
శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారి ‘మథనం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.
~
ఆడపిల్లల పట్ల సమాజ దృక్పథం పూర్వం మీద మారింది. పట్టణ ప్రాంతాలలో అయితే మగ, ఆడ తేడా లేదు. కానీ మారుమూల పల్లెల్లో మాత్రం ఇప్పటికీ ఆడపిల్లకి పెళ్ళి వయసు పదహారేళ్ళ లోపే. దాని వలన జరిగే విపరీత పరిణామాలు హృదయవిదారకం. ప్రతీ ఆడపిల్ల తన కాళ్ళ మీద తాను నిలబడాలి. ఆర్ధిక స్వాతంత్ర్యం తెచ్చుకోవాలి. సంసారంలో నిర్ణయాధికారంలో పాలు పంచుకోవాలి. తద్వారా ఆ కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి.
ఒక వ్యక్తిగా, స్త్రీ గా, ఉపాధ్యాయినిగా పల్లెల్లో ఈ మార్పు రావాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ, ఆడపిల్లల బాల్య వివాహాలు – పరిణామాలు ప్రాతిపదికగా శ్రీమతి రాయప్రోలు సుజాతాప్రసాద్ గారు వ్రాసిన నవలను పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
~
చదవండి.. చదివించండి
‘మథనం’
వచ్చే వారం నుంచే
