1869లో
గుజరాత్ రాష్ట్రంలో
పోరు బందరులో
పుట్టెనొక్క దృవతార!
భరతమాత మనసు దీర!
బాల్యపుచదువులు
భరతదేశమున
పైచదువులు మరి ప్రదేశములో
ఇష్టముతో ఇంగ్లాండుకు పోయి!
బారెట్ల బహు చక్కగ పాసై
భారత దేశము తిరిగి వచ్చెను
భరత మాత దాస్యమును బాపగా
దక్షిణాఫ్రికా భారతీయుల
దాస్యము బాపగ నిశ్చయమ్ముతో
ప్రిటోరియా నటాల్ నగరములో
అనేక అవమానములకు నోచి
నల్లజాతి దాస్యమును మాన్పెను.
భరత మాత దాస్యమ్మును దృంపగా
బాలగంగాధర అడుగు జాడలో
అనేక చట్టాలనవతలపెట్టి
పంచే కట్టి చఱకాను పట్టెను.
దండియాత్రలో బ్రిటీష్ వారి
బెండు తీసిన శాంతి వీరుడు
బాపూజీ మన బాపూజీ!
సత్య, అహింసలే సాధనమ్ముగా
సత్యాగ్రహమను సంగరమ్ములో
మత్తుగొన్న మదగజము బ్రిటీష్‌ను
పారద్రోలిన శాంతి సింహము
బాపూజీ మన బాపూజీ!
ఇలాతలముపై ఇలాంటి పురుషుడు
నభూతో నభవిష్యతి అనగా
జనానికంతకు చెప్పక చెప్పిన
మహా మనీషి, మహాత్ముడు
మహాత్ముడు, మన భారతీయుడు
బాపూజీ మన బాపూజీ!