Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-4

[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]

అధ్యాయం 3 పౌరాణిక వివరణ – రెండవ భాగం

నవ విధ భక్తి:

“శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం

అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం.”

(భాగవతం – సప్తమ స్కంధం 5.21)

రూప గోస్వామి  – “సాధన, భావం, ప్రేమ” అనే మూడు విధాలుగా భక్తి ఉదయిస్తుందని చెప్పారు.

వివేకానందులు “శాంత, ద్యాస, సఖ్య, వాత్సల్య, మాధుర్య” భక్తులను తమ  “భక్తి యోగం”లో చెప్పారు.

రసాలు:

“శృంగారవీరకరుణాద్భుతహాస్యభయానకాః.

భీభత్సశ్చ తథా రౌద్రో నాప్యే త్వష్టరసాః స్మృతాః”

~

త్యాగరాజు –  1000 ద్రాక్షపాకం – 1767 -1847 – రాముడు.

దీక్షితార్ – 300 నారీకేళపాకం – 1775 -1835 – అంబ

శ్యామశాస్త్రి – 300 కదళీపాకం – 1763 – 1827 – అంబ

~

చంద్రుడు:

కాల పురుషుని మనస్సు చంద్రుడు. భూమికి ఒక ఉపగ్రహం చంద్రుడు. దైవం, శాపగ్రస్థ భూమిక కూడా. 14 రత్నాలలో ఒకటి. సాహిత్యంలో చంద్రుడికి అనన్య స్థానం వుంది. మహత్వపూర్ణుడు, రాశిపతి, భోగ్యాధిపతి. చంద్రునికి చాలా పేర్లు వున్నాయి. సోముడు, రజనీపతి, శశి, కళానిధి, ఇందు, శశాంక, సుధాకర, మయాంక, రాకేశ మొదలైనవి. సముద్రంలో పుట్టడం వల్ల భూమికి సోదరుడు అంటారు.

సూర్యుడు:

“ఆదిత్య ప్రథమౌ దేవా” అని సూర్యుణ్ణి ప్రథమ దేవతగా చెయితారు. కర్మ సాఫల్యానికి ప్రేరణ. సకారాత్మక ఊర్జ(శక్తి)తో నిండినది, పవిత్రమైనది. సూర్యడుకి శాస్త్రాలలో చాలా పేర్లు వున్నాయి. భాను, మార్తాండ, రవి, ఆదిత్య, ప్రభాకర, భాస్కర మొదలైనవి. కశ్యప ఋషి పెద్ద భార్య అదితి గర్భంలో సూర్యుడు జన్మించాడు. అందుకే కాశ్యపుడు అని కూడా అంటారు. ఒకే సూర్యుడు తన గుణాలను బట్టి 12 రూపాలతో వెలిశాడు.

సూర్యదేవుని పరివారం:

ఆంజనేయుడు:

సుగ్రీవునకు మంత్రిగా ఉన్న ఆంజనేయుడు రామ సుగ్రీవుల స్నేహానికి కారకుడు. ఆంజనేయుడు అంటే భగవదన్వేషణాపరమైన బుద్ధి. అం (సర్వ వ్యాపకుడైన విష్ణువును + జనయతి ఇది పుట్టించునది) అంజనకు సంబందించినవాడు. సర్వవ్యాపక బుద్ధితత్త్వం, బుద్ధి నిశ్చయము కలిగిన భగవత్తత్త్వమును ఉపాసించేవాడు. మనసు సంబంధించిన మాయను వదిలి విశుద్ధ తత్త్వాన్ని అంటుకొన్న బుద్ధి. విశుద్ధతకు భగవంతునకీ మధ్య సంధాన కర్త, శక్తిగా పని చేస్తుందనేదే ఈ మైత్రి అంతరార్థం.

ఆంజనేయుడు సకల విద్యాపారాంగతుడు. నవవ్యాకరణీ పండితుడు.

“చదువులన్ని దెలిసి శంకరాంశుఁడై

సదయుఁడాశుగ సంభవుండు మ్రొక్క”.

(ఆడమోడిగలదే రామయ్యమాట  – చారుకేశి  రాగం)

హనుమంతుడు సంగీత శాస్త్రప్రవక్త. ‘కర్తా సంగీత శాస్త్రస్య హనుమాంశ్చ మహాకపిః’ అని కదా. సంగీతానందము – “సీతాపతి చరణాబ్జము నిడుకొన్న వాతాత్మజునికి బాగ దెలుసుర” (గీతార్థము).

ఇంద్రుడు:

పరాక్రమవంతుడు. వైదిక వాఙ్మయంలో చూస్తే ఇంద్రుడు ఉదాత్తశీలి. ప్రతిభాశాలి. శత్రుసంహారకుడు. వేదాలలో 33 కోట్ల దేవీదేవతల వర్ణనములు వున్నాయి. ఇవి 3 భాగాలు. ద్యు – స్థానాయ (ఆకాశంలో వుండేవారు); దేవత్ – అంతరిక్ష (మధ్య)స్థానాయ; దేవత – పృధ్వీ స్థానాయ.

దేవత – అంతరిక్ష స్థానాయ. దేవతలతో ఇంద్రుడిది శిఖరాగ్రస్థానము. ఆర్యులకు ప్రియమైనవాడు. ఋగ్వేదంలో 250 సూక్తాలు వున్నా అంశా మాత్రంగా చేసిన సుక్తాలు చూసి కలిపితే 300.

శతృ సంహారకుడు, వృత్తాసుర వినాశకుడు. శత్రువిధ్వంశకుడు, శంబర రాక్షస నగర నాశనకర్త, సర్వశ్రేష్ట రథికుడు. వాజిపతుల స్వామి, దుష్ట దళనకర్తా, యుద్ధవిజేత. వజ్రాయుధంతో శత్రుసంహారం, బాణాలు కాడా వాడాడు. అధర్వణవేదంలో (19-13-4) వర్ణించారు. సముచి అనే రాక్షసున్ని చంపాడు (తైత్తరీయ బ్రాహ్మణంలో ఉంది).

త్వష్టపుత్రుడు విశ్వరూపుడు. 3 శిరస్సులు కలవాడు, ఇతనిని ఇంద్రుడు హతమార్చాడని ఉపనిషత్తులో వుంది. కాలకాశ్య రాక్షసుణ్ణి చంపాడని ‘కౌషితకి’లో చెప్పారు.

చాందోగ్యోపనిషత్తు ఇంద్రుని ఆశ్రయంతోనే సమస్త రుద్రగణాలు జీవిస్తున్నాయని వివరించింది. వాయు మండలంలో వుండే పురుషుడు ఇంద్రుడు. స్వర్గం ఇంద్రుడి ఇష్టమైన నివాస స్థానం. ఇతను శ్రుతి అని, వీర్యం అని బ్రహ్మణ గ్రందాలు చెప్పాయి.

ఇంద్రియాలను శాసించేవాడని, ప్రజాపతి, దగ్గర 10 సంవత్సరాలు బ్రహ్మచర్య పూర్వకంగా వుండి సేవ చేసి జ్ఞాన సముపార్జన చేశాడట. ఆయుష్షు, అని అమృతం అని కూడా అన్నారు. స్వర్గానికి దేవతలకి ఇంద్రుడే రాజు.

సీత:

సీత గురించి వాల్మీకంలో కొన్ని చోట్ల అంతర్భావ సుందరంగా కీర్తిః, శుభా, లక్ష్మిః అనీ; బీజాక్షర పరంగా “శ్రీం హ్రీం” అని దృష్టికి వస్తాయి. ఆయా సందర్భాన్ని బట్టి తాత్వికతకి అవకాశమిస్తాయి. వాల్మికి దర్శనంతో సీత వ్యక్తిత్వంలో అస్తిత్వ రేఖలు కల్పవృక్షంలో అనేకమయిన రంగుల చిత్రాకృతుల్ని పొందాయి. అవి పరంపరంగా సీత అంతస్స్వరూపాన్ని ఆలోచింప చేస్తాయి. స్వరితము అనుదాత్తము మధ్య ఉదాత్త స్వరం వలె ఉంది. స్థూలంగా శబ్ద బ్రహ్మం యొక్క సర్వోన్నతి లోన దీధితి (వెలుగు), కుంజి, స్వర్ణరత్న ధనగర్బితమైన భూమి. ఐశ్వర్య గుణంతో లక్ష్మి స్వరూపాన్ని భావింపజేస్తుంది. ఇదీ పౌరాణికమయింది. పైగా సీత భూపుత్రి కూడా.

సీత – సీ (అంతం కలది) + ఇత (పొందబడినది) అంటే అంతము కలదానిని పొందినది. ఈ స్వభావం కల్గినది ప్రకృతి అయిన సీత. సీత అంటే మరో అర్ధం నాగేటి చాలు. నాగలితో దున్ని భూమి నుండి పంటను తీస్తాం. నాగేటి చాలు భూమిలోని పంటకు మూలాధారం. సీత అయిన ప్రకృతి అన్నిటికి ప్రతిరూపం. భూమి నుండి పుట్టిన ప్రకృతి సంపద. షడ్భావ వికారాలున్నా ప్రకృతి శాశ్వతం అనుకోవడం వల్ల –  దానికి వశం అయి వాసనలు మనస్సును అంటుకొని జన్మలకు కారణాలవుతాయి. ప్రకృతి లేకుండా జీవనమే ఉండదు. ముక్తి సాధనం ప్రకృతి వశం అయివుండాలి. అలాంటప్పుడు ప్రకృతితో ఉన్నా ముక్తి సాధ్యపడదు. ప్రకృతి వికారాలు కల్గినది ప్రకృతి. భూమి నుండి పుట్టిన సీత ఐహిక ప్రకృతి అయి. సాధనకు ప్రతిబంధకంగా ఉంటుంది. జ్ఞానానికి మాత్రమే వశం అవుతుంది. జ్ఞానాభివృద్దిని సాధించే వానికే గురువు ఐహిక ప్రకృతిని ఇస్తూ ఆఖరి విద్యా వ్యక్తపరుస్తాడు.

సీతాదేవి – “అప్రమేయం హా తత్తేజః యస్యసా జనకాత్మజా” ఆని గదా వాల్మీకి అభిభాషణము, (మౌ జానకీ, సరియెవ్యరే. భామామరువంపు మొలక భక్తియను వంజరపు చిలక (రామ నీ సమానమెవరు). భామామణి (రామ కథాసుధార).

రాముడు:

14 ఏండ్లు దండకారణ్యంలో ధీరుడై రాముడు వున్నాడు. దండక  +  అరణ్యం = శిక్షణను చేకూర్చే ప్రశమన స్థితి. నవ పంచపదునాల్గు =  2 చెవులు + 2 కన్నులు + 2 ముక్కు రంధ్రాలు + నోరు + మలద్వారం + మూత్ర ద్వారం అయిన 9 ద్వారాలు; జిహ్వ, పాయో పాదము, చర్మం + మనస్సు అయిన 5 దశ ఇంద్రియ  నిద్ర తర్వాత మోక్షాన్ని కోరే సాధకుడు చేయవలసిన సాధనా మార్గం. 14 ఇంద్రియాల్లోను ప్రశాంత స్థితిని సాధించే సాధన చేయడమనేదే సాధనా రహస్యం., శ్రీరాముడు ద్వాత్రింశల్లక్షణో పేతుడను సాముద్రిక సత్యమును త్యాగరాజు వెలార్చినాడు. శ్రీరాముని మానవీయ, దివ్య గుణగణములను వర్ణనాతీతమగు రీతిలో తమ కీర్తనల యందు చిత్రించాడు. “గాంధర్వేచ భువిశ్రేష్ఠః బభూవ భరతాగ్రజః” త్యాగయ్య శ్రీరామునకు గల సంగీత ప్రియత్వమును బహుధా వర్ణించుచు చెప్పిన కృతులు చాలా ఉన్నాయి.

శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడు:

‘ఒకమాట – ఒక బాణము, ఒక పత్నీవ్రతుడే మనసా’. శ్రీరాముడు సత్త్వగుణ ప్రధానుడు. 1) ఉండేది రాముడొకడు, 2) ఏమని పొగడుదురా. శ్రీరాముడు భక్తపాలన కళాదక్షుడు (మనసా శ్రీరామచంద్రుని, కదను వారికి).

శ్రీరాముడు పుంసాంమోహనరూపుడు:

రూపౌదార్య గుణైః పుంసాందృష్టి చిత్రాపహారిఐమ్‌ ఆని గదా వాల్మీకి అభిభాషణము. 1) ముద్దు మోము ఏలాగు చెలంగెనో, 2) ఎంత ముద్దో ఎంత సొగసో, 3) అద్దంపు చెక్కిళ్ళచే ముద్దుగారు మోము, 4) నిగనిగమను సుకపోల యుగముచే మెరయు 5) మోహన రామ ముఖజితసోమ. శ్రీరాముడు శృంగార శేఖరుడు.

జటాయువు:

దశరథుని స్నేహితుడు. వినతా సంతానం. అరుణజులు. అరుణుని బిడ్డలు సంపాతి, జాటాయు. వీరి తల్లి శ్యేని (గ్రద్ద). జట + ఆయువు = జటాయువు. జట, ఘనలు వేదాధ్యయన మార్గాలు. జట అనే అద్యం – మార్గం వేదాన్ని నిలబెడుతుంది. జాటాయువు అంటే వేద విజ్ఞానం అని అర్థం వుంది. గరుత్మంతుడు చంధోమయమన, సర్వవేదమూర్తి.

(సశేషం)

Exit mobile version