Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

డా. మంథా భానుమతి, ప్రమదాక్షరి – మకర సంక్రాంతి మినీ నవలల పోటీ 2026 – ప్రకటన

డా. మంథా భానుమతి, ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహిస్తోన్న విశ్వావసు నామ సంవత్సర మకర సంక్రాంతి మినీ నవలల పోటీ 2026 కి ఆహ్వానం.

బహుమతులు:

నిబంధనలు:

  1. ఈ మినీ నవల వర్డ్ లో 50 పేజీలకు మించరాదు.
  2. 10,000 – 13,000 పదాలు ఉండాలి. ఫాంట్ సైజ్ 12. పేజికి సుమారు 250 పదాలు.
  3. భాషా, వ్యాకరణ దోషాలు లేకుండా పంపించాలి. పదికంటే ఎక్కువ తప్పులు ఉంటే ఆ నవలను తిరస్కరిస్తాము.
  4. మీరు వివాదరహితమైన ఏ అంశమైనా తీసుకోవచ్చు. పాఠకులను అలరించేలా, ఆసక్తికరంగా రాయండి.
  5. ఫేస్బుక్, వాట్సాప్, ఇతర పోటీలకు పంపిన, రాసిన నవలలు అంగీకరించబడవు. కొత్తగా రాయండి. కొత్త అంశాలను తీసుకోండి..

మీ మినీ నవల పంపవలసిన చిరునామా: jyothivalaboju@gmail.com

మీ మినీ నవలను పంపడానికి ఆఖరు తేది: డిసెంబర్ 15, 2025

ఫలితాలు సంక్రాంతి సమయంలో ప్రకటించబడతాయి.

బహుమతి పొందిన నవలలన్నీ సంచిక వెబ్ పత్రికలో ధారావాహికలుగా ప్రచురితమవుతాయి.

డా. మంథా భానుమతి

జ్యోతి వలబోజు

Exit mobile version