సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మహతి, అల వంటి యువత తో ప్రారంభమైన సీరియల్ లో భువన్ జీ తనకు ఇష్టమైన ఆధ్యాత్మికతనీ, భారతీయ తాత్వికత నీ, మహా ఋషుల పంచిన జ్ఞానాన్ని సందర్భానుసారంగా జొప్పించి చెప్పడం – ఎప్పటిలా ఆయన ప్రత్యేకత. మూడో సీత కావొచ్చు, మనసు పొరల్లో కావచ్చు, వాళ్ళు లో కావచ్చు, చివరికి సినిమా లో జూనియర్ ఆర్టిస్టులు గురించి రాసిన అన్ టోల్డ్ స్టోరీస్ లో కావచ్చు- ఆయన మనదైన ఫిలాసఫీ ని చెప్తారు. భారతీయత, హైందవ సంస్కృతి, విశ్వం లోని అంతర్గత రహస్యాలను చెప్పాలని ప్రయత్నిస్తారు. ఆయన లోని అన్వేషణే అప్రయత్నంగా అలవోకగా నవలలోకి ఆ విశేషాలను ప్రవహింపజేస్తుంది. లేకుంటే – ఎక్కడ సినీ రంగం, అందులోనూ ఉత్తరాది బాలీవుడ్ పరిశ్రమ! ఎక్కడ మానవుడికి విశ్వానికి ఉన్న లంకె గురించిన ప్రస్తావన! మనిషి శరీరం లోని వాయువులు, నాడులు, ప్రాణాయామం ద్వారా కలిగే చైతన్యం,.. ఇవేవీ మహతి, అల కథకి దోహదం చేసేవి కావు. కానీ సందర్భానుసారంగా వాటిని రచయిత నవలలో చెప్పడం వల్ల ఒక ఔన్నత్యం, గాంభీర్యం సిద్ధిస్తుంది. (CVV గారి ప్రస్తావన కూడా తెచ్చారు. ప్రముఖ రచయిత్రి జలంధర గారి “పున్నాగ పూలు” అప్రయత్నంగా గుర్తుకు వచ్చింది.)
    కేవలం పాత్రల కోసం, కథ, కథనం కోసం భువన చంద్ర గారి నవలలు చదవక్కరలేదు. వారు చెప్పే ఫిలాసఫీ, సైద్ధాంతిక అవగాహన, మన పురాణాల వైశిష్ట్యం గురించి తెలుసుకునే జిజ్ఞాస కోసం చదవాలని మరోమారు నిరూపితమైంది.
    ఎంతైనా ఆయన పూర్తి పేరు “ఊర కరణం వేంకట శేష పూర్ణ ఆనంద ప్రభాకర పెద గురురాజు” కదా!

    1. 1.1

      BhuvanaChandra

      సుశీల గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ స్పందన ఎంత అద్భుతంగా ఉంది అంటే ఇంకా ఇంకా రాస్తూనే ఉండాలి అనే స్ఫూర్తిని నాలో కలిగించింది నిజంగా మీరు వారం వారం చదువుతూ ఇంత అద్భుతమైన స్పందన తెలియజేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సరళ గారి స్పందన: *చాలా విలువైన సమాచారాన్ని మీరు అందిస్తున్న తీరు అద్భుతం.*

    1. 2.1

      BhuvanaChandra

      ధన్యవాదాలు సరళ గారు థాంక్యూ సో మచ్

  3. 3

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. ఎప్పుడూ కధ అందులో సమస్య లే కాక ఎంతో జ్జ్ఞానాన్ని పంచుతున్న మీకు వందనములు. ఈ శరీర మనే మహా యంత్రము దాన్ని పనిచేయించే మహా చేతన్యం గురించి ఆలోచింప చేశారు.వాయువులు, ఉపవాయువులు అవి చేసే పని చాలా ఆసక్తి గావుంది. ఈ సృష్టిలో అద్భుతమైనది మన శరీరమే సుమా. చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు మన మనస్సు శరీరం గురించి వదిలేసి వేరే విషయాలకు ఆశ్చర్యం పడతాము. ప్రణాయామం తో మన మనసు ఎలా ట్యూన్ చేయాలో బాగా చెప్పారు. విశ్వాన్ని శరీరానికి అనుసంధానం చేసిన మా గురువులు మాస్టర్ CVV గారి గురించి ప్రస్తావన చేయటం చాలా సంతోషం కలిగింది. మాస్టర్ cvv యోగం గురించి మీరు తెలియ చేసే విషయాల కోసం ఆసక్తి గా ఎదురు చూస్తూ – రోహిణి 🙏🌹

    1. 3.1

      BhuvanaChandra

      నమస్కారం రోహిణి గారు మీరు చక్కగా చదవడం కాక పోలంకషంగా చదివి స్పందన ఇస్తూ మరిన్ని విషయాలు తెలుపమని మీ స్పందన ద్వారా తెలియజేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తప్పక రాస్తానని చెబుతూ మీకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు

  4. 4

    Sobharaja

    🙏
    ఈ శీర్షికలో ఇంతకు ముందు కని విని ఎరుగని విషయాల గురించి అద్భుతంగా వివరించారు. శరీరాన్ని ఇన్ని వాయువులు నడిపిస్తున్నాయని చెపుతూ ఒక్కొక్క వాయువు పేర్ల తో సహా వాటి ద్వారా జరిగే ప్రక్రియలతో బాటు చక్కగా చెప్పారు. శరీరం యంత్రంగా పనిచేయడం నిజమే. ఇంకపోతే యోగా గురించి దాని గొప్ప తనాన్ని ఉదాహరణతో గొప్పగా చెప్పారు. మీరన్నట్టు మనం మన పూర్వీకులు మనకు ఎంతో గొప్ప సంస్కృతి సంప్రదాయాల్ని మన ముందుంచినా మనం వాటిని గౌరవించడంలేదు అనుసరించడంలేదు. పాశ్చాత్య వ్యామోహంలో పడి బలైపోతున్నాము.
    మీకు మన సంసృతి మీద ఉన్న అవగాహన knowledge కి hats off to you. It’s really amazing. శతకోటి ధన్యవాదాలు ,పాదాభివందనాలు sir🙏🌹🙏

    1. 4.1

      BhuvanaChandra

      నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు శోభ జి ఎందుకంటే చాలా చక్కని స్పందన ఇస్తూ వారం వాలని నన్ను ఉత్సాహపరుస్తున్నందుకు మీకు నేనెప్పుడూ కృతజ్ఞుడిని. థాంక్యూ సో మచ్

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *మహతి సీరియల్ చాలా బాగుంది, అభివందనాలు.
    భగవంతుడు సృష్టించిన చరాచర జగత్తును మనం చూస్తున్న విషయం తెలిసిందే కదా. ప్రతిదీ బయట కనిపించే దేచూసి ఆనందంగా చలించిపోతాం. కంటికి కనపడని అనంత విశ్వం ఒకటి ప్రతి ఒకదానిలో ఉంటుందని మన మహర్షులు జ్ఞాన శక్తితో దివ్వత్వాన్ని దర్శించి మనకణదించారు. ఆనాడు వారు దర్శించిన విషయాన్ని ఈనాటికీ ఇంకా కనిపెట్టి రుజువు చేస్తున్నారు శాస్త్రం ప్రకారం. సృష్టిలో దేనికీలేని శక్తి మనిషికి ఉంది .తనలోనే ఓ విశాలమైన విశ్వం ఉన్నా ప్రశాంతంగా శాంతిగా తనలోకి చూడకుండా తనని మరిచి బయట ప్రపంచంలో వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు.
    మీరిచ్చిన వివరణ బావుంది. ఎంత చక్కగా విశ్లేషించారు. చాలా స్పష్టంగా విడమర్చి కళ్ళకు కట్టినట్టు చూపించారు.
    షామ్యానా లేసి, సభలు పొట్టి ఆధ్యాత్మికత అని బోధించే గుకువుల బోధలకంటే
    ఈరోజు మీరిచ్చిన శరీరనిర్మాణ వివరణలు బావున్నాయని ఎంతమందికి
    తెలుసు? ఎంతమంది చెప్పగలిగారు?
    నిన్ను నువ్వు తెలుసుతో అనే ఉపనిషత్తులు పురాణాలు చెబుతున్నాయి కానీ
    క్లారిటీ ఇచ్చేదెపరు?
    భగవధ్గీతలో విశ్వరూపదర్శనం చూపించినట్టు ఈ సంచికలో మీరు మనిషి లోమరో
    విశ్వాన్ని చూపించారు మీ రచనలో.
    మీరు వ్రాసిన నవలలు, కథలు, ఇంటర్వూలు, ఇలా నాలుగు సంవత్సరాల నుండీ చదువుతున్నా, వింటున్నా. సినిమా పాటలు విని వెతుక్కుంటూ వచ్ఛా. మీలో మీరు కనిపించే దానికంటే వేరుగా మీలో ఓ మహాశక్తి దాగిఉంది. దాని కోసం వెతుకుతున్నా, ఎదురుచూస్తున్నా.
    ఇప్పటికీ నాకు కావాల్సింది వస్తున్నది. మహానుభావులు స్పందించి దయ చేసి
    మీలోని జ్ఞాన జ్వాలని అందరకీ పంచగలరని వేడుకుంటున్నాను.
    నాకు చదివే శక్తి లేక అనారోగ్యంతో ఉన్న నేను ఈ రోజు కాస్త ఓపిక చేసి చదివి వ్రాసిన నా అభిప్రాయం చెప్పాను.
    దయవుంచి నేనేదైనా తప్పుగా అతిగా వ్రాసిన నేను మన్నించి క్షమించండి.
    ఈ రోజు ఆధ్యాత్మికత సాధన చేసే సాధకులకు మార్గదర్శకులు లేక అయోమయంలో
    పడుతున్నారు. పిచ్చివాళ్ళవుతున్నారు. కొందరు రెండు రకాలుగా ఉపయోగం లేనివారు పోతున్నారు.
    కధానాయికల పాత్ర పోషణ చేస్తూ సామాజికంగా రాజకీయంగా మరెన్నో అందాలు సృష్టించి మమ్మలని చాలా ఆలోచనలని లోతుగా తీసుకుని వెళ్తున్నమీ రచనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అభినందనలు, పాదాబివందనాలు.
    చివరిగా నా ఆత్మప్రణామాలు అండి.
    మీలోని మరో ఆత్మసంకల్పాలు రావాలని మనసారా కోరుకుంటున్నాను. ధన్యులం.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!