Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మానేరు నది ఒడ్డున ‘మానేరు తీరం’ ఆవిష్కరణ’ – ప్రకటన

కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ తెలుగులో రచించి తానే స్వయంగా ఇంగ్లీష్ లోకి అనువదించిన ‘మానేరు తీరం’ ద్విభాషా కవితా సంకలనం ఆవిష్కరణ మార్చి 30 సోమవారం సాయంత్రం అయిదు గంటలకు జరుగుతుంది.

కరీంనగర్ పట్టణ కంఠాభరణం అయిన మానేరు నది ఒడ్డున దిగువ మానేరు ఆనకట్ట పై జరిగే ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో కరీంనగర్ కు చెందిన పలువురు సాహితీ వేత్తలు ఆత్మీయులు హాజరవుతారు.

ఈ కవితలు  సౌందర్యాన్ని అలంకరించవు సత్యాన్ని ఆవిష్కరిస్తాయి. వాటిలో ఆశ ఉంది, కానీ అది అలవోక ఆశ కాదు. అది పోరాటం మధ్యలో పుట్టిన ఆశ.

తెలుగు–ఇంగ్లీష్ ద్విభాషా సంచికగా ఈ పుస్తకాన్ని అందించడంలో ఒక ఉద్దేశ్యం ఉంది. ఈ అనుభూతులు ఒక భాషకు మాత్రమే చెందినవి కావు. మనిషికి చెందినవే.

అందరికీ ఇదే మా ఆహ్వానం.

-వి. ఇందిరా రాణి.

పొయెట్రీ ఫోరం పబ్లికేషన్స్

కరీంనగర్ 

Exit mobile version