ఇది ప్రాణాంతక కరోనా తుపాను
కల్లోల పడవలోయావత్ప్రపంచం
ప్రచండవేగపు విషవాయువులు
తీరం జాడలేని సముద్రమధ్యం
శాస్త్రవేత్తలు ఊహించని పరిణామం
పరిశోధకులు చూపలేని పరిష్కారం
స్వీయ మేధకు మురిసిన మనిషి
నిరుత్తరుడై నిలబడిపోయిన వైనం
నిర్వీర్యుడై సాగిలపడిన సందర్భం
అదృశ్య రాకాసి విసురుతున్నపంజా
కని విని ఎరుగని విలయతాండవం
పిట్టల్లా రాలుతున్న జనసందోహం
అదృశ్యశక్తి ఆపద కాయవలసిన కాలం
ధరణీమతల్లి దయచూపవలసిన తరుణం
ప్రకృతిమాత కరుణించవలసిన సమయం

అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.