Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మల్లెతీగ, శ్రీమతి ఘంటా ఇందిర స్మారక సింగిల్ పేజీ కథల పోటీ ప్రకటన

ల్లెతీగ సాహిత్య సేవాసంస్థ, శ్రీమతి ఘంటా ఇందిర స్మారక సింగిల్ పేజీ కథల పోటీ నిర్వహిస్తుంది.

నేడు కుటుంబంలో కనుమరుగవుతున్న మానవ సంబంధాలు, ఛిద్రమైపోతున్న బాంధవ్యాల నేపథ్యాన్ని పేజీ కథలుగా మలచి, మంచి సందేశంతో కూడిన ముగింపు, కొసమెరుపు కథలకు ప్రాధాన్యత వుంటుంది. ఆసక్తికరమైన ఫాంటసీ కథల్ని కూడా పంపొచ్చు.

మీ రాతలో ఒకటిన్నర పేజీకి, 400 పదాలకు మించని కథలు పంపాలి. యూనికోడ్ ఫాంట్లో ఇమెయిల్ ద్వారా రచనల్ని పంపాలి.

యూనికోడ్ తో పాటు పిడిఎఫ్ ఫైల్ కూడా తప్పనిసరిగా పంపాలి. యూనికోడ్ వీలుకానీ వారు డిటీపీ చేసి పంపాలి.

రాత ప్రతుల్ని స్కాన్ చేసి పంపకూడదు.

నవమల్లెతీగ నియమాలకు లోబడి బహుమతుల ఎంపిక వుంటుంది. రూ.1,000/-ల చొప్పున 8 కథలు, రూ.500/-ల చొప్పున 4 కథలకు మొత్తం రూ.10,000/-ల నగదు బహుమతులంటాయి.

ఆసక్తి గల కథకులు తమ కథల్ని 2026 ఫిబ్రవరి 15లోగా malleteega.sss@gmail.com ఈమెయిల్ కు పంపాలి.

పూర్తి వివరాలకు 92464 15150 నెంబరులో సంప్రదించవచ్చు.

కలిమిశ్రీ,

అధ్యక్షుడు, మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ

Exit mobile version