Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘మరణం మధురం’ – కొత్త ధారావాహిక ప్రారంభం – ప్రకటన

శ్రీ పాణ్యం దత్తశర్మ వ్రాసిన ‘మరణం మధురం’ అనే నవలికని ధారావాహికగా అందిస్తున్నాము.

మరణం అని భావనే మనుషులతో భయాన్ని సృష్టిస్తుంది. మరణం మీద ప్రయోగాలు చేస్తే?  తుంగభద్రమ్మ ఒడ్డున, ఒక గుట్ట. దాని మీద వ్యత్యస్తపాదారవిందుడైన వేణుగోపాలుడు. అష్టభుజములతో అలరారే నారసింహుడు. సంస్కార సంప్రదాయ శోభితురాలైన కథానాయిక. కులవృత్తిని నిర్వహిస్తూనే విద్యాధికుడై, విశేష వ్యక్తిత్యాన్ని సంతరించుకున్న కథానాయకుడు. అతనికి బహిఃప్రాణమైన ఒక స్నేహితుడు. అతడొక మూర్తీభవించిన సౌజన్యం.

అంతా సజావుగా జరిగితే, జీవితాల్లో థ్రిల్ ఏముంటుంది? కాని ‘థ్రిల్’ కోసం, సహజత్వాన్ని బలిచేయాలని చూస్తే?

‘అసలు కలలెందుకు వస్తాయి?’.

సాహిత్యంలో ‘కావ్యార్థ సూచన’ లాగా కలలు రాబోయే సంఘలునలకు సూచికలా? కలలు నిజమవుతాయా? కలలతో జీవితాలు ప్రభావితమవుతాయా?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాన్ని, తన రమ్యమైన కథనంతో, పాత్రోచితణతో సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.

ఇది మనోవైజ్ఞానిక, మనోవిశ్లేషణాత్మక నవలిక కాదు. ఈ రెండింటినీ, ఫిక్షన్ అనే పంచదార పూత పూసి, ఉత్కంఠభరితంగా సాహిత్యానికి జీవగఱ్ఱ ఐన మానసికోల్లాసానికి కావలసినంత విందుగా పాఠకులకు అందించే నవలిక ‘మరణం మధురం’. అది ఎందుకు మధురమైనదో తెలుసుకోవాలంటే సీరియల్ చదవాల్సిందే.

~

వచ్చే ఆదివారం నుంచి ప్రారంభం!

మరణం మధురం

చదవండి చదివించండి.

Exit mobile version