[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘మేటి మనిషి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
రోజూ
రంగుల మెరుపులు
మాటల తాళాలు
పాదాలకు పచ్చి అబద్ధాల చక్రాలు
బొడ్డులో సిద్ధంగా నాలుగు విషమూలికలు
అర్ధరాత్రి దాకా పిట్టగోడపై అవకాశవాదం
చప్పుడు కాని చొరబాటు
మడమ తిప్పని మాయావాదం
అమాంతం మనిషిలోకి దూకి
మనసులో తేలే విద్యే విద్య
బొట్టు రక్తం వదలక పేల్చే స్వార్థమే
నేటి మేటి మనిషి..
