Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరువకు ఓ నేస్తమా

[వాణి వేమవరపు గారు రచించిన ‘మరువకు ఓ నేస్తమా’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

దిలో నన్ను మరువకు ఓ నేస్తమా,
మధురమైన ఓ తీయని బంధమా,
వెతలను వదిలి స్నేహ మధురిమలో తేలుదాం,
అనిర్వచనీయమైన గత జ్ఞాపకాలని గ్రోలుదాం.

స్నేహానికి రోజు పరిమితి కాదు,
నేస్తం కలిసిన ప్రతిరోజు పండగే,
విరిసిన చిరునవ్వు ఓ వసంతమే,
కురిసిన మాటల మూట ఓ జలపాతమే.

మరుజన్మ మాటేమో కానీ,
ఆజన్మాంతం వదలని నేస్తమై ఉండు,
వెన్నంటి ఉండే భగవంతుడిని వేడుదాం,
అద్భుతమైన ఈ స్నేహబంధానికై కోరుదాం

ఓ స్నేహమా నన్ను మరువకు,
ఓ నేస్తమా మరి ఈ చేయి వదలకు.

Exit mobile version