Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మెదడు పనితీరు

సహజమైన, ప్రాథమికమైన లయ మెదడు వ్యవస్థ పనితీరును క్రోడీకరించగలదు. ఆధునాతమైన సాంకేతిక పరికరాలతో వేరు వేరు ఫ్రీక్వెన్సీలతో మెదడు పనితీరును సమానంతరంగా శాస్త్రీయ విధానాలతో పరిశీలించినప్పుడు.. ఫ్రీక్వెన్సీ 0.2 Hz నుండీ 100 Hzల వరకు ఉందని తేలింది. కృత్రిమ మేధ సాంకేతికత కారణంగా రాగల దుష్పరిణామాలను అంచనా వేసి నివారించగలడానికి సన్నద్ధం కావడంలో భాగంగా జరుపబడిన అధ్యయనంలో –  ససెక్స్ యూనివర్శిటీ కన్సల్టెంట్ ప్రొఫెసర్ ఒకరు ‘కాగ్నిటివ్ ఫంక్షనింగ్ ఇండెక్స్’ (C.F.I) లో గుర్తించిన అంశాలివి.

2022 MRI స్టడీ 40 మంది ఆరోగ్యవంతులైన వలంటీర్లపై జరిపిన పరిశోధనలలో 140°F /40°C ఉష్టోగ్రతలను మించిన వాతావరణంలో కూడా మధ్యాహ్న సమయాలలో మెదడు అంతర్బాగాలు క్రియాశీలకంగానే ఉన్నాయి. ఆ సమయంలో వారి జ్ఞాపక శక్తి మామూలుగానే  ఉంది. ‘ఆర్కెస్ట్రేటెడ్ ఆబ్జెక్టివ్ రిడక్షన్’/పెన్‌రోజ్ థియరీ ప్రకారం మెదడు తరంగాల పనితీరు దెబ్బతిన్నప్పుడు మెదడు అప్రమత్తం అవుతుంది/చేయబడుతుంది. ఈ అప్రమత్తత న్యూరాన్ల స్పందనల కంటే వేగంగా పని చేస్తుంది. ఆ స్థితిలో స్పేస్ లోని పార్టికల్స్‌తో సైతం వాటి దూరంతో సంబంధం లేకుండా మెదడు తరంగాలు (పనితీరు దెబ్బతిన్న స్థితిలో) అనుసంధానం చెందగల అవకాశం ఉంది. మన మెదడులోని ప్రతి న్యూరాన్‌ని ఆవరించి ఉండే అతి చిన్న ప్రొటీన్ ట్యూబ్‌లెట్స్‌లో ఎక్కడైనా ఈ క్వాంటమ్ చర్య జరిగే  అవకాశం ఉంది.

అయితే ఇది సాంప్రదాయ భౌతికశాస్త్ర సిద్ధాంతానికి విరుద్ధం. మెదడులోని సమాచార వ్యవస్థల నడుమ జరిగే రసాయన, విద్యుత్, సంకేతాల ఫలితంగా ఉద్భవించేదే స్పృహ/చేతన అని న్యూరో సైన్స్ చెప్తుంది.

నిద్ర, శస్త్రచికిత్సలు వంటి సందర్భాలలో కాన్షస్‌నెస్/స్పృహ ఆన్/ఆఫ్ అయ్యే ప్రక్రియను అధ్యయనం చేయడానికి పుర్రెలో టెర్రాహెర్జ్ స్కానర్స్ (నాన్ ఇన్వేసివ్) తో మైక్రో ట్యూబ్‌లెట్స్ రెసానెన్స్‌ను పరిశీలించడం జరిగింది.

క్వాంటమ్ ప్రాసెస్ మనందరినీ సమస్త సృష్టితో అనుసంధానిస్తోంది. రెండు లేక అంతకు మించిన పార్టికల్స్ ఎంత గాఢమైన బంధాన్ని కలిగి ఉంటాయంటే అవి పరస్పరం ఎంత దూరంలో ఉన్నాయన్న దానితో సంబంధం లేకుండా ఒక పార్టికల్ ఉన్న స్థితిని మరొక పార్టికల్ ప్రభావితం చేయగలదు.

క్వాంటమ్ అనుసంధానంలో ధర్మాలు – స్పిన్, పోలరైజేషన్ లేదా మూమెంటమ్ ఎంత అంతర్ సంబంధాన్ని కలిగి ఉంటాయంటే (ఒకేలా) ఒక పార్టికల్ స్థితిని పరిశీలిస్తే రెండో దాని పరిస్థితిని తెలుసుకున్నట్లే. దీన్నే ఐన్‌స్టీన్ ‘స్పూకీ ఏక్షన్ ఎట్ ఎ డిస్టెన్స్’ (Spooky action at a distance) గా అభివర్ణించారు.

ఏనాడో నోబుల్ లారెట్స్ రోజర్ పెన్‌రోజ్, స్టువర్ట్ హమ్‍రాఫ్ మెదడులోని మైక్రో ట్యూబ్‌లెట్స్‌లో క్వాంటమ్ ఈవెంట్స్ జరగగలవని ప్రస్తావించి గట్టిగా వాదించారు కూడా. మానవ మస్తిష్కం తాలూకు చేతనావస్థ (కాన్సస్‌నెస్) వేవ్ ఫంక్షన్ కోలాప్స్/ఉపస్థితిలలో గురుత్వాకర్షణ ప్రభావం ఉంటుందని ఆయన ప్రతిపాదించి గట్టిగా వాదించారు కూడా.

సృష్టిలో ప్రతి ప్రాణీ పంచభూతాత్మకమైనదే.

సృష్టి పంచభూతాత్మకమైనపుడు అంతకు మించిన మాధ్యమం లేదు కదా!

Exit mobile version