Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-14

[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

చాప్టర్ 15.

భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా, క్రైస్తవ మత విస్తరణ అనేది ఇస్లాం మాదిరిగా అతి వేగంగా జరిగి.. అంతే వేగంగా తగ్గుముఖం పట్టడం అంటూ జరుగలేదు. ఇస్లాం కంటే ముందు క్రైస్తవ విస్తరణ మొదలైందన్నమాట వాస్తవం. కాకపోతే.. మహమ్మద్ ప్రవక్త ద్వారానే నేరుగా ఇస్లాం విస్తరణ ప్రారంభమైతే.. క్రైస్తవం మాత్రం జీసస్ ప్రారంభించలేదు. ఒకటి క్రీస్తు భౌతిక కాలమానం స్పష్టంగా లేకపోవడం.. లేదా అసలే లేకపోవడం. క్రీస్తు శకం అనేది ప్రారంభం కావడానికి ముందు నాలుగు వందల ఏండ్ల క్రితం జీసస్ ఉన్నట్టు అయితే.. ఆయన భౌతికంగా వెళ్లిపోయిన ఏడు వందల సంవత్సరాల తరువాత కానీ క్రీస్తు మతం విస్తరణలో వేగం కనపడలేదు. ముందరి వ్యాసాల్లో చెప్పుకున్నట్టు ఏసుక్రీస్తు జననం, బోధనలు, శిలువ, పునరుత్థానం అన్నవన్నీ కూడా క్రీస్తు శకం ప్రారంభమైన 30వ సంవత్సరం వరకు పూర్తయిపోయాయి. అయితే వీటికి పెద్ద ఆధారాలు లేవని ముందే చెప్పుకున్నాం. 70 సీఈ తరువాత సెయింట్ పాల్ ఏసు శిష్యులు క్రమంగా ఆయన తమకు చెప్పిన బోధనలు అంటూ మత ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే మొదట్లో ఈ మత సంస్కృతి అంత తేలికగా విస్తరించలేదు. మొదట్లో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. ప్రజలు ఎవరూ ఈ మతాన్ని నమ్మలేదు. క్రీస్తుశకం 64 ప్రాంతంలో నీరో చక్రవర్తి మొదట క్రైస్తవులను తీవ్రంగా హింసించాడని భావిస్తారు. 64 సంవత్సరం జూలై 19న రోమ్ తగలబడిపోయింది. దాదాపు 70 శాతం రోమ్ తగలబడిపోయింది. నీరోనే తగుల బెట్టాడని కొందరు చెప్తారు. నీరో మాత్రం తమ దేశంలోకి చొచ్చుకు వచ్చిన కొత్త మత సంఘం (క్రైస్తవం) వాళ్ళు దీనికి కారకులని వారిని దారుణంగా శిక్షించాడు. దైవ ద్రోహులని నిందించాడు. రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేల్ వాయించాడన్న సామెత ఇక్కడే పుట్టింది. దీనికి ఆధారం మనకు లాటిన్ లో టాసిటస్ వచనం లో లభిస్తుంది.

Here is the relevant Latin text as found in the Loeb Classical Library (Vol. V) edition:

“… tamen erant qui crederent veterem illam formam salubritati magis conduxisse… sed non ope humana, non largitionibus principis aut deum placamentis…Nero subdidit reos… dure poenas inposuit… “Chrestianos” appellebant… Christus… per procuratorem Pontium Pilatum supplicio affectus… igitur primum correpti qui fatebantur, deinde… multitudo ingens convicti sunt… derisio morsibus… ferarum pellibus operti, canibus concisi; aut affixi ad crucem; aut nocte lumine […]”

Loeb Classical Library, Vol. V (Tacitus: Annals, Book XV), 1937, shows this section on approximately page 285. (Tacitus, Annals 15.44 — లాటిన్ అసలు వచనం)

దీని ఆంగ్ల అనువాదం మీకోసం..

“But all human efforts, all the lavish gifts of the emperor, and the propitiations of the gods, did not banish the sinister belief that the conflagration was the result of an order. Consequently, to get rid of the report, Nero fastened the guilt and inflicted the most exquisite tortures on a class hated for their abominations, called Christians by the populace. Christus, from whom the name had its origin, suffered the extreme penalty during the reign of Tiberius at the hands of one of our procurators, Pontius Pilatus… Accordingly, an arrest was first made of all who pleaded guilty; then, upon their information, an immense multitude was convicted… Mockery of every sort was added to their deaths. Covered with the skins of beasts, they were torn by dogs and perished, or were nailed to crosses, or were doomed to the flames and burnt, to serve as a nightly illumination, when daylight had expired.” (ఆంగ్ల అనువాదం From the widely used translation by A. J. Church & W. J. Brodribb, 1876)

ఈ హింసాకాండలో ఏసు శిష్యులుగా ప్రసిద్ధులైన పీటర్, పాల్‌లు హతులయ్యారు. ఇప్పుడు వాటికన్‌లో ఉన్న సెయింట్ పీటర్స్ బాసిలికా ఉన్న ప్రదేశం పీటర్ సమాదిగా గుర్తించారు. ఆ తరువాత దాదాపు మూడు వందల సంవత్సరాల పాటు క్రైస్తవం చిన్న తెగలుగా ఉండిపోయింది. ఆ తరువాత క్రైస్తవ మత ప్రచారం రెండు మార్గాలను ఎంచుకుంది. మొదటిది ప్రజలను న్యూనతా భావం లోకి నెట్టేయటం, రెండవది ప్రభువులను ఏదో విధంగా తమ దారి లోకి తెచ్చుకోవటం. వివిధ దేశాలకు లేఖలు రాయటం వారి దేవుళ్ళను నకిలీలని చెప్పటం, యెహోవా మాత్రమే దేవుడని ప్రచారం చేశారు.

ఇలా మొట్టమొదట పూర్తి క్రైస్తవ దేశంగా మారింది అర్మేనియా. క్రీస్తు శకం 301లో అర్మేనియా రాజు క్రైస్తవాన్ని స్వీకరించాడు. అంతే.. రాజు తలచుకొంటే ఏమైనా జరుగుతుందనటానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. పశ్చిమాసియాలోని దక్షిణ కాకసస్ ప్రాంతంలో అర్మేనియా ఒక ప్రాచీన రాజ్యం. క్రీస్తు పూర్వం 1400 నుంచి 1000 మధ్యన చక్కని నాగరికత విలసిల్లిన ప్రాంతం. అక్కడ సూర్యారాధన ఇతర విగ్రహారాధన కొనసాగింది. ఒకటవ శతాబ్దంలోనే క్రీస్తు శిష్యులు థడేయు, బార్తోలోమూ అక్కడికి వచ్చారని క్రైస్తవ మతస్తులు విశ్వసిస్తారు. మొదట్లో అక్కడ విదేశీ మతమైన క్రైస్తవాన్ని స్వీకరించడానికి అంగీకరించకపోవడంతో కొన్ని సమూహాలుగా రహస్యంగా మాత్రమే కొందరు క్రైస్తవాన్ని అంగీకరించారు. గ్రెగోరి ద ఇల్యుమినేటర్ అనే మత ప్రచారకుడు క్రమంగా అర్మేనియా రాజును తన వైపు తిప్పుకోవడంలో విజయవంతం అయ్యాడు. మొదట అర్మేనియా రాజు తిరిడేట్స్-3 ఈ మత ప్రచారకుడిని కొంతకాలం జైల్లో పెట్టాడు. కొంతకాలం తరువాత రాజుకు జబ్బు చేస్తే గ్రెగ్రోరీ నయం చేశాడు. దీంతో.. గ్రెగోరీ మతాన్ని అర్మేనియా రాజు స్వీకరించాడు. ఆ విధంగా క్రైస్తవ మతాన్ని అధికారికంగా 301 లో స్వీకరించి మొట్టమొదటి క్రైస్తవ రాజ్యంగా అర్మేనియా అవతరించింది. రాజు మతం మారడంతో.. ప్రజల్లో అల్లకల్లోలం మొదలైంది. అంతకు ముందు వరకు మహారాజు కూడా దేవతల విగ్రహారాధన చేసేవాడు. ఒక్కసారిగా రాజు మతం మారినట్టు ప్రకటించడంతో దేశంలో భయానక వాతావరణం ఏర్పడింది. అంతకు ముందు దేవతారాధన చేసే వారిని ఫాగన్ లుగా ముద్రించారు. తమ దేవుడిని నమ్మకుండా విగ్రహారాధన చేసే వారందరినీ ఫాగన్లుగా గుర్తించారు. వాళ్ల విగ్రహారాధనను అంతకుముందు వరకు పూజలు చేసిన రాజే నిషేధించాడు. విగ్రహాలన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దేవాలయాలన్నీ చర్చిలుగా మారిపోయాయి. చాలా వేగంగా ఈ మార్పు సంభవించింది. సరిగ్గా వందేళ్ల తరువాత 405 సీఈలో మెస్రోప్ మాష్టోత్స్ (Mesrop Mashtots) అనే భాష శాస్త్రవేత్త అర్మేనియాకు లిపి కనుగొన్నాడు. వెంటనే స్థానిక భాషలోకి బైబిల్ సృష్టి జరిగింది. ఆ దేశ సంస్కృతి మారిపోయింది. క్రైస్తవ బోధనలు మొదలయ్యాయి. విద్య, సాహిత్యం, కళలు, చట్టాలు అన్నీ కూడా సమూలంగా క్రైస్తవ మత ప్రాతిపదికపైనే రూపొందాయి. ఇక్కడి చర్చిలు ఇవాళ యునెస్కో వారసత్వ సంపదలుగా మారాయి.

అర్మేనియా తరువాత వరుసగా మతం మారిన కొన్ని దేశాల గురించి క్లుప్తంగా సంక్షిప్తీకరించి చెప్తాను.

జార్జియా:

ఆర్మేనియా తర్వాత జార్జియా రాజ్యం 330వ సంవత్సరంలో క్రైస్తవాన్ని స్వీకరించింది. ప్రపంచంలో మొట్టమొదట వైన్ తయారీ చేసిన దేశం ఇది. అంతకుముందు దీన్ని ఐబేరియా అని పిలిచేవారు. 1.8 మిలియన్ సంవత్సరాల క్రితం యురేషియాలోని పురాతన హోమినిస్ శిలాజాలు జార్జియా ప్రాచీనతకు సంకేతాలు. దాదాపు 2 లక్షల సంవత్సరాలకు క్రితం పాత రాతియుగంలో ఆదిమ స్థావరాలు.. క్విరిలా, రియోని నదుల లోయల్లో లభించాయి. అంటేనే జార్జియా నాగరికతే కాదు.. అసలు మానవ నాగరికత ఎంత పురాతనమైందో అర్థమవుతుంది. సెయింట్ నినో అనే మహిళా ప్రచారకురాలు ఇక్కడ మతమార్పిడికి ప్రధాన కారకురాలు. క్రైస్తవ మతంలో మతాన్ని అత్యధికంగా విస్తరింపజేసి.. అత్యధిక ప్రజలను తమ మతం వైపు వచ్చేలా కృషి చేసిన వారికి సెయింట్ అంటే దైవత్వం కల్పించడం సంప్రదాయంగా వస్తున్నది. అర్మేనియా మాదిరికగానే ఇక్కడ మత మార్పు స్థానిక తెగల మధ్య తీవ్రమైన హింసాకాండను ప్రేరేపించాయి. ఒక్క గుడి కూడా జార్జియాలో మిగులలేదు. ఒక్క విగ్రహం ఉనికి కూడా లేకుండా పోయింది. దేవాలయాలన్నింటి స్థానంలో చర్చిలు పుట్టుకొచ్చాయి. క్రైస్తవ మత ప్రచారకులు బలవంతంగా అక్కడి స్థానిక సంప్రదాయాలు, సంస్కృతిని, ఆచార వ్యవహారాలను బలవంతంగా నాశనం చేశారు. వినకపోతే.. ప్రజలను తీవ్రంగా హింసించి మరీ హతమార్చారు. (Studies in Medieval Georgian Historiography, Stephen H. Rapp). జార్జియా మతం మారిన తరువాత దాని పొరుగున ఉన్న దేశాలు లాజికా, అబ్ఖాజియా వంటి చిన్న దేశాలు మతం మారడానికి పెద్దగా సమయం పట్టలేదు.

ఇథియోపియా:

ఆఫ్రికా విషయానికి వస్తే.. మరీ విడ్డూరం. ఆఫ్రికాను క్రైస్తవం ఎలా ఆక్రమించిందో టాంజానియా తొలి రాష్ట్రపతి జూలియస్ కంబారగే నెరేరే (Julius Kambarage Nyerere) స్వయంగా చెప్పారు. ‘వారి చేతిలో బైబిల్ ఉన్నది.. మా చేతిలో భూమి ఉన్నది. ఒకసారి కళ్లు మూసుకోవాలని వారు మాకు చెప్పారు. కళ్లు మూసుకొని తెరిచేసరికి మా చేతిలో బైబిల్ ఉన్నది.. వారి చేతిలోకి భూమి వెళ్లిపోయింది.’ “When the missionaries arrived in Africa, we had the land and they had the Bible. They taught us to pray with our eyes closed. When we opened our eyes, they had the land and we had the Bible.” (Desmond Tutu). క్రైస్తవుల భాష వారికి తెలియదు.. మీరు క్రైస్తవం తీసుకోండి.. వదిలేస్తామని వారు అన్నారు.. అవుననాలో, కాదనాలో తెలియదు.. తమ హెచ్చరికను వాళ్లు తిరస్కరిస్తున్నారని మిషనరీలు భావించాయి. దీంతో తమ మాటను కాదన్నవారందరినీ నిర్దయగా హతమార్చారు. ఆఫ్రికాలో క్రైస్తవ మతోన్మాదానికి బలైన వారి సంఖ్య దాదాపు అయిదు కోట్ల వరకు ఉంటుందని అంచనా.. ఇలాంటి ఘటనలకు పదే పదే ‘పోప్’ ఫ్రాన్సిస్ 2015లో క్షమాపణ చెప్పారు. దానిని ‘బాధ వ్యక్తం చేసినట్టు’గా డైల్యూట్ చేసి చెప్తారు. ఆయన కేవలం ఇథియోపియాకే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చాలా సందర్భాలకు క్షమాపణలు చెప్పారు. ప్రజల అణచివేతకు, చారిత్రక తప్పిదాలకు క్షమాపణ కోరారు. ఇథియోపియాను ప్రాచీన కాలంలో అక్సుమైట్ అని పిలిచేవారు. ఇక్కడ ఇజ్రాయిల్ నుంచి వచ్చిన స్థానిక యూదులను తీవ్రంగా అణచివేశారు. ఇక్కడ యూదుల సమాజం ప్రాచీన కాలం నుంచీ స్థిరపడి ఉన్నది. ఇక్కడి యూదులలో 12 తెగలు ఉండేవి. వారిలో ఇజ్రాయిల్ వారు దాన్ తెగ సంబంధించిన వారసులమని నమ్ముతారు. దాన్ తెగ వారు ఉత్తర ఇజ్రాయిల్ నుంచి వలస వెళ్లి ఇథియోపియాలో స్థిరపడ్డారని ఒక కథనం ప్రచారంలో ఉన్నది. ఈ కారణంగానే ఇథియోపియాలో యూదులకు ప్రాధాన్యం ఉన్నది. అయితే.. క్రైస్తవ మతం తన మొదటి శత్రువుగా యూదులను పరిగణించింది. యూదుల సమూల నిర్మూలనమే లక్ష్యంగా సాగుతూ వచ్చింది. అందుకే ఇథియోపియాలో క్రైస్తవీకరణ ప్రారంభ దశలోనే యూదులను తక్కువ చేసి చూడటం మొదలుపెట్టారు. నాలుగో శతాబ్దంలో ఇథియోపియాను ఏలిన ఎజానా అనే రాజు క్రైస్తవ మతాన్ని ప్రకటించుకున్న తరువాత యూదులను అన్య మతస్థులుగా డిక్లేర్ చేశాడు. దీంతో ప్రధాన స్రవంతి నుంచి యూదులు నెట్టివేయబడ్డారు. కొండ ప్రాంతాల్లో తలదాచుకుని యూదులు తమ మతాచారాలను, విశ్వాసాలను రహస్యంగా కాపాడుకుంటూ శతాబ్దాల పాటు జీవించారు. అయినప్పటికీ వారిపై అణచివేతలు, అత్యాచారాలు తగ్గలేదు. 15వ శతాబ్దంలో మరోమారు యూదులపై తీవ్రమైన అణచివేత చర్యలు ప్రయోగించారు. వాళ్లకు భూస్వామ్య హక్కులు లేకుండా చేశారు. వృత్తులను నిషేధించారు. ఇనుము వృత్తి, మట్టి పనులు, వ్యవసాయానికి మాత్రమే పరిమితం చేశారు. క్రైస్తవ సమాజంతో వివాహ సంబంధాలు నిషేధించారు. వారి ఆర్థిక స్థితిగతులను ధ్వంసం చేశారు. ఆధునిక కాలంలో అంటే 19వ శతాబ్దంలో మిషనరీలు ఇక్కడి యూదులను తప్పుడు మనుషులుగా ముద్రించి వారిని బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించాయి. అయినప్పటికీ వారు తమ సంప్రదాయాల్ని, మతాచారాలను వదులుకోలేదు. ఆ సమయంలో యూరోపియన్ చరిత్రకారులు, పర్యాటకులు.. అక్కడి యూదుల స్థితిగతులను ప్రపంచానికి తెలియజేయడంతో మిషనరీల అరాచకాలకు కొంత బ్రేక్ పడింది. 20వ శతాబ్దంలో ఇథియోపియాలో అంతర్గత రాజకీయ కల్లోలం రావడంతో 1984, 85, 91 లలో లక్షలాది యూదులు ఇజ్రాయిల్‌కు వలస వెళ్లారు. అక్కడ వారికి రక్షణ కలిగింది. క్రైస్తవీకరణ కారణంగా ఇథియోపియాలో మతం మారలేదన్న కారణంగా అక్కడి యూదులు అనుభవించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అణచివేత క్రైస్తవ చరిత్రలోనే మాయని మచ్చగా చెప్పవచ్చు. ఇంత జరిగినా.. 4వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఎంత వివక్షకు గురి అయినా.. అక్కడి యూదులు మాత్రం తమ మతాచారాలను, విశ్వాసాలను బలంగా నిలబెట్టుకున్నారు.

ఐర్లాండ్

ఐరోపాలో ముఖ్యమైన సాంస్కృతిక దేశంగా చెప్పుకునే ఐర్లాండ్‌లో కూడా క్రైస్తవీకరణ మృదువుగా జరుగలేదు. ఐరోపాలో మానవ నివాసాల ఉనికి క్రీస్తు పూర్వం 10,500 సంవత్సరం నుంచి ఉన్నది. కౌంటీ క్లారేలో ఒక గుహలో ఎలుగుబంటి ఎముక లభించింది. ఇది సుమారు క్రీస్తుకు పూర్వం 8వేల సంవత్సరాల నాటిదని భావిస్తారు. టొలేమీ తన ఆల్మగస్ట్ లో ‘మైఖ్రా బ్రెట్టనియా’’ అంటే లిటిల్ బ్రిటన్ గా పేర్కొన్నాడు. టోలెమి రికార్డుల్లో ఐర్లాండ్‌లో దాదాపు పదహారు దేశాలున్నాయని.. అక్కడ ప్రజల వివరాలను కూడా పేర్కొన్నాడు.

ఇలాంటి ఐర్లాండ్‌లో క్రైస్తవీకరణ ఒక శాంతియుత విప్లవంలాగా మిషనరీలు ప్రచారం చేస్తున్నప్పటికీ, 431లో పోప్ సెలెస్టిన్ 1 ఆదేశంతో పలాడియస్ అనే బిషప్ ఐర్లాండ్ వచ్చి క్రైస్తవానికి బీజం వేశాడు. ఆ తరువాత 432లో అంటే అయిదో శతాబ్దంలో సెయింట్ ప్యాట్రిక్ వచ్చి మత మార్పిడి చేయటమే కాదు. క్రైస్తవం మాత్రమే ఉనికిలో ఉండేలా ఐర్లాండ్ మూల సంస్కృతిని ధ్వంసం చేశాడు. అక్కడ స్థానిక పూర్వ సంప్రదాయాలు, దేవాలయాలు, సాంస్కృతిక విధ్వంసం సంపూర్ణంగా, సమూలంగా నిర్మూలించింది. పాత దేవుళ్లను అరాచక వాదులుగా సెయింట్ ప్యాట్రిక్ ముద్ర వేశారు. స్థానికంగా ఉన్న సెల్టిక్, ద్రుయిడ్ సంప్రదాయాలను, అక్కడి దేవతల ఆరాధనలను దారుణంగా వెకిలి చేస్తూ నిషేధించారు. దేవతల పూజ, ప్రకృతి ఆధారిత ఆచారాలు, కవిత్వం, ఇతర సాహిత్యం అన్నీ నాశనమయ్యాయి. న్యాయం, వైద్యం, జ్యోతిష శాస్త్రాలను డ్రూయిడ్లు రచించారు. సెయింట్ ప్యాట్రిక్ (385-461) ఈ సాహిత్యాన్నంతా కూడా క్రైస్తవీకరణ చేసేశాడు. క్రైస్తవాన్ని నిరాకరించిన వారిని దైవ ద్రోహులుగా చిత్రీకరించారు. సమాజం నుంచి బహిష్కరించారు. మత ప్రచారకులు ఆదేశించడమే తరువాయి, దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఆయా తెగల పాలనా వ్యవస్థలు, స్థానిక దైవ పూజ కార్యక్రమాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. వారు పవిత్రంగా భావించే తోటలను పూర్తిగా నరికివేశారు. తోటలను నరికి చర్చిలను నిర్మించారు. ఒక రకంగా చెప్పాలంటే.. book of leinster అనే పుస్తకంలో సెల్టిక్‌లు పూజించిన క్రోమ్ క్రూఆక్ అనే దేవుడి విగ్రహాన్ని ప్యాట్రిక్ స్వయంగా ధ్వంసం చేశాడని పేర్కొన్నారు. ఐర్లాండ్‌లో జరిగింది సాంస్కృతిక మారణకాండ. 12వ శతాబ్దానికి వచ్చేసరికి పోప్ ఆద్రియన్ 4 ఆధారంగా ఇంగ్లండ్ రాజు రెండో హెన్రీ ఐర్లాండ్‌లో క్రైస్తవ శుద్ధి పేరుతో ఎన్నో దండయాత్రలకు పాల్పడ్డాడు. కెల్టిక్, డ్రూయిడ్ల ప్రతిఘటనలు ఏవీ నిలువలేదు. వాళ్లను దారుణంగా హింసించి హతమార్చారు. వారి ఆస్తులను దోచుకున్నారు. దీంతో పాత ఐరిష్ రాజ్యాలు అంతమయ్యాయి. మత ఆధిపత్యం కోసం, రాజకీయ, సాంస్కృతిక సామాజిక మారణ కాండ జరిగింది. ఇంకా దారుణం ఏమిటంటే.. సెల్టిక్ తెగల లిపి ఓఘమ్ (Ogham script) ను కూడా కాలగర్భంలో కలిపేశారు. పాత పాటలు, భజనలను, కావ్యాలను నాశనం చేశారు. అక్కడ కనిపించే పౌరాణిక గాథలను సైతం క్రైస్తవీకరణ చేశారు. కెల్టిక్ తెగలు జరుపుకునే సంహైస్ అనే కెల్టిక్ పండుగ తరువాత “All Hallows Eve” (Halloween) గా క్రైస్తవ పండుగగా రూపాంతరం చెందింది. ఇప్పుడు మనం భారతదేశంలో చూస్తున్నది అచ్చంగా ఇదే. కేరళ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చర్చిల ముందు ధ్వజస్తంభాలను ఏర్పాటు చేయటం, ఏసు క్రీస్తుకు హిందూ దేవతల మాదిరిగా స్తోత్ర అర్చనాది షోడషోపచారాలతో, నైవేద్య తాంబూలాలతో అర్చనలు పూజలు చేయడం, మంత్రాలను రచించడం, వాటిని పాడటం అన్నీ జరుగుతున్నాయి. నాడు ఐర్లాండ్‌లో ఏదైతే జరుగుతున్నదో.. ఇప్పుడు కూడా వాళ్లు అదే సూత్రాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.

ఫ్రాంక్స్ (ఫ్రాన్స్)

మనకు ఇప్పుడు కనిపించే ఫ్రాన్స్ ను క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఫ్రాంక్స్ అని పిలిచేవారు. ఇక్కడ జర్మానిక్ తెగలు అద్భుతమైన శక్తిమంతమైన రాజ్యాన్ని నిర్వహించాయి. వీరు సూర్యుడు, వన దేవతలు, యుద్ధ దేవతలను ప్రధానంగా పూజించేవారు. ఐర్లాండ్‌లో మాదిరిగానే దేవుడి తోటలు ఉండేవి. ఇవి చాలా పవిత్రమైనవి. వివిధ తెగలకు సంబంధించిన దేవాలయాలు ఉండేవి. ఇప్పుడు మనకు దేవతలు ఎలాగో.. వారికి తెగల వారీగా దేవాలయాలు ఉండేవి. 496లో ఫ్రాంక్స్ రాజు క్లొవిస్ ను బర్గుండియన్ రాజకుమారి హనీ ట్రాప్ చేసి క్రైస్తవమతంలోకి మార్చింది. ఆమె ప్రభావంతో ఫ్రాంక్స్ చరిత్రే పూర్తిగా మారిపోయింది. క్లొవిస్ మతమార్పు.. క్రైస్తవ మిషనరీలకు రాజకీయంగా, సైనిక పరంగా కూడా బాగా ఉపయోగపడింది. రోమన్ రాజ్యం అంతరించిన క్రైస్తవంలోకి మారిన తరువాత అక్కడి చర్చిలు ఫ్రాన్స్‌లో క్లొవిస్‌ను పూర్తిగా నియంత్రించాయి. ఫ్రాన్సును చర్చి ప్రథమ పుత్రికగా (లా ఫిల్లె అనీ డీ ఐ ఎగ్లైస్) పిలుస్తారు. క్రమంగా ‘‘దైవ అనుగ్రహం’’ అనే పేరుతో అంతకు ముందు ఉన్న దేవాలయాల ధ్వంస రచన యథేచ్ఛగా సాగింది. దేవాలయాలను కూల్చి అవే రాళ్లను వాడి చర్చిలను నిర్మించారు. ఈ రకమైన ధోరణి మనకు ఇస్లామీకరణలో కూడా కనిపిస్తుంది. పర్షియాలో, సింధులో, ఆఫ్గనిస్తాన్‌లో, ఉత్తరప్రదేశ్‌లో ఇట్లా చాలా చోట్ల ఆయా దేవాలయాల శిథిలాలను వాడుకునే వాళ్ల ప్రార్థనా మందిరాల నిర్మాణాలు జరిగాయి. క్రైస్తవం రావడానికి ముందు ఇతర సంస్కృతుల్లో బలి పీఠాలు కనిపిస్తున్నాయి. భారతదేశంలోని ఆలయాల్లో కూడా ఆలయం చుట్టూ బలి పీఠాలు కనిపిస్తాయి. ప్రతిరోజూ ఈ పీఠాలకు కూడా బలి హరణం పేరుతో నైవేద్యం సమర్పిస్తారు. ఫ్రాన్సుగా మారిన ఫ్రాంక్స్ లో ఉన్న బలి పీఠాలు ఒక్కసారిగా క్రైస్తవ బలి పీఠాలుగా మారిపోయాయి. క్రీస్తు శకం 6 నుంచి 8 శతాబ్దాల మధ్యన క్రైస్తవవీకరణ పేరుతో వ్యవస్థీకృత ధ్వంస ఉద్యమమే ఫ్రాన్స్‌లో నిరాటంకంగా సాగింది. క్లొవిస్, అతని వారసులు చార్లెమాగ్నే వరకు మతహింసను దారుణంగా అమలుచేశారు.

చార్లెమాగ్నే ఫ్రాంకిస్ సామ్రాజ్యానికి రాజుగా ఉన్నాడు. సాక్సన్లను బలవంతంగా మత మార్పిడి చేయించడంలో శాంతి పేరుతో సాక్సన్లను దారుణంగా హతమార్చాడు. చార్లెమాగ్నె పాలనలో అతి పెద్దది, సుదీర్ఘమైన మత యుద్ధంగా సాక్సన్ వార్‌ను పేర్కొంటారు. దాదాపు మూడున్నర దశాబ్దాల సుదీర్ఘమైన మారణ కాండకు కారకుడు చార్లె మాగ్నే. అతను ప్రారంభించిన మొదటి యుద్ధం 772లో ఇర్మిన్సుల్ అనే పవిత్ర స్తంభాన్ని ధ్వంసం చేయడం ద్వారా ప్రారంభమైంది. “Some Account of the Saxons—Their continual Aggressions on the French Frontier—Charlemagne invades Saxony—Destruction of the Idol Irminsula—Submission of the Saxons—Circumstances of Italy Intrigues of Desiderius—Adrian elected Pope—His firm Resistance of the Lombards—Demands Aid from France—Charlemagne endeavours to negotiate with Desiderius—Marches to the Deliverance of Adrian Passes the Alps—Siege of Pavia—Capture of Verona—His Reception in Rome—Fate of Pavia—Fate of Desiderius. The intrigues of Desiderius were strengthened and directed by the presence of the widow and children of Carloman; but whether Charlemagne, strong in the love and support of his people, depised the weak machinations of his enemies in Italy, or whether a more pressing danger in the north called first for his attention, certain it is that the immediate effort of his arms, after reuniting the two great parts of the French monarchy, was turned against those barbarian tribes who still ravaged the German frontier of France. With a pertinacity which nothing could overcome, and with a ruthless disre- gard of oaths, engagements, and ties which no chastisement could correct, they, year after year, pillaged and desolated the transrhenane dominions of the Franks, slaughtered the inhabitants, and carried off the wealth of the country” (the history of charle magne p.125). అత్యంత క్రూరుడైన రాజు చార్లె మాగ్నె.

782లో జరిగిన వెర్డన్ (Verden) ఊచకోత, చార్లె మాగ్నె యుద్ధాల్లో అత్యంత భయానక ఘట్టం. సుమారు 4,500 మంది సాక్సన్ ఖైదీలను ఒకే రోజులో దారుణంగా హింసించి చంపించాడు.

Forsaking the campaign against the Slavs, they rushed with the East Frankish host to the place where they had heard the Saxons were assembling. In Saxony proper they were met by Count Theodoric, the king’s kinsman, who had with him as many troops as he could hastily gather in Ripuaria after he had heard of the Saxon revolt. He advised them through special messengers first to find out by patrols as fast as possible where the Saxons were and what they were doing, and then, if the terrain permitted it, to attack them at the same time. This counsel was found laudable, and they advanced with the count as far as the Süntel Moun- tains, on whose north side the Saxon camp had been set up. After Theodoric had pitched camp in this locality, the East Franks, as they had planned with the count, crossed the river, so as to be able to pass more easily around the mountains, and pitched camp on the river bank. When they discussed matters among themselves, they feared that the honor of victory might be Theodoric’s alone if they should fight at his side. Therefore, they decided to engage the Saxons without him. They took up their arms and, as if he were chasing runaways and going after booty instead of facing an enemy lined up for battle, everybody dashed as fast as his horse would carry him for the place outside of the Saxon camp, where the Saxons were standing in battle array. The battle was as bad as the approach. As soon as the fighting began, they were surrounded by the Saxons and slain almost to a man. Those who were able to get away did not flee to their own camp but to Theodoric’s on the other side of the mountain. The losses of the Franks were greater than the number might reveal since two of the envoys, Adalgis and Gailo, four counts, and up to twenty other distinguished nobles had been killed, not counting those who had followed them, preferring to perish at their side rather than survive them.

When he heard of this,” the Lord King Charles rushed to the place with all the Franks that he could gather on short notice and advanced to where the Aller flows into the Weser. Then all the Saxons came together again, submitted to the authority of the Lord King, and surrendered the evildoers who were chiefly responsible for this revolt to be put to death-four thousand five hundred of them. This sen- tence was carried our.” Widukind was not among them since he had fled into Nordmannia. When he had finished this business, the Lord King returned to Francia.

He celebrated Christmas at the villa of Thionville and Easter, too. And the date changed to 783. (Royal Frankish annals and Nithard’s Histories by Scholz, Bernhard Walter, 1931. P. 60-61)

చార్లె మాగ్నె ఎంత క్రూరుడంటే పాత దేవతలను ఎవరైనా పూజిస్తే చాలు అతడు పెద్ద నేరగాడి కిందే పరిగణించేవారు. “witchcraft” లేదా “heresy” అన్న పేర్లతో వారికి దారుణమైన మరణ శిక్షలు విధించేవారు. పూజారులు, మత పెద్దల (శామన్, డ్రూయిడ్) ను బహిరంగంగా హత్యచేశారు. ఇక్కడ ఉన్న తెగల సంప్రదాయాలు కాలగర్భంలో కలిసిపోయాయి. మౌఖిక సాహిత్యం, కావ్యాలు అన్నీ నశించాయి. ఒక గొప్ప నాగరికతకు, సంస్కృతికి ఫ్రాన్స్‌లో క్రైస్తవం పునర్జన్మ లేని మరణ శాసనం లిఖించింది. ఐర్లాండ్ తరువాత ఫ్రాన్స్ కూడా క్రైస్తవుల వశం కావడంతో యూరప్‌లో క్రైస్తవ సామ్రాజ్య నిర్మాణానికి గట్టి పునాది పడినట్టయింది.

విసిగోత్స్ (స్పెయిన్)

ఐబీరియన్ ద్వీపకల్పంలో ప్రస్తుత స్పెయిన్, పోర్చుగల్ దేశాలను మనం చూడవచ్చు. అయిదో శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు ప్రస్తుతం నైరుతి ఫ్రాన్స్‌తో పాటు ఐబేరియన్ విసిగోత్స్ (Visigoths)పాలించేవారు.

వీరి కంటే ముందు ఇక్కడ స్థానిక తెగల సంస్కృతులు ఉండేవి. వీళ్లు ప్రధానంగా ప్రకృతి ఆరాధకులు. నదులు, పర్వతాలు, సూర్యుడు, చంద్రుడు వంటి ప్రకృతి దేవతలను వీరు ప్రధానంగా పూజించేవారు. వీరికీ పవిత్ర వనాలు, రాతి వలయాలు, బలి పీఠాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండేవి. క్రీస్తుకు పూర్వం 218 నుంచి 409 సంవత్సరాల మధ్యలో లెబనాన్ నుంచి వచ్చిన సముద్ర వ్యాపారులు ఇక్కడ మెల్కార్ట్, ఆస్టార్టే, బాల్ వంటి దేవతల ఆరాధనను వ్యాప్తి చేశారు. ఉత్తర ఆఫ్రికాలోని ప్రస్తుత ట్యునేషియా (కార్టెజీనియన్లు) కూడా ఇక్కడికి వలస వచ్చి స్థిర పడ్డారు. ఐదో శతాబ్దంలో విసిగోత్స్ స్పెయిన్‌లో రాజకీయ అధికారం సాధించారు. వీరు డానుబే లోయ నుంచి పశ్చిమానికి తరలి వెళ్లిన వారు. వీరు మొదట ఏరియన్ క్రిస్టియానిటీని అనుసరించారు. క్రీస్తుశకం 340-360 మధ్యన బిషప్ ఉల్ఫిలా నాయకత్వంలో ఏరియన్ క్రైస్తవం(Arian Christianity) స్వీకరించారు. ఈ మత మార్పు వీళ్లకు రోమన్ సామ్రాజ్యంతో సంబంధాలు ఏర్పరుచుకోవడానికి దారులు ఏర్పరచింది. రోమ్ తో ఇసిగోత్ లు ఫొడెరాటీ ఒప్పందం చేసుకున్నారు. ఫోడెరాటీలు అంటే రోమన్లు, ఫ్రాంక్ లు వాండల్స్, అలాన్స్, హన్స్, విసిగోత్ లు. వీరు తమవారు కాని తెగలను అనాగరక తెగలుగా నిర్ధారించేవారు. స్థానిక విధేయతలను తగ్గించి రోమ్ మతాన్ని విస్తరించడంలో వీరు కీలక పాత్ర పోషించారు. వీళ్ల సిద్ధాంతం ప్రకారం ఏసుక్రీస్తు.. పైన ఉన్న ఆ తండ్రికి కింద ఉన్నవాడు అని భావించేవారు. ఇక్కడ అల్టిమేట్ గాడ్ ఆ తండ్రే.. ఆయన తరువాతే ఏసుక్రీస్తు అనే భావన ఏరియన్ క్రిస్టియానిటీలో బలంగా ఉండేది. ఈ రకమైన విశ్వాసాన్ని రోమన్ చర్చి ఎంతమాత్రం అంగీకరించలేదు. వారి ప్రకారం తండ్రే నేను.. నేనే తండ్రిని అనే సైద్ధాంతిక భావనే నిజమైన క్రైస్తవం. ఏరియన్ క్రైస్తవులు ఏసుక్రీస్తు దైవత్వాన్ని తక్కువ చేసి చూస్తున్నారని భావించేవారు. ఈ నేపథ్యంలో స్పెయిన్‌లో క్రీస్తుశకం 587-589లో రాజకీయ, మత అస్థిరత నెలకొన్నది. క్యాథలిక్ క్రైస్తవాన్ని అనుసరించే హిస్పానో, రోమన్ తెగలు, ఏరియన్ తెగల మధ్యన తీవ్రమైన విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో బైజాంటైన్, ఫ్రాన్స్ దేశాలు తమ దేశాన్ని స్వాధీనం చేసుకుంటాయని అనుమానించిన విసిగోతిక్ రాజు ఒకటవ రెకారెడ్ ఇక తప్పని పరిస్థితుల్లో ఏరియనిజాన్ని వదిలి క్యాథలిక్ మతంలోకి మారిపోయాడు. 589లో జరిగిన మూడో టోలెడో కౌన్సిల్‌లో విసిగోతిక్ రాజ్యపు అధికార మతంగా క్యాథలిక్ క్రైస్తవాన్ని ప్రకటించారు. యూరప్‌లో రోమన్ చర్చి (పాపసీ) తన ప్రాబల్యాన్ని బాగా నిలబెట్టుకుంటున్న రోజులవి. రెకారెడ్ కు తన అధికారాన్ని కాపాడుకోవాలంటే, రోమన్ చర్చి మద్దతు చాలా అవసరమైంది. ఆ తరువాత జరిగిన పరిణామాలన్నీ అంతకుముందు వివిధ దేశాల్లో ఎలా జరిగాయో.. అలాగే జరుగుతూ వచ్చాయి. ఆరియనిజాన్ని అనుసరించిన చర్చిలు, మఠాలు, పూజారుల నివాసాలు ధ్వంసం అయ్యాయి. ఆరియనిజం గ్రంథాలు నామరూపాలు లేకుండా నాశనమయ్యాయి. వేల కొలది గ్రంథాలను రోడ్ల మీద వేసి దారుణంగా దహనం చేశారు. అంతకుముందున్న దేవాలయాలన్నీ రోమన్ క్రైస్తవ చర్చిలుగా మారిపోయాయి. ఆరియన్ విశ్వాసాన్ని విడిచిపెట్టని క్రైస్తవులను కూడా హింసించారు. జైల్లో పెట్టారు. ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. హతమార్చారు. అన్నింటికీ మించి అక్కడి యూదులపై తీవ్ర అణచివేత చర్యలు మొదలుపెట్టారు. క్రీస్తును శిలువ వేయించిన ప్రజలుగా యూదులను పిలిచేవారు. వారిని హతమార్చడం, అణచివేయడం, నియంత్రించడం క్రైస్తవ ప్రథమ ధర్మంగా గట్టిగా విశ్వసించేవారు. క్రైస్తవుల చేత ఎలాంటి పనులు చేయించుకోరాదు. క్రైస్తవుల ఇండ్లలో పనులు మాత్రం చేయాలి. 612లో సిసెబుట్ (sisebut) అనే రాజు యూదులపై బలవంతపు మార్పిళ్లకు పాల్పడ్డాడు. క్రైస్తవ మతంలోకి మారకపోతే దేశం విడిచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశాడు. చాలామందిని బాప్తిజం చేసి క్రైస్తవంలోకి మార్చేశాడు. ఆ తరువాత వచ్చిన రాజులు యూదులపై భరించలేని పన్నులు, ఆంక్షలు విధించడం, వారి మతాన్ని ఆచరించడం శిక్షార్హమైన నేరంగా ప్రకటించారు. క్రైస్తవులపై యూదులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వారిని బంధించి చిత్రహింసలు పెట్టారు. యూదుల పిల్లలను క్రైస్తవులకు బానిసలుగా చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 711లో స్పెయిన్ లోకి ముస్లింలు తొలిసారి అడుగుపెట్టారు. అప్పటికే దారుణమైన క్రైస్తవ అణచివేతలను భరిస్తూ వచ్చిన యూదులకు ముస్లింలు తమ విమోచనకు వచ్చిన వారిగా కనిపించారు. ఐబీరియాను ముస్లింలు ఆక్రమించిన తరువాత యూదులకు కొంత స్వేచ్ఛ లభించింది. అయితే స్పెయిన్‌లో పూర్వపు ఆరియన్ పుస్తకాలు, మతపరమైన శిల్పాలు, ఆలయ నిర్మాణాలు చాలా కొన్ని మాత్రమే నిలిచాయి. 8వ శతాబ్దం ప్రారంభానికి స్పెయిన్‌ పూర్తిగా క్రైస్తవ రాజ్యంగా మారింది. ఈ బలవంతపు మతమార్పిడి వల్లే 711 CEలో ఉమయ్యద్ ల కాలంలో ముస్లిం దళాలు ఐబీరియన్ ద్వీపకల్పంలోకి ప్రవేశించినప్పుడు, కొంతమంది స్థానిక వర్గాలు వారిని “విముక్తి దాతలుగా” కూడా స్వాగతించాయి. ఈ కాలంలో మళ్లీ ఐబీరియాలో యూదులకు కొంత స్వేచ్ఛ లభించింది. క్రైస్తవులను ‘ధిమ్మీ’లు అంటే రక్షితులుగా వారికి రక్షణ కల్పించారు. 711లో గ్వాడలేట్ యుద్ధంలో విజిగోత్‌కు చెందిన రాజు రోడ్రిజ్క్ ఓడిపోయాడు. ఐబీరియా ద్వీపకల్పాన్ని ‘మూర్లు’ స్వాధీనం చేసుకొన్నారు. ఆ తరువాత వెంట వెంటనే కొర్టోబా, సెవిల్లే, టొలెడో వంటి నగరాలు కూడా ఇస్లామిక్ పాలనలోకి వచ్చాయి. ఉమయ్యద్ ఖలీఫత్ ల కాలంలో ప్రాచీన విద్య, కళలు, శాస్త్రాలను, ఫిలాసఫీని పునర్జీవింప జేసే ఒక ప్రయత్నం జరిగింది. కానీ, క్రైస్తవుల పోరాటాలు నిరంతర అంతర్గత అస్థిరతకు కారణమయ్యాయి. ఉత్తర ఐబీరియాలోని ఆస్ట్యూరియస్ ప్రాంతంలో చిన్న చిన్న క్రైస్తవ రాజ్యాలు కొనసాగాయి. 11వ శతాబ్దం నుంచి క్రైస్తవ పునరాక్రమణ ఐబీరియాలో మొదలైంది. 1085లో టోలెడోను స్వాధీనం చేసుకున్న మిషనరీలు.. 1492 నాటికి గ్రనాడాను స్వాధీనం చేసుకోవడంతో నేటి స్పెయిన్ ను పూర్తిస్థాయి క్యాథలిక్ రాజ్యంగా రూపాంతరం చెందింది. ఇస్లాం రాజ్యం అంతరించిపోవడంతో యూదులు, ముస్లింలు దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని, లేదా మతం మారిపోవాలని డిక్రీ (Alhambra Decree) జారీ చేశారు. వాళ్లు ఉంటే.. రాజకీయ స్థిరత్వానికి అడ్డంకిగా మారుతారని స్పెయిన్ పై ఆధిపత్యం సాధించిన రెండో ఫెర్డినాండ్, ఒకటో ఇసబెల్లా రాజులు భావించారు. ఈ కారణంగానే డిక్రీ జారీ అయింది. దీంతో లక్షల మంది క్రైస్తవాన్ని స్వీకరించాల్సి వచ్చింది. క్రైస్తవంలోకి మారినప్పటికీ.. కొందరు రహస్యంగా పాత మతాచారాలను అనుసరిస్తున్నారన్న అనుమానంతో వేల మందిని దారుణంగా ఊచకోత కోశారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి చిత్రహింసలు పెట్టి శిక్షలు అమలు చేశారు. వెతికి వెతికి పట్టుకొని నరకం చూపించారు. బహిరంగంగా ఉరి తీయండం, స్తంభాలకు, చెట్లకు కట్టేసి సజీవంగా దహనం చేయడం వంటి దారుణమైన హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. స్పెయిన్ లో క్రైస్తవ, ఇస్లాం, క్రైస్తవ హింసాత్మక పరిణామ క్రమం 770 సంవత్సరాల పాటు కొనసాగింది. స్పానిష్ ఇంక్విసిషన్ అనేది ప్రపంచ చరిత్రలో అత్యంత భయానక ఘట్టంగా చెప్పుకోవచ్చు. మతపరమైన తీవ్రమైన అసహనంతో పాటు, రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మతాన్ని వినియోగించడం ఎంతటి విపత్తులకు దారి తీస్తుందో స్పెయిన్ లో 1492 నుంచి సుమారు 350 సంవత్సరాల పాటు జరిగిన దమన కాండ గుణపాఠాలు నేర్పుతుంది. ఇప్పుడు భారతదేశంలో ఒక మతాన్ని వినియోగించుకుంటూ.. మరో మతాన్ని న్యూనతాభావంతో చూడటం.. ఆ మతంపై అవసరం లేని నియంత్రణ, ఆధిపత్యం చెలాయించడం వల్లనే.. దేశంలో నిరంతర మత అశాంతి నెలకొని ఉన్నదంటే అత్యుక్తి కానే కాదు.

స్పెయిన్ లో జరిగిన మరో తీవ్రమైన నష్టం భాష సాహిత్యాలకు జరిగింది. స్పానిష్ భాష చాలా సంపన్నమైన భాష. ముస్లిం రాజులు మూర్స్ వచ్చిన తరువాత వేల కొలది అరబిక్ పదాలు స్పానిష్ లోకి వచ్చి చేరి దాని పదజాలం మరింత పరిపుష్టం చెందింది. కానీ, యూదుల బహిష్కరణ తరువాత హిబ్రూ మూల పదాలు కనుమరుగయ్యాయి. పుస్తకాలను సెన్సార్ చేశారు. కాస్టిలియన్ స్పానిష్ భాషను రాజ్యానికి అధికార భాషగా ప్రకటించారు. మతపరమైన పదజాలాన్ని అత్యధికంగా చొప్పించారు. సాంస్కృతిక వైవిధ్యాన్ని నామమాత్రం చేశారు. క్యాథలిక్ లకు విరుద్ధంగా ఉన్న పదాలను పూర్తిగా తొలగించారు. క్రైస్తవ ఫిలాసఫీ తప్ప మరేదీ లేకుండా కోతలు వేశారు. స్పానిష్ లోనుంచి మాయమైపోయిన హిబ్రూ మూలాలు ఉన్న కొన్ని కొన్ని పదాలను చూడండి.

Spanish Word Meaning (English) Origin
Azúcar Sugar Arabic (as-sukkar)
Aceite Oil Arabic (az-zayt)
Alcalde Mayor Arabic (al-qadi)
Ojalá hopefully / God willing Arabic (in shā’ Allāh)
almohada Pillow Arabic (al-mukhadda)
alfombra Carpet Arabic (al-ḥanbal)
almacén warehouse Arabic (al-makhzan)
guitarra Guitar Arabic (qitara)
Naranja Orange Arabic (nāranj)
zanahoria Carrot Arabic (safunāriyya)
Sabio Wise Hebrew (ḥakham)
Paz Peace Hebrew (shalom)
Amen Amen Hebrew (āmēn)
Misa mass (religious) Hebrew/Latin liturgy
Sábado Saturday Hebrew (shabbat)
Mesías Messiah Hebrew (māšīaḥ)

భాష, సాహిత్యం, సాంస్కృతిక, రాజకీయ, మత, సామాజిక పరంగా స్పెయిన్ ను క్రైస్తవంలోకి మార్చిన మిషనరీల రక్త చరిత్ర ఇది.

ఆస్ట్రియా, బవేరియా

ఐరోపాలోని ఆల్ప్స్ పర్వతాల సమీపంలో ప్రస్తుతం మనం ఆస్ట్రియా, దక్షిణ జర్మనీ దేశాలను చూడవచ్చు. క్రీస్తు పూర్వం 400 నుంచి ఇక్కడ నాగరికత మనకు కనిపిస్తుంది. రోమన్ కాలం చివరలో రోమన్లు ఆస్ట్రియాను స్వాధీనం చేసుకున్నారు. తరువాత అక్కడి తెగలైన బవేరియన్లు, అలమానీలు, సువేవులు ఈ ప్రాంతాలకు వలస వచ్చి జీవించారు. ఇక్కడ కూడా మిగతా ఐరోపా దేశాల మాదిరిగానే తెగల సామీప్యతలు, ప్రకృతి దేవతల ఆరాధనలు ఉండేవి. ఏడు ఎనిమిది శతాబ్దాలలో ఈ ప్రాంతాలను క్రైస్తవీకరించడానికి రోమన్ చర్చి చాలా ప్రయత్నం చేసింది. పైన మనం చర్చించుకున్న విసిగోత్ లు, ఆస్ట్రియా ప్రజలు జర్మానిక్ తెగకు చెందినవారు. వీరిలో వృక్షారాధన చాలా చాలా ముఖ్యమైనది. వీరికి థోర్ (జర్మన్ భాషలో డోనార్- donar) వంటి దేవుళ్లను పూజించేవారు. ముస్లిం దాడుల తరువాత విసిగోత్ రాజు పెలేజియస్ అక్కడ రాజ్యాన్ని స్థాపించాడు. ఓక్ చెట్లు వాళ్లకు చాలా పవిత్రమైనవి. థోర్‌ను ఉరుము మెరుపులకు సంబంధించిన దేవుడిగా భావించేవారు, మనం ఇంద్రుడిని భావించినట్టుగా. గురువారాన్ని ఇంగ్లిష్ లో Thursday అని అంటారు. ఇది థోర్ పేరు (Thor’s Day) నుండే వచ్చిందని చెప్తారు. జర్మనీలోని హెసే ప్రాంతంలో గీస్మర్ (Geismar) గ్రామంలో థోర్ ఓక్ చెట్టు ఉండేది. ఆ చెట్టును దేవుడి నివాసంగా భావించి పూజించేవారు. ఇలాంటి వృక్షాలు ఆ ప్రాంతంలోనే ఉండేవి. ఈ చెట్టు థోర్ అనే దేవుడికి ప్రతీకగా భావించేవారు. ఈ చెట్టు కింద మతాధిపతులు రచ్చబండలు జరిపి తీర్పులు ఇచ్చేవారు. ఇది మతపరమైందే కాకుండా రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా కూడా ఉండేది. ఈ జర్మానిక్ ప్రజలను క్రైస్తవీకరించడానికి క్రీస్తు శకం 723లో సెయింట్ బోనిఫెస్ అనే మతప్రచారకుడిని రోమన్ చర్చి, ఆస్ట్రియా, బవేరియా ప్రాంతానికి పంపించింది. ఇతను అక్కడికి వచ్చి ముందుగా చేసిన పని.. ఈ థోర్ వృక్షాన్ని నరికి వేయడం. ఈ చెట్టును నరికి వేస్తే.. థోర్ దేవుడు నన్ను శిక్షించాలి అంటూ ప్రజల మనసులో ఉన్న థోర్ శక్తిని సవాలు చేశాడు. అందరూ చూస్తుండగానే ఆ చెట్టును నరికేశాడు. కానీ అతడికి ఏమీ కాకపోవడంతో స్థానిక దేవతలపై క్రైస్తవ మతం విజయం సాధించినట్టుగా ప్రచారం ప్రారంభించారు. దీంతో అక్కడి ప్రజల్లో ఆత్మ న్యూనతా భావన తీవ్రంగా పెరిగిపోయింది. వాళ్ల దేవతలు నకిలీలుగా ప్రచారం మొదలైంది. ఆ దేవతలకు ఎలాంటి శక్తులు లేవన్న ప్రచారమూ తీవ్రమైంది. ఈ బోనిఫెస్ ఆ థోర్ చెట్టు కలపతో ఒక చర్చి నిర్మించాడు. దాన్ని సెయింట్ పీటర్ కు అంకితమిచ్చాడు. ఇప్పుడు అలాంటి చెట్టు ఉన్నదన్న ఆనవాలే లేకుండా పోయింది. మొదట్లో స్థానిక మత నాయకులు బోనిఫెస్ చర్యలను ప్రతిఘటించాలని ప్రయత్నించారు కానీ, అటు ఫ్రాన్స్, ఇటు రోమన్ సైన్యాల మద్దతుతో మిషనరీలు స్థానిక మత నాయకులను పూర్తిగా అణచివేశాయి. వృక్షారాధన చేసే ప్రాంతాలను నాశనం చేశారు. విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. మతపరమైన గ్రంథాలు కాల్చివేశారు. దేవుళ్లపై పాడుకొనే భజన గీతాలాపనలపై కఠినమైన నిషేధాన్ని అమలు చేశారు. సంప్రదాయ బలి పద్ధతులను నిషేధించారు. వాటికి బదులుగా క్రైస్తవ పూజలను రుద్దారు. క్రైస్తవం స్వీకరించని వారిపై చర్చి మరణ దండన విధించింది. చర్చి సహకారంతో స్థానిక డ్యూక్, చీఫ్ లను రోమ్ చర్చికి బానిసలను చేశారు. వేలు లక్షల మంది ఈ ప్రక్రియలో బలైపోయారు. ఆస్ట్రియా చరిత్రలో రక్తపాతం, ఆలయ విధ్వంసం, బలవంతపు మార్పిడి, సాంస్కృతికత నాశనం అన్నది మరిచిపోలేనిది.

ఆంగ్లో సాక్సన్ (ఇంగ్లండ్)

ఆంగ్లో సాక్సన్ అంటే దాదాపుగా ప్రస్తుత ఇంగ్లండ్ ప్రాంతం. ఈ దేశంలో క్రైస్తవీకరణ అన్నది మొత్తం ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకునేందుకు క్రైస్తవ మతానికి అత్యంత శక్తిమంతమైన మార్గాన్ని అందించింది. ఇంగ్లండ్ నుంచే క్రైస్తవ మిషనరీలు.. తమ మత విస్తరణకు ప్రస్తుతం అనుసరిస్తున్న దౌత్య పరమైన కూట నీతిని అనుసరించడం ప్రారంభించారు. ఇది ఇతర దేశాల్లో మాదిరిగా జరిగిన మత మార్పిడులు కానే కావు. ప్రధానంగా మిషనరీలు లౌక్యంగా వ్యవహరించి అక్కడి రాజులను హనీ ట్రాప్‌లో పడేసి మరీ లోబరుచుకున్నాయి. ఆ తరువాతి కాలంలో ఈ రాజకీయ కూట నీతినే మిషనరీలు ప్రధానంగా అనుసరిస్తూ వచ్చాయి. క్రైస్తవ రాజుల కుమార్తెలతో వివాహాలు జరిపించడం, దౌత్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి చర్యల ద్వారా క్రైస్తవీకరణ పెరుగుతూ వచ్చింది. ఆరో శతాబ్దం చివర పోప్ గ్రెగరీ, క్రైస్తవ మిషనరీలను కెంట్ రాజ్యానికి పంపించాడు. కెంట్ రాజు ఎథెల్ బర్ట్ బ్రెట్ వాల్టా ఇతనికి తన భార్య బెర్తాతో క్రైస్తవ మత పరిచయం ఉన్నది. ఎందుకంటే ఆమె ఫ్రాన్స్ నుంచి వచ్చింది. ఆమె పెండ్లి చేసుకొని కెంట్ వచ్చేటప్పుడు తన వెంట ఒక బిషప్‌ను వెంటబెట్టుకొని వచ్చింది. అంతే ఆమె కోసం రాజభవనంలో క్రైస్తవ ఆచారాలు మొదలయ్యాయి. రాజుగారు క్రైస్తవం వైపు మళ్లారు. కెంట్ రాజు అప్పటికే ప్రాంకిష్ రాజ్యంతో రాజకీయ సంబంధాలు పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 597వ సంవత్సరంలో రాజు అవసరాన్ని పోప్ గుర్తించాడు. ఆగస్టిన్ ఆఫ్ కెంటర్బరీ అనే బిషప్ ను కెంట్ దగ్గరకు పంపించాడు. అగస్టీన్ 597లో థానెట్ ద్వీపానికి చేరుకొని సువార్త బోధించడానికి ఏథెల్ బర్ట్ ను ఒప్పించుకున్నాడు. ఇతను రాజుతో, రాణితో చర్చలు జరపడం, రాజు అవసరాన్ని, బలహీనతలను వాడుకొని అతడిని క్రైస్తవుడిగా మార్చడంలో విజయం సాధించాడు. (Bede, Ecclesiastical History of the English People, Book I). ఇట్లా రాజకీయ ఒత్తిళ్లు వివాహాలకు దారి తీసి.. తరువాత మతాంతరీకరణకు కారణమయ్యాయి. కెంట్ రాజు తరువాత నార్త్ ఆంబ్రియా రాజు ఎడ్విన్.. ఈ కెంట్ రాజు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి విధించిన షరతు ఏమిటో తెలుసా? తన కూతురు క్రైస్తవ మతాన్నే అనుసరిస్తుంది. తన వెంట మిషనరీలను తెచ్చుకుంటుంది. కొద్ది రోజుల్లోనే ఎడ్విన్ క్రైస్తవుడిగా మారిపోయాడు. (Higham, Convert Kings, 1997). మతపరమైన హనీట్రాప్ గా దీన్ని పేర్కొనవచ్చు. భర్తను క్రైస్తవుడిగా మార్చినట్లయితే రోమన్, ఫ్రాంకిష్ రాజ్యాల మద్దతు ఆ దేశానికి, ఆ రాజుకు లభించేవి. దీనివల్ల రాజుకు ఒక కొత్త దౌత్య కూటమి బలం లభించేది. ఆంగ్లో సాక్సన్ రాజ్యాలలో రాజకీయ వివాహాలు జరిగిన కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచుతున్నాను.

Year Kingdom Ruler Marriage Impact on Conversion
c. 580–597 Kent Æthelberht Marriage to Bertha (Frankish princess, Christian) Bertha brought Bishop Liudhard; set stage for Augustine’s mission; Æthelberht baptized 597
625–627 Northumbria King Edwin Marriage to Æthelburg of Kent (Christian princess) Missionaries allowed in court; Edwin baptized 627 at York
630s Mercia King Penda (pagan) Marital alliances with Christian royal houses Indirect pressure; later successors moved toward Christianity
653 Mercia Peada (son of Penda) Marriage to Alhflæd (daughter of Oswiu, Christian) Accepted Christianity at marriage; led to Mercian conversion
660s East Anglia King Sigeberht Influenced by Frankish Christian contacts Brought back Christian teachers; founded schools and churches

రాజు క్రైస్తవంలోకి మారడం అంటే అది కేవలం ఆధ్యాత్మికమూ, భక్తో, మతమూ కాదు.. మతానికి రాజకీయ ఆధిపత్యం లభించడమే. ఒక రాజు క్రైస్తవ మతంలోకి మారడం అంటే.. అతని ఆధీనంలోని ప్రజలు, అతని ఆధీనం లోని చిన్న చిన్న పాలకులను కూడా బలవంతంగా మత మార్పు అనేది అనివార్యమైంది. ఒక రాజకీయ వ్యూహంగా మారి, రాజ్యాల మధ్య మతపరమైన అనుబంధాన్ని పెంచడానికి, క్రైస్తవ ప్రపంచాన్ని విస్తరించుకోవడానికి మిషనరీల ఈ చతురత పూర్తిగా తోడ్పడింది. కెంట్ రాజు, ఎడ్విన్ ల ద్వారా క్రైస్తవీకరణ తరువాత చుట్టుపక్కల అందరు పాలకులు క్రైస్తవాన్ని స్వీకరించారు. రోమన్ చర్చి ఇంగ్లండ్ మీద పూర్తి పట్టును సాధించింది. ఒక విధంగా మిషనరీలే రాజ్యాలను నడిపించాయి. స్థానిక మతాలు, దేవాలయాలు. ఆచారాలు అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఆంగ్లో సాక్సన్ లో ధ్వంసం అయిన దేవాలయాల వివరాలు చూడండి.

ప్రాంతం పగాన్ దేవాలయం / పవిత్ర స్థలం ప్రధాన దేవతలు /పూజా సంప్రదాయం తరువాత క్రైస్తవీకరణ తర్వాత పరిస్థితి
కెంట్ (Kent) థునోర్ (Thor) దేవాలయం ఉన్నట్లు ఆధారాలు (Canterbury సమీపంలో) థునోర్ (వజ్ర దేవుడు), ఓడిన్ St. Augustine’s Abbey మరియు Canterbury Cathedral నిర్మాణం; పాత గుడులు ధ్వంసం
సస్సెక్స్ (Sussex) అరణ్యాల్లో పవిత్ర వనాలు వనదేవతలు, ఫ్రేయా పవిత్ర వనాలు నరికివేత, చర్చిల కోసం వినియోగం
నార్తంబ్రియా (Northumbria) గుడులు & విగ్రహాలు (Goodmanham ప్రాంతం) ఓడిన్, లోకీ క్రైస్తవ రాజు ఎడ్విన్ కాలంలో విగ్రహాలను బహిరంగంగా ధ్వంసం చేశారు (Bede ప్రకారం)
మెర్సియా (Mercia) పవిత్ర రాతి వలయాలు (Stone circles) పూర్వ ఆంగ్లో–సాక్సన్ పూజా విధులు కొన్ని నశించాయి, మరికొన్ని చర్చిలుగా మారాయి.
వెసెక్స్ (Wessex) Woden (Odin) కు అంకితమైన ఆలయం వోడెన్ గుడులు కూల్చి, స్థానంలో క్రైస్తవ పీఠాల నిర్మాణం
ఈస్ట్ ఆంగ్లియా (East Anglia) అరణ్య దేవాలయాలు, విగ్రహాలు ఫ్రేయా, సూర్య పూజ Christian monasteries నిర్మాణమయ్యాయి(ఉదా: Ely Abbey)

ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవీకరణ, ఆంగ్లో సాక్సన్ సమాజంలో రాజకీయ, ఆర్థిక, మతపరమైన ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసింది. (Mayr-Harting, The Coming of Christianity to Anglo-Saxon England, 1991).

కీవన్ రస్ (ప్రస్తుత ఉక్రెయిన్, రష్యా, బెలారస్)

మూడో శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమైన క్రైస్తవీకరణ రష్యా (అప్పట్లో కీవన్ రస్ -Kievan Rus) అనేవారు.. ఉచ్చారణలో ఏదైనా తేడా ఉండవచ్చు) దగ్గరకు వచ్చేసరికి సుమారు 800 సంవత్సరాలు పట్టింది. రష్యా క్రైస్తవీకరణకు సంబంధించిన సమాచారం ఆనాటి స్లావిక్ చరిత్ర గ్రంథం nestor chronicle లభిస్తుంది. వ్లాదిమిర్ ది గ్రేట్ హయాంలో కీవన్ రస్ లేదా రష్యా క్రైస్తవీకరణ జరిగింది క్రీస్తు శకం 988 సంవత్సరంలో . బైజాంటైన్ చక్రవర్తి రెండో బాసిల్ కు సైనిక సహాయం అందించేందుకు అన్నా పోర్పెయిరోజెనిటాను పెండ్లి చేసుకున్నాడు. దీనికి ముందస్తు షరతుగా క్రైస్తవాన్ని స్వీకరించాడు. లవ్ జిహాద్ టైప్ అన్నమాట. “We no longer knew whether we were in heaven or on earth… nor such beauty, and we know not how to tell of it. Only this we know, that God dwells there among men, and their worship is fairer than the ceremonies of other nations.” అని నెస్టర్ క్రానికల్ లో రికార్డు అయింది. కాన్స్టాంటినోపుల్ లోని హాగియా సోఫియా అనే ఆలయంలో వ్లాదిమిర్ ఈ మాటలు అన్నట్టు చరిత్ర చెప్తున్నది. గ్రీకు నుంచి వచ్చిన మత ప్రతినిధులు ఆయన్ను క్రైస్తవంలోకి మార్చారు. ఆ తరువాత అదే సంవత్సరంలోనే వ్లాదిమిర్ దేశ వ్యాప్తంగా క్రైస్తవీకరణను చేపట్టాడు. ముందుగా అతను చేసిన పని తన సైనికులను క్రైస్తవంలోకి మార్చాడు. ఆ తరువాత స్థానిక డ్నిపర్ నది దగ్గరకు పిల్లా పాపలతో సహా ప్రజలందరినీ ఒకేసారి పిలిచి నదిలోకి దిగి నీళ్లలో మునిగి క్రైస్తవ మతం స్వీకరించేలా చేశాడు. ఎవరైనా నిరాకరిస్తే.. రాజుకు శత్రువులుగా ప్రకటిస్తామని హెచ్చరించాడు. క్రైస్తవం స్వీకరించిన వారిని పునర్జన్మ పొందినట్టుగా ప్రకటించాడు. రష్యాలో అత్యంత ప్రధానమైన దేవుడు ‘పెరున్’. ఈ విగ్రహానికి అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉండింది. పెరున్ విగ్రహాన్ని ఓక్ కలపతో తయారు చేసేవారు. ఈ విగ్రహానికి వెండి తల, బంగారు మీసాలు ఉండేవి. ఈ దేవుడి చేతిలో గొడ్డలి ఆయుధంగా ఉండేది. మనం ఇవాళ గ్రామదేవతలకు కోడెలు కడతామే.. అలాగే.. ఈయనకు ఆనాటి ప్రజలు కోడెలు కట్టి ముక్కులు చెల్లించుకునేవారు. పెరున్ విగ్రహాన్ని కేవలం దేవుడిగా మాత్రమే కాదు.. కీవ్ నగరంలోని పెరున్ విగ్రహాన్ని రాజ్య చిహ్నంగా, రాజముద్రగా భావించేవారు. రాజు, సైన్యాధిపతులు, రాజకుమారులు, ప్రధాన పూజారులు పెరున్ కు పూజలు నిర్వహించేవారు. ఈ విగ్రహం దగ్గరే ప్రజాసభలు నిర్వహించి సమస్యలను పరిష్కరించేవారు. కానీ, వ్లాదిమిర్ మతం మార్చుకున్న తరువాత ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. విగ్రహాన్ని డ్నిపర్ నది దాకా ఈడ్చుకుంటూ వచ్చి నదిలో పడేశాడు. వాస్తవానికి ఇదే వ్లాదిమిర్ తాను అధికారంలోకి వచ్చిన 980వ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా పెరున్ విగ్రహాలను పెద్ద ఎత్తున నెలకొల్పాడు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన తరువాత ఆయనే వీటిని ధ్వంసం చేయించాడు. వ్లాదిమిర్ క్రైస్తవీకరణ రష్యా, బెలారస్, ఉక్రెయిన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విధ్వంసానికి కారణమైంది. పాత ఆలయాలను మూసి వేసి పూజారులను హింసించి హతమార్చారు. ఆలయాలను ధ్వంసం చేసి క్రైస్తవ గిర్జా (ప్రార్థనామందిరాలు) నిర్మించారు. పెరున్ ఆలయాన్ని కూల్చిన ప్రదేశంలోనే ప్రసిద్ధ సెయింట్ బాసిల్ చర్చి నిర్మాణం అయింది. స్లావిక్ దేవాలయాల ఆనవాళ్లు కూడా కనపడకుండా కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రజావృత్తులు, పండుగలు కూడా క్రైస్తవ రూపం సంతరించుకున్నాయి. రాజకుమార్తె అన్నాతో వివాహం తరువాతే.. ఈ సమూల మార్పు జరిగింది. ఇది కేవలం మతపరమైన మార్పు కాదు. క్రైస్తవ ఆధిపత్యపు వికృత రూపం. దీనివల్ల వ్లాదిమిర్ కు బైజాంటైన్ సైనిక, ఆర్థిక మద్దతు లభించింది. రాజ్యంపై క్రైస్తవ మిషనరీల ఆధిపత్యం స్థాపన జరిగింది.

క్రైస్తవీకరణ చెందిన తొలి పది దేశాల్లో ధ్వంసమైన ప్రధాన దేవాలయాల వివరాలు

దేశం / రాజ్యం దేవాలయం / పవిత్ర స్థలం జరిగిన మార్పు / విధ్వంసం సుమారు సంవత్సరం
ఆర్మేనియా Temple of Anahit (Eriza) కూల్చివేత, దానిరాళ్లతో చర్చిల నిర్మాణం 301 CE తర్వాత
Temple of Mihr (Bagavan) ధ్వంసం చేసి క్రైస్తవచర్చి ఏర్పాటు 4వ శతాబ్దం
జార్జియా (ఇబేరియా) Armazi Temple (Mtskheta దగ్గర) రాజు మిరియన్ ఆజ్ఞతో కూల్చివేత 330 CE
అక్సుం రాజ్యం (ఎథియోపియా) Temple of Almaqah మూసివేసి, క్రైస్తవ చర్చిలను నిర్మించారు 4వ శతాబ్దం మధ్య
రోమన్ సామ్రాజ్యం Serapeum of Alexandria మోబ్ అల్లర్లలో పూర్తిగా కూల్చివేత 391 CE
Temple of Vesta (Rome) మూసివేత, పూజలు ఆగిపోయాయి 394 CE
Parthenon (Athens) అథీనా దేవాలయం → చర్చిగా మారింది 6వ శతాబ్దం
ఐర్లాండ్ Hill of Tara shrines ద్రుయిడ్ పూజా స్థలాలు ధ్వంసం 5వ శతాబ్దం
Sacred groves (Druid forests) నరికివేయబడి, చర్చిల ఏర్పాటు 5–6వ శతాబ్దం
ఫ్రాంక్స్ (ఫ్రాన్స్) Shrines of Woden/Donar క్రైస్తవ రాజు క్లోవిస్ కాలంలో నాశనం 5వ శతాబ్దం చివర
విజిగోత్స్ (స్పెయిన్) Iberian-Roman shrines మూసివేయబడి చర్చిలుగా మారాయి 6వ శతాబ్దం
జర్మానిక్ తెగలు (జర్మనీ) Donar Oak (Hesse) సెంట్ బోనిఫేస్ నరికివేసాడు 723 CE
ఇంగ్లాండ్ (ఆంగ్లో–సాక్సన్) Temple of Goodmanham (Yorkshire) బీడ్ ప్రకారం చీఫ్టెన్ కోయిఫి చేత ధ్వంసం చేయించారు. 627 CE
కియేవన్ రస్ (రష్యా) Temple of Perun (Kiev) విగ్రహం నదిలో పడేసి ఆలయం కూల్చారు. 988 CE

ఈ వ్యాసానికి సంబంధించి పరిశోధించిన రిఫరెన్సుల వివరాలు..

ఆర్మేనియా & జార్జియా

Rapp, Stephen H. Studies in Medieval Georgian Historiography: Early Texts and Eurasian Contexts. Peeters, 2003.

ఎథియోపియా (బీటా ఇజ్రాయెల్)

Kaplan, Steven. The Beta Israel (Falasha) in Ethiopia: From Earliest Times to the Twentieth Century. New York University Press, 1992.

స్పెయిన్

Baer, Yitzhak. A History of the Jews in Christian Spain. 2 vols. Philadelphia: Jewish Publication Society, 1961.

Collins, Roger. Visigothic Spain, 409–711. Oxford: Blackwell, 2004.

Kamen, Henry. The Spanish Inquisition: A Historical Revision. Yale University Press, 1997.

Peters, Edward. Inquisition. Berkeley: University of California Press, 1988.

ఐర్లాండ్

O’Corráin, Donnchadh. Ireland Before the Normans. Dublin: Gill and Macmillan, 1972.

Watt, J.A. The Church and the Two Nations in Medieval Ireland. Cambridge University Press, 1970.

యూరప్ – సమగ్రం

Fletcher, Richard. The Barbarian Conversion: From Paganism to Christianity. University of California Press, 1999.

Davies, Norman. Europe: A History. Oxford University Press, 1996.

స్కాండినేవియా & వైకింగ్స్

Sawyer, Peter. The Oxford Illustrated History of the Vikings. Oxford University Press, 1997.

కియేవన్ రస్ (రష్యా–ఉక్రెయిన్ ప్రాంతం)

Cross, Samuel H., and Sherbowitz-Wetzor, Olgerd P. (translators). The Russian Primary Chronicle: Laurentian Text. Cambridge, Mass.: Medieval Academy of America, 1953.

Franklin, Simon, and Shepard, Jonathan. The Emergence of Rus 750–1200. London: Longman, 1996.

Obolensky, Dimitri. Byzantium and the Slavs. Crestwood, NY: St. Vladimir’s Seminary Press, 1994.

సాధారణ క్రైస్తవ సంప్రదాయాలు

Binns, John. An Introduction to the Christian Orthodox Churches. Cambridge University Press, 2002.

(ఇంకా ఉంది)

Exit mobile version