Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘మన భారత అవని’ – కొత్త ధారావాహిక ప్రారంభం – ప్రకటన

ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’  అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.

~

మన భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 77 సంవత్సరాలు గడిచాయి. ఓడలు బండ్లు అయినాయి, బండ్లు ఓడలైనాయి. కానీ పేదరికం, మధ్య తరగతి పేదవర్గం వారి కష్టాలు, సమస్యలు తీరలేదు. అభ్యున్నతికి ప్రతి ఒక్క బాలబాలికలకు కావలసింది మంచి విద్య, సుశిక్షణ. ఇంగ్లీష్ మీడియంల మూలంగా అవి రెండూ నశిస్తున్నాయి. డబ్బు.. డబ్బు.. డబ్బు, అన్నింటికీ ఆ ధనం మూలమైంది. ఆ కారణం దిన సంపాదనా స్వార్థంలో జనంలో ఒక వర్గం, తమ స్వార్థంతో చేయరాని పనులు అక్రమంగా ఎన్నో చేస్తున్నారు. అంతేకాక కొందరి దృష్టిలో బాలికలు, స్త్రీలు తోలుబొమ్మలున్న భావన, చులకన, నిరాదరణ, నీచవాంఛ కాముకులై వ్యవహరిస్తున్నారు. వారి చర్యలు వారికి వినోదం ఆనందం. ఎదుటి వారికి ప్రాణాంతకం. డబ్బును ఎలాగైనా సంపాదించాలనే స్వార్థపు ఆశతో మానవతను మరిచి దానవుల వలే చేయరాల వ్యాపారాలు.. దైవ శిలలను (విగ్రహాలను) దొంగతనం చేసి విదేశీయులకు అమ్మకం; స్త్రీ, బాలికలను విదేశీయులకు విక్రయించడం, గంజాయి నల్లమందు, కల్పిత లిక్కర్ల వ్యాపారాలను చీకటి బజార్లలో విచ్చలవిడిగా సాగిస్తూ యువతను నిర్వీర్యులుగా మార్చడం ఒక వర్గం చేసే నీచాతినీచమైన పనులు. భారతదేశ ప్రగతిని సర్వతోముఖంగా చూడాలనే మహత్తర ఆశయంతో కొందరు సమాజాభిమానులు విద్యావంతులు మన దేశ సుచరిత్రలను నాయకులను గురించి అందరికీ తెలియజేసి, ‘మన భారత అవని’లో సుసంపన్నమైన ప్రగతిని సాధించాలనే మహోన్నత నిర్ణయంతో కొందరు ఉత్తములు మరో వర్గం చేసిన పోరాటమే.. ఈ నవల ‘మన భారత అవని’.

~

‘మన భారత అవని’ ధారావాహిక

చదవండి – చదివించండి..

వచ్చే వారం నుంచే..

Exit mobile version