Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మిరియాలు

[‘మిరియాలు’ అనే పేరుతో ఐదు చిన్న కవితలని అందిస్తున్నారు శ్రీ రేడియమ్.]

యూరియా బస్తాలు
దక్కని రైతు గోస
గోడు గోదారి

దోమల విందు
బస్తీ అంతట సుస్తీ
వైద్యం కరువు

ధర్మ నిరతి
సర్వ మానవ శోభ
ప్రకృతి వరం

ముదిమికి ‘డీ’
దేహానికి విటమిన్
నిండు యవ్వనం

పోటీ ప్రపంచం
మానసిక సవాళ్లు
దృఢ సంకల్పం

Exit mobile version