మంచు-మంచు-మంచు
మాయదారి మంచు !
దారులన్ని ముంచు
చెట్టు మీద మంచు
గుట్ట మీద మంచు
తోటలలో మంచు
కంటి ముందే పెంచు
బాటలపై మంచు
రాకపోకలు తెంచు!
ఇళ్ల మీద మంచు
ఊళ్లమీద మంచు
తెల్లనైన మంచు
వెన్నలాంటి మంచు
దూది లాంటి మంచు
వెన్నెలనిపించు
మెత్తగా కనిపించు
కత్తి లా హింసించు
పిల్లలనూరించు
పెద్దలను విసిగించు
మంచు-మంచు-మంచు
మాయదారి మంచు !!.