Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మన భారత అవని-11

[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తన గురువుగారు రాసిన పుస్తకాన్ని తెచ్చుకుని, చదువుతుంటాడు శ్రీరామ్. కట్ట బ్రహ్మన, మంగళ్ పాండే, లాలా లజ్‍పత్ రాయ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్‌ల గురించి, వారి పోరాట విధానాల గురించి వివరంగా రాస్తారాయన. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను తలచుకుంటాడు శ్రీరామ్. – ఇక చదవండి.]

అధ్యాయం-12

కాలచక్రం: (భారతావని):

సామాన్య శకం (సా.శ.)కు సంబంధించిన మరికొన్ని విషయాలు:

సామాన్య శక పూర్వం (సా.పూ.) అంటే క్రీస్తు పూర్వం (క్రీ.పూ) క్రీస్తు శకం లేదా క్రీస్తు శకానికి ఆరంభాన్ని ఆంగ్లంలో Annodomini (AD) అంటారు. లాటిన్ భాషలో యానో డోమిని (Annodomini – AD) ని కామన్ ఎరా (Common era – CE) గాను, బిఫోర్ కామన్ ఎరా (Before common ERA – BCE) గాను వాడుతున్నారు. వీటిని తెలుగులో సామాన్య శకం (సా.శ.) సామాన్య శక పూర్వం (సా.పూ.) అని అంటారు.

సామాన్య శకం:

ప్రస్తుతం వాడుకలో ఉన్న క్రీస్తు శకానికి ప్రత్యామ్నాయ నామం. క్రీస్తు శకంకు పూర్వ రూపమే సామాన్య శకం. ఇంగ్లీషులో దీన్ని కామన్ ఎరా (common era) అని లేదా కరెంట్ ఎరా Current Era అని అంటారు. వీటిని తెలుగులో సామాన్య శకం (సా.శ.) సామాన్య శక పూర్వం (సా. పూ.) లేదా (సా.శ.పూ) గా, వ్యవహరిస్తున్నారు. ఈ మార్పుకు మత తటస్థత ప్రధాన కారణం ఈ మార్పు పేరులానే తప్ప కాలగణనలో కాదు. ఉదహారణకు (క్రీ.పూ. 512, సా.శ.పూ 512 గాను, క్రీ.శ 1757 సా.శ. 1757 గాను మారుతాయి).

శకం అనేది కాలగమనం లేదా చరిత్ర రచన కోసం నిర్వహించిన నిర్ధారించిన సమయ వ్యవధి. చారిత్రక ప్రాధాన్యత, భౌగోళిక ప్రాంతం వంటి అంశాలను బట్టి శకాలు ఏర్పడ్డాయి. క్రీస్తు శకాన్ని ఆంగ్లంలో Anno domini (AD) అంటారు. తెలుగులో దీన్ని సా.శ. అని వాడతారు. భారత ప్రభుత్వం దీనిని 1957లో భారత జాతీయ క్యాలెండర్‌గా స్వీకరించింది. క్రీ.శ. 78లో కనిష్క మహారాజు చేత ‘శాక శకం’ స్థాపించబడినది. సాకా క్యాలెండర్ 365 రోజులు మరియు పన్నెండు నెలలు కలిగి ఉండును. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. గ్రెగోరియన్ అనగా ఆంగ్ల కాలమానం. క్రీస్తు పూర్వం అనేది క్రీస్తు జన్మించక ముందు జరిగిన సంఘటనలను లెక్కించే పద్ధతి. అంటే ఇంగ్లీష్ క్యాలెండర్లో క్రీస్తు పూర్వం 3102 లేదా 3104 సంవత్సరం నుంచి కలియుగాబ్దిగా మన భారతీయ హిందువులు లెక్కపెడుతూ పంచాంగ రచన సాగించారు.

తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. ఈ ఐదు భాగముల కలయికే పంచాంగం (పంచ + అంగం). పంచాంగములు రెండు రకములు. చాంద్రయాన పంచాంగం, అనగా చంద్రుని సంచరణతో అనుసంధానమైనది) సూర్యమాన పంచాంగం, అనగా సూర్యుని సంచరణతో అనుసంధానమైనది. మన ప్రాంత పంచాగ రచన చాంద్రమానం ప్రకారంగా గణిస్తారు.

నక్షత్రములు 27:

1. అశ్వని, 2. భరణి, 3. కృత్తిక, 4. రోహిణి, 5. మృగశిర, 6. ఆరుద్ర, 7. పునర్వసు, 8. పుష్యమి, 9. ఆశ్లేష, 10. మఖ, 11. పుబ్బ 12. ఉత్తర 13. హస్త, 14. చిత్త, 15. స్వాతి, 16. విశాఖ, 17. అనూరాధ, 18. జ్యేష్ఠ , 19. మూల, 20. పూర్వాషాఢ, 21. ఉత్తరాషాఢ, 22. శ్రవణము, 23, ధనిష్ఠ, 24. శతభిషము, 25. పూర్వాభాద్ర, 26. ఉత్తరాభాద్ర, 27. రేవతి.

రాశులు (12):

1. మేషం 2. వృషభం 3. ముధునం 4. కర్కాటకం 5. సింహం 6. కన్య 7. తుల 8. వృశ్చికం 9. ధనస్సు 10. మకరం 11. కుంభం 12. మీనం

ఖగోళ శాస్త్రానికి, జాతక చక్ర నిర్మాణానికి ఇరవై ఏడు నక్షత్రములు, పన్నెండు రాశులు ఆధారం. 2¼  నక్షత్రాలు ఒక రాశి. పంచంగ రచన, జ్యోతిష్య శాస్త్రానికి ఇవి మూలం.

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ:

బహమనీ రాజ్యము:

బ్రిటీష్ రాజ్యము:

తెలుగు సాహిత్యము – నన్నయకు ముందు:

చారిత్రక మహా ప్రసిద్ధ వ్యక్తులు:

చారిత్రక గొప్ప నగరాలు:

పిఠాపురం – భట్టిప్రోలు – వేంగి – ధాన్యకటకము – కొలనుపాక – ఓరుగల్లు – విజయపురి – రాజమహేంద్రవరం – కళింగపట్నం – హంపీ – సింహపురి – హైదరాబాదు

ప్రసిద్ధ రాజవంశములు:

1. మౌర్య వంశము:

స్థాపకుడు మౌర్య చంద్రగుప్తుడు (క్రీ.పూ 321 – 187). చంద్రగుప్త మౌర్యుడు మొదటిసారిగా భారతదేశాన్ని ఏకం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వారి రాజధాని పాటలీపుత్రం. చంద్రగుప్తుని తరువాత బిందుసార, అశోకుడు, ముఖ్యమైన రాజులు పరిపాలించారు. మౌర్యుల పాలన కేంద్రీకృతంగా వ్యవస్థీకృతంగా బ్యూరోక్రసీతో నిండి ఉండేది. అశోకచక్రవర్తి రాజ్య వంశపు మూడవరాజు.

బ్యూరోక్రసి అనే పదం ఫ్రెంచ్ పదం. అర్థం పెద్ద పెద్ద సంస్థలను నియంత్రించే (నడిపే) పరిపాలనా వ్యవస్థ.

అశోక చక్రవర్తి 260 BCలో వారు, కళింగ రాజ్యాన్ని ఆక్రమించదలచి కళింగ యుద్ధాన్ని చేశారు. చివరకు అశోక చక్రవర్తి కళింగ రాజ్యాన్ని ఆక్రమించారు. యుద్ధానంతర కాలంలో అశోక చక్రవర్తి, ఆ యుద్ధంలో చనిపోయిన ఎందరో సైనికులను, పారిన రక్త ప్రవాహాన్ని చూచి, చనిపోయిన వారిని గురించి విచారిస్తూ, విరక్తితో, రాజ్యకాంక్షను త్యజించి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. శేష జీవితాన్ని ధర్మ చింతనతో, సత్ సాంగత్యంతో, ధార్మిక చర్యలతో సాగించారు. రోడ్లకు ఇరువైపులా నీడనిచ్చే చెట్లను నాటించారు. బాటసారుల విశ్రాంతి కోసం, సత్రాలు, బావులను నిర్మించారు. అహింసారహిత బౌద్ధ మౌతాన్ని తాను ప్రజలకు విశదీకరిస్తూ తన సోదరుడు ‘విట శోక’ (టిస్సా) చేతి కూడా బౌద్ధ మత ప్రచారాన్ని సాగించారు. ప్రజలను ధర్మ శాంతి మార్గాలవైపుకు మరలించారు.

2. శాలివాన వంశం:

మౌర్య రాజుల తర్వాత అంతటి ప్రాభవం కలిగి పాలించిన రాజులు శాలివాహనులు. శాలివాహనులు బ్రాహ్మణ కుల సంజాతులు వైదిక మతస్థులు. అన్ని కుల మతాలను సమాదరణతో చూచినవారు. వారిలో తొలిరాజు శ్రీముఖుడు. వారి రాజధాని ప్రతిష్ఠానపురం. వీరు మౌర్యుల తరువాత ప్రప్రథమ ఆంధ్ర సామ్రాజ్య స్థాపనతో దక్కన్ ప్రాంతాన్ని పాలించారు. వీరి పాలనా కాలం 450 సంవత్సరాలు. వీరి పాలనా కాలంలో దేశంలో ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి జరిగింది.

ప్రాచీన భారతదేశ చరిత్రలో శాలివాహనులకు విశిష్ట స్థానం ఉంది. దక్షిణాదిన తొలి సామ్రాజ్యాన్ని స్థాపించి, నాలుగు శతాబ్దాలకు పైగా జనరంజక పాలన సాగించారు. అశోకుని తరువాత స్వతంత్ర పాలకులైన వీరు శాంతి కాముకులుగా మెలుగుతూనే శక్తివంతమైన విశాల సామ్రాజ్యాన్ని నిర్మించారు. స్వదేశీ, విదేశీ దండయాత్రలను ఎదుర్కొని శాంతిని నెలకొల్పారు. వైదిక సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించి తర్వాత తరాలకు అందించారు. వీరి రాజధానులు 1. శ్రీకాకుళం 2. ధరణకోట (ధాన్యకటకం) 3. ప్రతిష్ఠానపురం. శాలివాహన రాజులలో గౌతమీపుత్ర శాతకర్ణి చాలా గొప్పవాడు. ఆనాడు భారతావనిలో వున్న రాజులందరితో సఖ్యత సౌభ్రాతృత్వాలను గురించి వివరించి, వారిని తిరస్కరించిన వారితో యుద్ధాలు చేసి లొంగ తీసుకొని తన నాయకత్వంతో 24 సంవత్సరములు సుస్థిర పరిపాలనను సాగించారు. సా.శ. 106 సా.శ. 130 (24 సంవత్సరములు). వారి తరువాత వారి పుత్రుడు వశిష్టపుత్ర అకాపులమావి 111 (24వ రాజు) సా.శ 130 – సా.శ. 158 (28 సంవత్సరాలు), వారి పుత్రుడు శివశ్రీ శాతకర్ణి 25వ రాజు (మ.సా.శ. 158- సా.శ. 172 (7 సంవత్సరాలు) 26వ రాజు శివస్కంద శాతకర్ణి (1. సా.శ. 165- సా.శ. 172 (7 సంవత్సరములు), 27వ రాజు శ్రీ యజ్ఞ శాతకర్ణి (మ.సా.శ. 172 – సా.శ. 201 (29 సంవత్సరాలు) 28 వ రాజు విజయ శాతకర్ణి (1. సా.శ. 201 – సా.శ. 207 (6 సంవత్సరములు) 29వ రాజు చంద్రశ్రీ శాతకర్ణి (మ.సా.శ. 207 – సా.శ. సా.శ. 217 (17 సంవత్సరాలు) 30వ రాజు మూడవ పులుమావి (1 సా.శ. 217 – సా.శ. 224 (7 సంవత్సరాలు) పరిపాలనను సాగించినారు.

ఈ శాతవాహన రాజులలో గౌతమీపుత్ర శాతకర్ణి లేక గౌతమీపుత్ర శాలివాహనుడు 23వ మహారాజు. వారి పూర్వికులు ఆదినుండి.. క్రమంగా (మత్స్య పురాణ ఆధారంగా..)

3. తుళువ వంశం:

శ్రీకృష్ణ దేవరాయలు:

వీరి జీవితకాలం (17-01-1471 to 17-10-1529). వీరు 1509 నుండి 1529 వరకు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఆయన తుళువ రాజవంశపు మూడవ చక్రవర్తి. భారతదేశ చరిత్రలో గొప్ప పాలకులలో ఒకరుగా పరిగణింపబడ్డారు. వారి తండ్రి వీరనరసింహరాయ, తల్లి నాగల దేవి. వారు అనేక యుద్ధాలు చేసి విజయులై ఆంధ్రభోజుడు, కర్ణాటకరత్న సింహాసనాధీశ్వర ప్రభువు, యువసబహమిని సింహాసనరాజ్య స్థాపక, కన్నడ రాజ్య రామ రమణ, గో బ్రహ్మణ ప్రతి పాలక, మూరు రాయుడ గండ (ముగ్గురాజుల ప్రభువు) అనే బిరుదులను పొందారు. బీజాపూర్, గోల్కొండ సుల్తానులను, బహమనీ సుల్తానులను మరియు ఒడిశా గణపతులను ఓడించడం ద్వారా, వారు మన ద్వీప కల్పానికి రాజాధిరాజుగా ఆధిపత్య పాలకులైనారు. కవిగాయకులను తన ఆస్థానమందు ఘనంగా సత్కరించి పోషించారు. వీరు ఆస్థాన కొందరి కవులను అష్ట దిగ్గజములని పిలుస్తారు. వారు అల్లసాని పెద్దన, ధూర్జటి, నంది తిమ్మన, మాధయ్యగారి మల్లన, అయ్యలరాజు, రామభద్రుడు, గార్లపాటి రామకృష్ణ (తెనాలి), రామరాజ భూషణుడు, పింగళి సూరన. కృష్ణదేవరాయల భార్యలు తిరుమల దేవి, చాన్నా దేవి, తుక్కాదేవి (మరో పేరు లక్ష్మీదేవి) వీరి ఆస్థాన మహామంత్రి శ్రీ తిమ్మరసుల వారు, చిన్నతనం నుంచి రాయలును పెంచి విద్యాబుద్ధులను నేర్పి శ్రీకృష్ణ దేవరాయలును గొప్ప యుద్ధవీరుడుగా, పండితునిగా, మహారాజ్య నిర్వాహకునిగా, పండిత భాష, కళాభిమానిగా తీర్చిదిద్దారు. వారు రాయలవారికి పితృ సమానులు.

(ఇంకా ఉంది)

Exit mobile version