Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరోసారి విన్నవించుకుంటున్నాను

[శ్రీ బొందయ్య ఆడేపు రచించిన ‘మరోసారి విన్నవించుకుంటున్నాను’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

చెట్లని మట్టుపెట్టాలనుకుంటున్నవాళ్లకి
మరోసారి విన్నవించుకుంటున్నాను
మండుటెండల భగభగలు
వడగాడ్పుల భుగభుగలు
తగలకుండా శీతలీకరణ గదుల్లో
తప్పించుకొని తలదాచుకుంటున్న
కుహనా ప్రగతిశీలులకి
మరోసారి విన్నవించుకుంటున్నాను
బాటలు మరింత వెడల్పు వేస్తామని
భవనాల్నినిలువుగా కట్టేస్తామని
నీటి సరఫరా మెరుగుపరుస్తామని
మురుగు కాలువల్ని లోతు చేస్తామనే
వృక్షహంతకులకు
మరోసారి విన్నవించుకుంటున్నాను
చెట్లు సేదతీర్చే ఆశ్రమాలు
చెట్లు ప్రాణవాయువు పవనాలు
చెట్లు ఫల సంపదలిచ్చు కామధేనువులు
చెట్లు వర్ణరంజిత నయనానందాలు
అందుకే చెట్లని పెంచుకుందాం
మనందరం కలిసి చెట్లని కాపాడుకుందాం.

Exit mobile version