొండం
- శ్రీ సచిన్ నర్సు బైకర్
- శ్రీ గణేష్ శంకర్ మఘే
- శ్రీ అనికేత్ సురేష్ సామలే
- శ్రీ శ్రీకాంత్ సుశాంత్ వాటే
- శ్రీ గణేష్ వెంకటేశ్ చాపలే
- చి. అభిషేక్ అశోక్ కొండం
- శ్రీ శంకర్ గంగారాం వాగారే
- శ్రీ విక్రాంత్ సుఖీ
కోలాలు నృత్యం – సహభాగి (మహిళ) సభ్యులు
- శ్రీమతి సరస్వతీ భిమరాజ్ కొండం
- శ్రీమతి సవితా రాజు శ్యామ్
- శ్రీమతి రూపాలా గణేష్ చాపలే
- శ్రీమతి ప్రతిమా భిమరాజ్ కొండం
- శ్రీమతి భారతి సుధాకర్ మఘే
- శ్రీమతి జ్యోతి నర్సు దుస్సా
- శ్రీమతి అవినీ వెంకటేశ్ వ్యావహార్
- శ్రీమతి నయనా సాగర్ పలసుందలే
- శ్రీమతి సంధ్యా ప్రవీణ్ నరాలే
- శ్రీమతి ప్రియా గణేష్ నరాలే
- శ్రీమతి ప్రీతీ సాగర్ ఆడప్
- శ్రీమతి పూజా రవీంద్ర్ దేవ్
ఈ కార్యక్రమాన్ని రూపొందించి అత్యద్భుతంగా నిర్వహించిన మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ కార్యవర్గ సభ్యులకు, ముఖ్యంగా అన్నీ తానే అయి చూసుకున్న అశోక్ కంటె కు సంచిక తరఫున అభినందనలు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలలోని తెలుగు వారందరినీ, ఏకత్రాటిపై తేవటం ద్వారా భావి తరాలకు తెలుగు భాషను సజీవంగా అందించాలన్న వీరి ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆశిస్తున్నది సంచిక.

