Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-10

[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

చాప్టర్ 11.

క్రైస్తవ మతం స్వతంత్రంగా అభివృద్ధి చెందిందా? లేదా విశ్వవ్యాప్తంగా వివిధ నాగరికతల మధ్య పరస్పర వ్యాప్తి, సమన్వయం, కలబోతల నుంచి మత సంప్రదాయాలు రూపుదిద్దుకున్నాయా? ఈ ప్రశ్నకు రెండవదే సమాధానం అని అనిపిస్తుంది. 19వ శతాబ్దంలో నికోలస్ నొటోవిచ్ క్రీస్తు అదృశ్య సంవత్సరాలలో భారతదేశానికి వచ్చినట్టుగా ఇక్కడి బౌద్ధ ఆరామాలను సందర్శించినట్టుగా పేర్కొన్నాడు. అదే పరంపరలో చాలామంది యురోపియన్ చరిత్రకారులు 20వ శతాబ్దంలో క్రైస్తవ మతం.. ఇతర మతాలతో దానికి ఉన్న సమన్వయం, దాని సంప్రదాయాలలో వివిధ ప్రాంతాల సాంస్కృతిక సంబంధాలను విశ్లేషించారు. అందులో ఒక చరిత్రకారుడు ఆర్థర్ లిల్లీ.  ఆర్థర్ లిల్లీ క్రైస్తవ మతానికి మరో సిద్ధాంతాన్ని వినూత్నంగా ప్రతిపాదించాడు. ఇప్పుడు మనం చూసే క్రైస్తవానికి, అంతకు ముందు ప్రారంభంలో ఉన్న క్రైస్తవానికి చాలా తేడా ఉన్నది. ఈ ప్రారంభ క్రైస్తవం కేవలం యూదు మతం నుంచి మాత్రమే అవతరించలేదని, భారతీయ శైవ, యోగ, బౌద్ధ సంప్రదాయాలతో కూడా సంబంధాలున్నాయని సాపేక్షకంగా పోల్చి పేర్కొన్నాడు.

The astonishing points of contact (ressemblances étonnantes) between the popular legend of Buddha and that of Christ, the almost absolute similarity of the moral lessons given to the world, at five centuries’ interval, between these two peerless teachers of the human race, the striking affinities between the customs of the Buddhists and of the Essenes, of whom Christ must have been a disciple, suggest at once an Indian origin to Primitive Christianity.” (India in primitive Christianity, Arthur Lillie .p.1)

చరిత్ర అధ్యయనంలో ఈ పరిశోధన చాలా కీలకమైనదిగా భావిస్తారు. India in primitive Christianity పేరుతో ఆర్థర్ లిల్లీ వెలువరించిన పరిశోధన గ్రంథంలో ఆయన అనేక అంశాలను చర్చించారు. ఈ పరిశోధనకు చారిత్రక ఘటనలు మాత్రమే కాకుండా మతపరమైన ఆచారాలు, ప్రాచీన సాహిత్యం, ఫిలాసఫీ, కళలు, ప్రతీకలు, భాషా సారూప్యతలు, వాణిజ్య సంబంధాలు అన్నీ కలిపి ఒక సమగ్రమైన సవిస్తరమైన విశ్లేషణాత్మకమైన మత పరిశోధనను ఆర్థర్ లిల్లీ మన ముందుంచారు. దీన్ని తిరస్కరించిన వారు ఉన్నారు. మెచ్చుకున్నవారు ఉన్నారు. కానీ ఆయన ప్రతిపాదనలను మాత్రం ఎవరూ పూర్తిగా ఇగ్నోర్ చేయలేని పరిస్థితి. ఈ రచన ఈ రోజుకూ పరిశోధన వస్తువుగా కొనసాగుతూనే ఉన్నది.

భారతదేశానికి క్రైస్తవం పుట్టడానికి చాలా ముందు నుంచే పశ్చిమ దేశాలతో, ముఖ్యంగా మధ్యధరా సముద్ర తీరంలోని వివిధ దేశాలతో రాకపోకలు, వాణిజ్య సంబంధాలు కొనసాగాయని మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలో అలెగ్జాండర్ భారతదేశం దాకా దండయాత్ర చేసిన తరువాత మౌర్యుల కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న ఇండో గ్రీకు రాజ్యాల మధ్యన సంబంధాలు ఇంకా బలపడ్డాయి. సిల్క్ రోడ్డు ద్వారా, సముద్ర మార్గం ద్వారా వ్యాపార లావాదేవీలు కొనసాగాయి. అరేబియా సముద్ర తీరంలోని మలబారు రేవు నుంచి సింధ్ తీరం దాకా ఉన్న ఓడరేవుల నుంచి ఎర్ర సముద్రం, ఈజిప్టు తదితర ప్రాంతాలకు మిరియాలు, ఏనుగు దంతాలు, రత్నాలు, వస్త్రాలు మాత్రమే కాకుండా మతాలు, తత్త్వాలు కూడా ప్రయాణించాయి. భారతదేశపు దక్షిణ ప్రాంతంలో లభించిన రోమన్ నాణాలు, ఈజిప్టులో లభించిన భారతీయ వస్తువులు, గ్రీకు రోమన్ గ్రంథాలలో ప్రస్తావనలో ఉన్నభారతీయ తాత్త్విక భావనలు అన్నీ కూడా భారత్‌తో పశ్చిమాసియాకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తాయి. మరోవైపు ప్రఖ్యాత అలెగ్జాండ్రియా లైబ్రరీకి సంబంధించిన పదుల సంఖ్యలోని ప్రముఖ శాస్త్రవేత్తలు, తత్త్వవేత్తలకు భారతీయ తత్త్వశాస్త్రంతో, సంప్రదాయంతో అతి దగ్గరి సంబంధం ఉన్నది. ఈ గ్రంథాలయానికి రోమ్, ఇటలీ, భారత్, ఈజిప్టు, పర్షియా లాంటి ప్రాంతాల నుంచి అనేక మంది తత్త్వవేత్తలు వచ్చివెళ్లారనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తూర్పు పశ్చిమాల మధ్యన మేధో సంపత్తి మార్పిడికి అలెగ్జాండ్రియా కేంద్రంగా ఉండింది. వీటికి తోడుగా అశోకుడి శాసనాల్లో యవన రాజ్యాలకు ధర్మ ప్రచారకులను పంపించినట్టుగా కూడా మనకు కనిపిస్తాయి. పశ్చిమాసియాకు బౌద్ధ భిక్షువులు చేరడం వల్ల అక్కడి మతపరమైన వర్గాలపై కచ్చితంగా వారి ప్రభావం ఉంటుంది.

In the last century these analogies were set down to the Nestorians, but since then the science of Oriental chronology has come into being, and proved that Buddha is many years anterior to Nestorius and Jesus. Thus the Nestorian theory had to be given up. But a thing may be posterior to another without proving derivation. So the problem remained unsolved until recently, when the pathway that Buddhism followed was traced step by step from India to Jerusalem….. The main postulate of my work was that the monks and mystics in Egypt and Palestine were in close touch with the Buddhist monks in India. How did S’iva-Buddhism affect them? Immensely. The task at first appeared too much for me. But I found a great difficulty in throwing over the matter altogether, and I subsequently got leisure to take it up in earnest.” (p.3, 5)

అయితే వాణిజ్య బంధం ఉన్నంత మాత్రాన మత ప్రభావాన్ని ఎలా నిర్ధారిస్తారని ఆధునిక చరిత్రకారులు వాదించవచ్చు. కానీ, భారతదేశంలోకి పోర్చుగీసులు, ఫ్రెంచివారు, బ్రిటిషర్లు వచ్చినప్పుడు వ్యాపారంతో పాటు, మతాన్ని కూడా తీసుకొని వచ్చిన చారిత్రక సత్యాన్ని విస్మరించకూడదు.

క్రైస్తవ మతం ప్రారంభమైంది మొదటి శతాబ్దంలో అని చెప్పుకుంటున్నప్పటికీ, మూడో శతాబ్దం దాకా దాని విస్తరణ వాదం ప్రారంభం కాలేదు. క్రైస్తవం ప్రారంభం కావడానికి ముందే పశ్చిమాసియా ప్రాంతంలో, యూరప్ ప్రాంతంలోని నాగరిక, సంస్కృతుల మధ్యన ఒక తెగని లంకె కొనసాగుతున్నది. ఈ చారిత్రక నేపథ్యాన్ని విశ్లేషించకుండా క్రైస్తవ మత సంప్రదాయాన్ని, చరిత్రను విశ్లేషించడం ఒకవిధంగా అసంపూర్ణమే అవుతుంది. మనం ఒకసారి మెగస్తనీస్‌ను అధ్యయనం చేస్తే ఇంకొంత స్పష్టత వస్తుంది. గుప్తుల రాజ్యసభలో మెగస్తనీస్ గ్రీకు రాయబారిగా ఉన్న విషయం తెలిసిందే. భారతీయ సమాజం, తత్త్వవేత్తలు, సన్యాసులు, బ్రాహ్మణులు, శ్రమణుల చరిత్రను మెగస్తనీస్ రికార్డ్ చేశాడు. గ్రీకు ప్రపంచానికి మెగస్తనీస్ సమాచారం చేరింది. అంతే కాకుండా అశోకుడి శాసనాల్లో యవన రాజులు, సిరియా, ఈజిప్టు, మెసడోనియా ప్రాంతాలకు క్రీస్తు పుట్టడానికి మూడు వందల ఏండ్లకు ముందే బౌద్ధ సన్యాసులు వెళ్లినట్టు మనకు అర్థమవుతుంది. సహజంగానే భారతీయ ఆధ్యాత్మిక, తాత్వ్తిక నైతిక చింతనను ఈ సన్యాసులు ఆ ప్రాంతాలకు తీసుకొని వెళ్లారు. A recent and more careful study of the king’s inscriptions has proved to me that his. Sangharâmas, the establishments that he set up upon roads and in jungles, were all of a pattern and all complete. They were for utilitarian as well as religious purposes. The problem before the king was to send abroad his laws, his religion, his commerce, his officials wherever he could, and especially to reclaim and pierce the vast jungles of his dominions. These had potent sentries, the tiger and the fever. The Indian epics tell us how these were dreaded. Thus roads, wells, herbs for medicines, grain for food, and trees for shade, would be required everywhere, for each Sangharâma was a rude caravanserai, hospital, college, monastery, church, burying-ground, as well as a collection of little leafy pansils where the ascetic could dream his dreams of God. This gives the Girnar rock-inscription an importance that it is impossible to estimate. If Asoka spread through the dominions of Antiochus his “root drugs and herbs,” and his “medical aid for men and animals,” the remainder of the Sangharâma, the religion and the fasting monks, must have been present likewise, a pregnant fact. Let us read the passage carefully. ” And moreover within the dominions of Antiochus, the Greek king of which the generals of Antiochus are the rulers, everywhere the double system of medical aid of the Beloved of the Angels (Asoka) is established, both medical aid for men and medical aid for animals.” Indeed, these conclusions are completely confirmed by a second passage on the Girnar Rock. ” And the Greek king besides, by whom the four Greek kings (Chapta Yona rajah) Ptolemaios, and Gengakcnos and Magas… have been induced to permit… both here and in foreign countries everywhere (the people) follow the doctrine of the religion of Devanampiya (the friend of the Angels) wherever it reacheth.” (p.162, 163)

పశ్చిమాసియాలో క్రైస్తవానికి ముందు యూదు మతంలో భాగంగా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంనాటి ఎస్సీన్‌లు (essenes) అనుసరించిన బౌద్ధ చింతనకు మధ్యన ఉన్న సారూప్యతలను ఒకసారి విశ్లేషిస్తే.. అనేక అంశాలు అవగతమవుతాయి. ఎస్సీన్‌లు సాధారణ యూదు సమాజానికి దూరంగా నివసించేవారు. ఏసు ఈ ఎస్సీన్ ల సభ్యుడని నికోలస్ నొటోవిచ్ పేర్కొన్నారు. ఏసు కాలంలో ఆ ప్రాంతంలో ఉన్న ఆధ్యాత్మిక వాతావరణంపై ఎస్సీన్‌ల ప్రభావం గణనీయంగా ఉన్నదనటంలో సందేహంలేదు. ఇలాంటి ఎస్సీన్‌ల జీవనవిధానం బౌద్ధ భిక్షువుల జీవన విధానంతో సారూప్యత కలిగి ఉంటుంది. బౌద్ధులు తమ వ్యక్తిగత సంపదను విడిచిపెట్టి సంఘ జీవితాన్ని గడుపుతారు. ఎస్సీన్‌లు కూడా అదే విధంగా వ్యక్తిగత ఆస్తిని సంఘానికి అంటే సమాజానికి అప్పగించి ఉమ్మడి జీవితం గడిపేవారు. ఈ విషయాలను అనేక మంది యూదు రచయితలు కూడా నిర్ధారించారు. మరో సారూప్యత ఏమిటంటే బౌద్ధంలో సంసారంలో ఉండే గృహస్తు అన్నింటినీ వదిలేసి భిక్షువుగా మారాలని అనుకున్నప్పుడు ప్రవ్రజ్య అనే దీక్ష తీసుకుంటాడు. బుద్ధుడి త్రిపీటికలను శరణు కోరుకుంటాడు. ఆ తరువాత కాషాయ వస్త్రాలు ధరించి పది రకాల నియమాలు పాటిస్తూ కొన్ని నెలల పాటు దీక్ష చేస్తాడు. ఆ తరువాత అతడికి పూర్తిస్థాయి భిక్షువుగా అర్హత లభిస్తుంది. ఎస్సీన్‌లకు కూడా అంతే. ఎస్సీన్‌లలో ఒక వ్యక్తిని చేర్చుకోవడానికి ఒకటి రెండు సంవత్సరాల పాటు పరీక్షలు నిర్వహించి ఆ తరువాత దీక్షను ఇచ్చేవారు. ఈ విషయాన్ని ప్రముఖ ప్రాచీన రచయిత జోసెఫస్ తన గ్రంథం the life of Flavius లో ఎస్సీన్‌ల గురించిన ప్రస్తావనలో పేర్కొన్నాడు. బౌద్ధులు బ్రహ్మచర్యం పాటిస్తారు. భిక్షువులకు బ్రహ్మచర్యం అనేది ప్రధాన నియమం. ఎస్సీన్‌లలో కొన్ని వర్గాలు బ్రహ్మచర్యాన్ని కచ్చితంగా పాటిస్తాయి. ఎస్సీన్‌లలో వివాహిత శాఖలు కూడా ఉన్నాయి. కానీ బ్రహ్మచర్యానికి ప్రాధాన్యం ఎక్కువ. వస్త్రధారణ విషయంలో కూడా బౌద్ధులు, ఎస్సీన్‌లు అత్యంత సాధారణ వస్త్రధారణకే ప్రాధాన్యం ఇస్తారు. ఇది వైరాగ్యానికి, ఇంద్రియ మోహాల విసర్జనకు ప్రతీక. ఇద్దరూ కూడా ఆహార విషయంలో నియమాలను పాటిస్తారు. తామసాన్ని రేకెత్తించని సాత్త్విక ఆహారాన్ని స్వీకరిస్తారు. అంతే కాకుండా భోజనానికి ముందు ప్రార్థన చేయడం తప్పనిసరిగా పాటిస్తారు. నియమిత సమయాలలో మాత్రమే ఆహారం స్వీకరిస్తారు. ఆహారంతో ఆధ్యాత్మికతను అనుసంధానించడం ప్రత్యేకత. బౌద్ధులు, ఎస్సీన్లు కూడా సూర్యోదయానికి ముందు ఆధ్యాత్మిక ప్రార్థనలు చేసేవారు. జోసెఫస్ కూడా ఎస్సీన్స్ జీవన విధానంలో ఇదొక భాగమని వివరించాడు. ఎస్సీన్‌లు తరచూ పవిత్ర ప్రార్థనలు చేసేవారు. ధార్మికంగా శుద్ధి కావడం అనేది ఈ పవిత్ర స్నానాలలో కనిపిస్తుంది. తరువాతి కాలంలో మతమార్పిడులలో భాగంగా పవిత్ర స్నానాలు చేయించడం ద్వారా బాప్టిజం ఇప్పించడం క్రైస్తవంలో అత్యంత ప్రధానమైన తంతుగా కొనసాగుతూనే ఉన్నది. బౌద్ధంలో శుభ్రత, నియబద్ధత అన్నది ప్రధానమైన నియమంగా ఉంది. ఈ సారూప్యతలను విడివిడిగా గమనించినప్పుడు అన్నీ కూడా యాదృచ్చికంగానే కనిపించవచ్చు. కానీ ఈ లక్షణాలన్నీ, జీవన విధానం అంతా కూడా రెండు సమాజాలలో ఒకే కాలంలో, ఒకే విధంగా ఇంత సమానంగా ఆధ్యాత్మిక భావనలు, ప్రతీకలు ఎలా కనిపిస్తున్నాయి? కరుణ, క్షమించడం, వైరాగ్యం, శత్రుప్రేమ, అంతరంగ శుద్ధి, వినయం, దానం వంటివి రెండు ప్రధాన సంప్రదాయాల్లో ఒకే విధమైన రూప నిర్మాణంతో కనిపించడం యాదృచ్చికం కాదు. ఒకదాని ప్రభావం మరొకదానిపై ఎలా చూపించిందో ఇది స్పష్టంగా తెలియజేస్తున్నది. భారతీయ సన్యాస సంప్రదాయాలతో ఎస్సీన్స్ జీవన విధానం ఏకరూపంలో కనిపిస్తుంది. (ది ఇండియా ఇన్ ప్రిమిటివ్ క్రిస్టియానిటీ పే.165-168)

The Abbé Huc on the close similarity of Christian and Buddhist rites—Confirmed by Fathers Disderi and Grueber—Rev. S. Beal on a Buddhist liturgy—Mr. Fergusson holds that the various details of the Christian Basilica have been taken from the temples of the Buddhists—On which side was the borrowing?—Arguments pro and con.

I have left myself little space to write of the many points of close similarity between the Buddhists and the Roman Catholics.

The French missionary, Huc, in his celebrated travels in Thibet, was much struck with this similarity.

“The crozier, the mitre, the dalmatic, the cope or pluvial, which the grand lâmas wear on a journey, or when they perform some ceremony outside the temple, the service with a double choir, psalmody, exorcisms, the censer swinging on five chains and contrived to be opened and shut at will, benediction by the lâmas, with the right hand extended over the heads of the faithful, the chaplet, sacerdotal celibacy, Lenten retirements from the world, the worship of saints, fasts, processions, litanies, holy water—these are the points of contact between the Buddhists and ourselves.”

Listen also to Father Disderi, who visited Thibet in the year 1714. “The lâmas have a tonsure like our priests, and are bound over to perpetual celibacy. They study their scriptures in a language and in characters that differ from the ordinary characters. They recite prayers in choir. They serve the temple, present the offerings, and keep the lamps perpetually alight. They offer to God corn and barley and paste and water in little vases, which are extremely clean. Food thus offered is considered consecrated, and they eat it. The lâmas have local superiors, and a superior-general.”

Father Grueber, with another priest, named Dorville, passed from Pekin through Thibet to Patna in the year 1661. Henry Prinsep † thus sums up what he has recorded:—

“Father Grueber was much struck with the extraordinary similarity he found, as well in the doctrine as in the rituals, of the Buddhists of Lha Sa, to those of his own Romish faith. He noticed, first, that the dress of the lâmas corresponded to that handed down to us in ancient paintings as the dress of the Apostles. Second, that the discipline of the monasteries and of the different orders of lâmas or priests bore the same resemblance to that of the Romish Church. Third, that the notion of an Incarnation was common to both, so also the belief in paradise and purgatory. Fourth, he remarked that they made suffrages, alms, prayers, and sacrifices for the dead, like the Roman Catholics. Fifth, that they had convents filled with monks and friars to the number of thirty thousand, near Lha Sa, who all made the three vows of poverty, obedience, and chastity, like Roman monks, besides other vows. Sixth, that they had confessors licensed by the superior lâmas or bishops, and so empowered to receive confessions, impose penances, and give absolution. Besides all this there was found the practice of using holy water, of singing service in alternation, of praying for the dead, and of perfect similarity in the customs of the great and superior lâmas to those of the different orders of the Romish hierarchy. These early missionaries further were led to conclude, from what they saw and heard, that the ancient books of the lâmas contained traces of the Christian religion, which must, they thought, have been preached in Thibet in the time of the Apostles.”

In the year 1829 Victor Jacquemont, the French botanist, made a short excursion from Simla into Thibet. He writes: “The Grand Lâma of Kanum has the episcopal mitre and crozier. He is dressed just like our bishops. A superficial observer at a little distance would take his Thibetan and Buddhist mass for a Roman mass of the first water. He makes twenty genuflexions at the right intervals, turns to the altar and then to the congregation, rings a bell, drinks in a chalice water poured out by an acolyte, intones paternosters quite of the right sing-song—the resemblance is really shocking. But men whose faith is properly robust will see here nothing but a corruption of Christianity.”

It must be borne in mind that what is called Southern Buddhism has the same rites. St. Francis Xavier in Japan found Southern Buddhism so like his own that he donned the yellow sanghati, and called himself an apostle of Buddha, quieting his conscience by furtively mumbling a little Latin of the baptismal service over some of his “converts.”

This is what the Rev. S. Beal, a chaplain in the Navy, wrote of a liturgy that he found in China:—

“The form of this office is a very curious one. It bears a singular likeness in its outline to the common type of the Eastern Christian liturgies. That is to say, there is a ‘Proanaphoral’ and an ‘Anaphoral.’ portion. There is a prayer of entrance (τῆς εἰσοδου), an ascription of praise to the threefold object of worship (τρισαγίον), a prayer of oblation (τῆς προσθεσεως), the lections, the recitations of the Dharani (μυστηριον), the Embolismus, or prayer against temptation, followed by a ‘Confession’ and a ‘Dismissal:'”

Turning to architecture, I must point out that Mr. Fergusson, the leading authority in ancient art was of opinion that the various details of the early Christian basilica—nave, aisle, columns, semi-domed apse, cruciform ground plan—were borrowed en bloc from the Buddhists. Relic-worship, he says, was certainly borrowed from the East. Of the rock-cut temple of Kârle (B.C. 78) he writes:—

“The building resembles, to a great extent, an early Christian Church in its arrangements, consisting of a nave and side aisles terminating in an apse or semi-dome, round which the aisle is carried…. As a scale for comparison, it may be mentioned that its arrangements and dimensions are very similar to those of the choir of Norwich Cathedral, and of the Abbaye aux Hommes at Caen, omitting the outer aisles in the latter buildings.

“Immediately under the semi-dome of the apse, and nearly where the altar stands in Christian churches, is placed the Dâgoba.”

The list of resemblances is by no means exhausted. The monks on entering a temple make the gesture that we call the sign of the cross. The Buddhists have illuminated missals, Gregorian chants, a tabernacle on the altar for oblations, a pope, cardinals angels with wings, saints with the nimbus. For a full account I must refer the reader to my “Buddhism in Christendom.”  (P.218).

తరువాతి కాలంలో కూడా ఎస్సీన్స్, బౌద్ధానికి ఉన్న సారూప్యత క్యాథలిక్కులలో కనిపిస్తుంది. లామాల మాదిరిగానే క్యాథలిక్కుల పూజారులు శిరోముండనం చేసుకుంటారు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ప్రత్యేక భాషలో గ్రంథాలను స్వాధ్యాయం చేస్తారు. సామూహిక ప్రార్థనలు, సేవలు చేస్తారు. దీపాలను వెలిగిస్తారు. ధాన్యాలు, నీరు నైవేద్యంగా సమర్పించి స్వీకరిస్తారు. ఈ సారూప్యతలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. దక్షిణాన గోవా ఇంక్విజిషన్ ప్రారంభానికి కారకుడైన ఫ్రాన్సిస్ జేవియర్ కూడా బౌద్ధ భిక్షువులాగానే వస్త్రధారణ చేసుకునేవాడు.

మరొక్క విషయం యూదు సమాజంలో ఎస్సీన్ లు కాకుండా సద్దూకీస్, ఫరిసీస్ లు ప్రధాన మత వర్గాలుగా ఉన్నాయి. కానీ ఏసు ప్రకటించిన కొన్ని విలువలు, బోధించిన బోధనలు ఎస్సీన్స్ జీవన విధానానికే దగ్గరగా కనిపిస్తాయి. సంపదను విడిచిపెట్టాలని, దేవుని రాజ్యం కోసం భౌతిక సంపదపై ఆధారపడకూడదని ఏసు తన శిష్యులకు బోధిస్తాడు. ఇవన్నీ కూడా బౌద్ధానికి దగ్గరగానే కనిపిస్తాయి. నికోలస్ నొటోవిచ్, అర్థర్ లిల్లీ కూడా ఈ విషయాలనే స్పష్టంగా విశ్లేషించారు. బుద్ధుడు కరుణను బోధించినట్టే, ఏసు కూడా శత్రువులను ప్రేమించండి అని అని బోధించినట్టుగా ఆర్థర్ లిల్లీ పేర్కొన్నాడు. నికోలస్ నొటోవిచ్ రాసిన the unknown life of jesus christ అన్న రచన ప్రకారం ఏసు భారత్ వచ్చి ఇక్కడి బౌద్ధారామాలలో నివసించి వెళ్లాడా అన్న వాదనకు ఈ విషయాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇదంతా కూడా ప్రారంభ క్రైస్తవంలోని విశేషాలే. సెయింట్ పాల్ మత ప్రచారం ప్రారంభించిన తరువాత మారిన పరిణామాలు, కొత్తగా వచ్చిన సిద్ధాంతాలు, ఆచరణలు, బోధనలు వేరు. ఎందుకంటే పాత నిబంధనలో క్రైస్తవం మారిపోయింది. యహోవా తప్ప వేరే దేవుడు లేడని, ఇతర సంప్రదాయాలన్నిటినీ నకిలీలనే సైద్ధాంతిక ప్రాతిపదిక అందులోనే వచ్చింది. అయితే కొత్త టెస్ట్‌మెంట్ దగ్గరకు వచ్చేసరికి మళ్లీ కరుణ లాంటి పదజాలం కొంతమేరకు జతకూడింది.

భారతదేశంలోని శైవ సంప్రదాయాన్ని ఒకసారి పరిశీలించాలి. భారతీయ సన్యాస మార్గంలో శైవం ప్రధానమైనది. శైవ సంప్రదాయంలో తపస్సు అనేది కేవలం శారీరక సాధన కానే కాదు. మనస్సును శుద్ధి చేసే, నూతన అన్వేషణ దిశగా నడిపించే ఆధ్యాత్మిక సాధన. మనకు హిమాలయాల్లో నివసించే యోగులు, సిద్ధులు, అడవుల్లో ధ్యాన జీవితం గడిపే తపస్వాధ్యాయులు, అన్నింటికీ మించి ప్రపంచంలోని సమస్త సుఖదుఖాలను విడిచిపెట్టేసి అన్నింటికీ అతీతమైన జీవితాన్ని గడిపే సన్యాసులు భారతీయ ధార్మిక జీవన విధానానికి వేల సంవత్సరాలుగా మూలస్తంభాలుగా ఉన్నారు. ఈ సన్యాస సంప్రదాయం కూడా ప్రారంభ క్రైస్తవంలో మనకు కనిపిస్తుంది. ప్రారంభ క్రైస్తవ ఉద్యమాన్ని ఆర్థర్ లిల్లీ లోతుగా పరిశీలించాడు. ముఖ్యంగా ఈజిప్టు ఎడారులలో నివసించిన క్రైస్తవులు తపస్సు చేసేవారు. క్రైస్తవ సన్యాసులు, ఆ తరువాత ఏర్పడిన మఠ వ్యవస్థ, వారి నిరాడంబర జీవితం, ఉపవాసాలు, ప్రార్థనలు, బ్రహ్మచర్యం వంటివన్నీ కూడా భారతీయ ఆశ్రమ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలే. ప్రారంభ క్రైస్తవ సన్యాసులు నిరంతర ప్రార్థన, మౌనం, ఆత్మ పరిశీలన, ఏకాంత జీవితం గడపడం భారతీయ యోగ సంప్రదాయంలో కనిపించే లక్షణం. భారతీయ యోగాన్ని నకలు చేశారా అన్నది పండితులు చెప్పాలి. అయితే రెండింటి మధ్యన సమతుల్యత మాత్రం స్పష్టంగానే ఉన్నది. మన సంప్రదాయంలోని శైవ, వైష్ణవ మతాలలో దేవుడు భూమిపై అవతరించి దుష్ట శిక్షణ చేస్తాడని చెప్తారు. దేవుడి కుమారుడిగా ఏసును అవతారంగా చెప్పవచ్చా? కొందరు ఏసే దేవుడని కూడా చెప్తారు.

ప్రారంభ క్రైస్తవాన్ని కేవలం పాలస్తీనా చరిత్రలో కలిపేసి చూడటం సరికాదు. దానివల్ల ఆ మత ప్రారంభ దశను అర్థం చేసుకోవడం కష్టం. విశాలమైన ఆసియా ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని లోతుగా అధ్యయనం చేసినప్పుడు ప్రారంభ క్రైస్తవ దశ కొంతమేరకు అవగాహన కలుగుతుంది. మరొక సారూప్యతను కూడా చర్చించాలి. యోహాను సువార్త ప్రారంభమయినప్పుడు ఆదిలో వాక్యము ఉండెను అన్న భావనను వ్యక్తం చేస్తాడు. ఈ భావన గ్రీకు తత్త్వ చింతనలో అభివృద్ధి చెందింది. హెరాక్లిటస్, జెనో ఆఫ్ సిటియమ్ వంటివారి రచనల్లో ఈ భావనకు మూలాలు కనిపిస్తాయి. భారతీయ తత్త్వ చింతనలో మొదలు నిశ్శబ్ద రోదసిలో వినిపించే ధ్వని ప్రణవం అని చెప్తారు. ఇది నిర్ధారణ అయింది. ఆదిలో వాక్యం అంటే.. ప్రణవ శబ్దమే. క్రైస్తవంలోని పాల్, లోగోస్ (ఆదివాక్యం), క్రిస్టాలజీ వంటి ప్రధాన భావనలన్నింటికీ కూడా భారతీయ మూలాలు ఏదో రూపంలో మనకు గోచరిస్తాయి. వీటికి చారిత్రక ఆధారాలు కనిపించవేమో కానీ సారూప్య భావనలు ఉన్నాయి. ప్రారంభ క్రైస్తవ మత చరిత్రను కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన ఘటనల సమాహారంగా చూడవద్దు. భారతదేశం, గ్రీకు ప్రపంచం, యుదేయా, ఈజిప్టు మధ్య జరిగిన వాణిజ్యం, యాత్రలు, తాత్త్విక చర్చలు, భిక్షువుల ప్రయాణాలు, సాంస్కృతిక ప్రవాహం అన్నీ కలిసి ప్రారంభ క్రైస్తవ మత సంప్రదాయాన్ని నిర్మించాయి.

(ఇంకా ఉంది)

Exit mobile version