Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మేమిరువరం ఒక్కటే

[డా. బి. హేమవతి రచించిన ‘మేమిరువరం ఒక్కటే’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

మేమిరువరం ఒక్కటే
కానీ మాది తాళి బంధం కాదు
యుగాలుగా కలిసే ఉన్నాము ఒకే గూటిలో
ఆమె నా సహచరి

ప్రేమ చివరికంటూ ముగిసేది పెళ్ళితోనయితే
మాది మూడుముళ్ళ బంధం కాదు
పెళ్ళి రెండు హృదయాలని కలిపేదైతే
మాది ఏడడుగుల సంబంధం
అతను నా సహచరుడు

చేతిలో చేయి వేసి
ముడుపులు కట్టలేదు మేము
ఒక స్ట్రా తో రెండు మనస్సులను కలిపాము మేము
బైక్ పై షికార్లు కొట్టలేదు
కానీ బైండ్ ఓవర్ అయ్యాము
ఒకరం మరొకరికి
జన్మజన్మలకి..

Exit mobile version