[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘మళ్లీ పుట్టాలి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కొన్ని రోజులపాటు కాలం తెగి
సమయం తెలియకుండా పోయి
చీకటికి చిక్కుపడి
జీవితం అడుక్కుపోయినట్లుగా
నిటారైన నిజం
ఒక్క మాట ఒడ్డుకు కొట్టుకొచ్చి
మనిషిని మనిషే ఈదుకుంటూ
మనసు జీవాన్ని ధరించి..
అప్పుడుప్పుడు
మనసు చనిపోతూ
మసికాబడ్డ ఆలోచనలో
మళ్ళీ పుట్టాలి
