Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-20

[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

చాప్టర్ 21.

ఇవాళ ప్రపంచంలో క్రైస్తవ మతానికి నాయకత్వం వహిస్తున్నది.. మాయాతోపాటు అత్యంత దారుణంగా అంతమైన ప్రాచీనమైన నాగరికతలు గ్రీకు, రోమన్. ఈ మూడు నాగరికతలు కూడా పూర్తిగా క్రైస్తవ మిషనరీల ద్వారా మాత్రమే నష్టమైనాయి. రోమ్ నాగరికత విషయానికి వస్తే.. అపార విజ్ఞానానికి గని. ప్రపంచంలో ప్రాచీన నాగరికతల్లో అత్యంత ప్రాచీనమైన వాటిలో భారత్‌తో పాటు, గ్రీకు రోమన్ నాగరికతలు ముఖ్యంగా చెప్పుకోవలసినవి. గ్రీకు రోమన్ ప్రపంచం తత్త్వ శాస్త్రంలో, కేంద్రీకృత ప్రజాస్వామిక పరిపాలనలో, ఇంజినీరింగ్, కళలు, న్యాయ మీమాంసల్లో ఎంతో అభివృద్ధి సాధించిన నాగరికతలు. జాతి వివక్ష లేకుండా గొప్పగా రాణించిన నాగరికత అది. ఇటలీ ద్వీపకల్పం, గ్రీస్, సైప్రస్, ఐబీరియన్, అనటోలియన్ (ఇప్పటి టర్కీ), గౌల్ (ఫ్రాన్స్), సిరియా, లెబనాన్, ఇజ్రాయిల్, పాలస్తీనా, ఈజిప్టు, ట్యునీషియా, అల్జీరియా, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఉత్తర అల్బేనియా, బోస్నియా, బల్గేరియా, మాసడోనియా, హంగేరీ, ఈజిప్టు, సినాయ్ ద్వీపకల్పం తదితర ప్రాంతాలన్నీ కూడా గ్రీకు, రోమన్ సంస్కృతిలో భాగంగానే ఉండేవి. ఈ రెండు నాగరికతల గురించి వింటుంటేనే ఆశ్చర్యమేస్తుంది. విజ్ఞానం, కళ, ప్రజాస్వామ్యం, మానవతావాదం ఈ మూడూ కలిస్తే.. గ్రీకు రోమన్ సంస్కృతి అని మనం చెప్పవచ్చేమో. క్ర్రీస్తు శకం మొదలైన తరువాత నాలుగు నుంచి ఆరో శతాబ్దం మధ్య కాలంలో క్రైస్తవ మిషనరీలు గ్రీకు రోమన్ ప్రపంచాలను పూర్తిగా క్రైస్తవీకరించాయి. ఈ రెండు నాగరికతల క్రైస్తవీకరణ జరిగిన తీరును తెలుసుకోవడానికి ముందు ఆ నాగరికతల గురించి కొంత అవగాహనకు రావడం అవసరం.

“In the life of the mind they [the Greeks] reached frontiers which the rest of mankind cannot permit themselves to fall short of, at least in their attempts to acknowledge and to profit…” (paraphrase of Burckhardt’s well-known formulation” (The Greeks and Greek Civilization, Jacob Burckhardt). గ్రీకు నాగరికత గురించి జాకబ్ బుచర్డ్ అభిప్రాయం ఇది. మనిషి జీవితంలో అత్యున్నత స్థితికి చేరుకోవడం లో గ్రీకులు ఎలా విజయం సాధించారో ఆయన చెప్పారు. మిగతా మానవులు కనీసంగా కూడా ఆ స్థాయికి చేరుకోవడం కష్టమని పేర్కొనడంలోనే గ్రీకు నాగరికత ఎంత ఉన్నతమైందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి మాదిరిగా గ్రీకు ప్రపంచం మతాధికారంతో నడవలేదు. విచారణ, అనుభవం, ధర్మపాలన అన్న తత్త్వ చింతనతో మాత్రమే నడిచింది. ప్రపంచంలోనే మేటి తత్త్వవేత్తలు గ్రీసులో కనిపిస్తారు. వీరందరి గురించి వివరించుకుంటూ పోతే.. ఒక్కొక్కటి ఒక్కో ఉద్గ్రంథం అవుతుంది. నేను ప్రస్తావన మాత్రమే చేస్తాను.

సోక్రటీస్: ఏథెన్స్ నుంచి విశ్వవ్యాప్తంగా ఎదిగి వచ్చిన ఈ పాశ్చాత్య తత్త్వవేత్త గురించి తెలియని వారెవరుంటారు? పాశ్చాత్య తాత్త్విక సిద్ధాంతానికి సోక్రటీస్ పితామహుడు. ఈ మిషనరీలు, కమ్యూనిస్టులు ఎవరూ పుట్టకముందే.. ప్రశ్నించే తత్త్వాన్ని ప్రజల్లో పాదుకొల్పడానికి ప్రయత్నించిన మేధావి. క్రీస్తు పుట్టడానికి నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం గ్రీకు సంస్కృతిలో ప్రముఖ పాత్ర పోషించిన ఫిలాసఫర్. ‘I know that I know nothing’ నాకేమీ తెలియదన్న విషయం నాకు తెలుసు అన్నది సోక్రటీస్ ముఖ్యమైన మాటగా చెప్తారు. “I am wiser than this man; for neither of us probably knows anything worthwhile, but he thinks he knows something when he does not, whereas when I do not know, neither do I think I know” అని సోక్రటీస్ వాక్యంలోని భావాన్ని ప్లేటో వివరిస్తాడు. భారతీయ తత్త్వ చింతనలో “అహమేవ పండితః అహం చ పండితః అహం న పండితః’ అనే భావన ఉన్నది. మొదట నేనే పండితుడను అని విర్రవీగేవాడు.. నేను కూడా పండితుడను అనే దశకు చేరుకుంటాడు.. అక్కడి నుంచి నేను పండితుడనే కాదు, నాకేమీ తెలియదు అనే దశకు చేరుకుంటాడు. సోక్రటీస్ చెప్పింది కూడా ఈ భారతీయ చింతనను మాత్రమే.

ప్లేటో: సోక్రటీస్ శిష్యుడు, అరిస్టాటిల్‌కు గురువు ప్లేటో. మరో మాటలో చెప్పాలంటే.. గ్రీకుల ఉపనిషత్తు ప్లేటో. రూప సిద్ధాంతాన్ని(forms) ప్రతిపాదించాడు. భారతీయ తత్త్వ చింతన గ్రీకు తత్త్వచింతన వేరు కాదన్నది మనకు గ్రీసు తత్త్వవేత్తలను అధ్యయనం చేస్తే తెలుస్తుంది. భారతీయ తత్త్వచింతన ఏ విధంగా విస్తరించుకుంటూ వెళ్లిందో అర్థమవుతుంది. ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వస్తున్నదంటే.. భారతీయులకు ముస్లింలు, క్రైస్తవులు వచ్చేదాకా ఏమీ తెలియదు అన్న వాదనలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రెండు మతాలు రావడానికి ముందు యావత్ ప్రపంచం మధ్యన సమరసపూర్వక సాంస్కృతిక జీవన విధానం కొనసాగింది. ఇక అసలు విషయానికి వద్దాం. ప్లేటో రూప సిద్ధాంతం ప్రకారం ‘మనకు కనిపించే ప్రపంచం నిజం కాదు. అదంతా శాశ్వతమైన రూపాలకు సంబంధించిన నీడ మాత్రమే. దాన్నే మనం నిజమని నమ్ముతున్నాం.’ భారతీయ తత్త్వచింతనలో శంకరులు చెప్పిన బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అన్న వాక్యం అచ్చంగా ప్లేటో రూపసిద్ధాంతమే. దక్షిణామూర్తి స్తవం మొదటి శ్లోకంలోనే

‘విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం, నిజాంతర్గతం

పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా’

అని ఉంటుంది. ఈ విశ్వం అంతా అద్దంలో కనిపించే నగరంతో సమానం. నిజం మనలోనే ఉన్నది. మాయ వల్ల బయట ఉన్నట్టుగా కనిపిస్తుంది. అని ఈ శ్లోకం అర్థం. ప్లేటో చెప్పింది కూడా ఇదే. ప్రతి ఒక్కరూ కర్మ చేయాలి అన్న గీతావాక్యాన్ని కూడా ప్లేటో అనుసరించాడు. “Justice is harmony of the soul” అని ప్లేటో అన్నాడు. కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ‘యోగః కర్మసు కౌశలం’ అన్న వాక్యం ఇందుకు భిన్నమైంది. కాదు. అంతే కాదు, ఉపనిషత్తులు ప్రవచించిన ‘అహం బ్రహ్మాస్మి’ అన్న వాక్యాన్ని ప్లేటో “The soul remembers the truth” గా పేర్కొన్నాడు. భక్తి జ్ఞాన కర్మల ద్వారా మోక్షం లభిస్తుందని ఉపనిషత్తులు చెప్తే.. బుద్ధి ద్వారా నిన్ను నీవు తెలుసుకుంటే.. పరమమైన సత్యం ఏమిటో తెలుస్తుందని ప్లేటో అంటాడు. ఈశావాస్యోపనిషత్తులో “అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే” అన్న శ్లోకం ఉన్నది. “అజ్ఞానంతో మృత్యువును దాటి, జ్ఞానంతో అమృతాన్ని పొందుతాడు” అని దీని అర్థం. భౌతిక కర్మలతో మరణాన్ని దాటి, జ్ఞానంతో మోక్షాన్ని పొందవచ్చని బోధిస్తుంది. భారతీయ తత్త్వచింతనకు ప్లేటో భిన్నమైన వాడు కాదు కాబట్టే అతడిని గ్రీకుల ఉపనిషత్తు అని అన్నాను. కఠోపనిషత్తులోని నచికేత యముల సంభాషణ, శ్రేయస్సు, ప్రేయస్సు లాంటి భావనలు.. ప్లేటో ఫార్మ్స్ సిద్ధాంతం లోని ఇంద్రియాలను అధిగమించి ఒక పరమ నిజాన్ని తెలుసుకోవాలనే తాపత్రయం అనే భావనకు బింబ ప్రతిబింబంగా నిలుస్తుంది. Schopenhauer, Radhakrishnan, McEvilley వంటి వారు ప్లేటో పై భారతీయ ఫిలాసఫీ ప్రభావాన్ని గురించి చర్చించారు కూడా.

అరిస్టాటిల్: ప్లేటో శిష్యుడైన అరిస్టాటిల్ రూప వాదాన్ని హైలో మార్ఫిజం వైపు మళ్లించాడు. రూపం, పదార్థం కలిస్తేనే వస్తువు అన్నాడు. పదార్థము, రూపము, కార్య కారకం, ప్రయోజన కారణం ఈ నాలుగు కారణాలు కలిసి కారణ సిద్ధాంతం ప్రతిపాదించాడు. శరీరానికి జీవశక్తినిచ్చేది ఆత్మగా అంగీకరించిన అరిస్టాటిల్ పునర్జన్మ సిద్ధాంతాన్ని మాత్రం తిరస్కరించాడు. ఈ ప్రపంచమే నిజమని, జీవితాన్ని ఇక్కడే పరిపూర్ణంగా గడపాలి అని ప్రతిపాదించారు. భారతదేశంలోని ధర్మ భావనను అరిస్టాటిల్ అరెటె((Arete – ఉత్తమత్వం) అన్న భావనతో సరిపోల్చదగింది.

గ్రీకు తత్త్వవేత్తలలో ప్రపంచం ఈ ముగ్గురినీ ప్రధానంగా విశ్వవ్యాప్తంగా ప్రభావితులుగా గుర్తిస్తుంది. ప్రపంచ చరిత్రను పరిశోధించి దాదాపు 14 సంపుటాల్లో నిక్షిప్తం చేసిన ప్రఖ్యాత చరిత్రకారుడు విల్ డురాంట్ ఏమన్నారో చూడండి. “They will think of Greece as the bright morning of that Western civilization which, with all its kindred faults, is our nourishment and our life.”. (Will Durant, The Life of Greece (The Story of Civilization, Vol. II))

భారతీయ చరిత్రకారులు రమేశ్ చంద్ర మజుందార్ గ్రీకు, రోమన్ సంస్కృతుల గురించి అద్భుతంగా పేర్కొన్నారు.

“A life of ease and luxury is favourable for the growth of art and literature, and the period under review witnessed remarkable progress of both”. (The Classical Accounts of India (ed. R.C. Majumdar — 1960) అత్యంత సుసంపన్నమైన నాగరికతలుగా వీటిని మజుందార్ వర్ణించారు. సాహిత్యంలో, కళల్లో.. ఇలా అన్నింటిలోనూ అద్భుతమైన పురోగతి సాధించారని ప్రశంసించారు.

ప్రాచీన గ్రీసు, రోమ్, ఈజిప్టు ప్రజలు బహు దేవతారాధనను అనుసరించాయన్న వాస్తవాన్ని ప్రముఖ చరిత్రకారుడు సీతారాం గోయల్ వెల్లడించారు. “Ancient Rome, Greece and Egypt – all polytheistic cultures – were relatively free from religious wars though they had their full quota of wars otherwise.” (Sita Ram Goel, Defence of Hindu Society p.54)

భారత గ్రీకు తత్త్వ విచారణలో సారూప్యతలు చాలా కనిపిస్తాయి. మన ఉపనిషత్తులు చెప్పే బ్రహ్మ భావన.. గ్రీకులోని ‘టు హెనె’ (the one) భావన ఒకటే. ముందే చెప్పినట్టు ప్లేటో ఫార్మ్స్ సిద్ధాంతంలో చెప్పిన పరిపూర్ణ, రూప రహిత రూపాల ఉనికి, ఉపనిషత్తుల ‘నిర్గుణ బ్రహ్మ’ భావన కూడా ఒకటేనని చెప్పాలి. రెండు నాగరికతల దృష్టికోణం ఒకే విధంగా ముందుకు సాగింది. చాలా మంది గ్రీకు తత్త్వవేత్తలు భారతీయ యోగులను దర్శించిన తరువాతే సెల్ఫ్ మాస్టరీ భావనను ప్రతిపాదించినట్టు అర్థమవుతుంది. పైథాగ్రస్ (570 బీసీ నుంచి 495 బీసీ) భారతదేశానికి వెళ్లి భారతీయ విజ్ఞానాన్ని నేర్చుకున్నాడని అల్బర్ట్ బర్క్ (1901), ఏఎన్ మార్లో (1954), జీఆర్‌ఎస్ మీడ్ (1901) లాంటి వారు రాశారు. ఫైథాగ్రస్ కాంచీపురానికి వెళ్లి అధ్యయనం చేసినట్టుగా కూడా రాశారు. గ్రీకు ఫిలాసఫీలో హిందుత్వం, బౌద్ధం ఆనవాళ్లు వచ్చి చేరాయంటే అందుకు కారణం పైథాగ్రస్ వంటి వారి వల్లేనని వీరు పేర్కొన్నారు. పైథాగ్రస్ భారతదేశం నుంచి గ్రీసుకు వెళ్లిపోయిన తరువాత శాకాహారిగా మారిపోవడంపై అంతా ఆశ్చర్యపోయారట. ఈయనే గ్రీసులో గురుకుల విద్యావ్యవస్థకు నాంది పలికాడు. బాహ్య, అంతర వలయాల్లో విద్యార్థులను కూర్చోబెట్టి.. ఒక వలయం నుంచి మరో వలయానికి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి.. ఫలితాలను బట్టి వలయాలను మార్చుకుంటూ వెళ్లేవాడు. మౌనం, ధ్యానం, శరీర నియమాలు పాటించాలన్న పైథాగ్రస్ సూచనలు భారతీయ అష్టాంగయోగంలోని యమ నియమాలకు అనురూపాలు. గురుకుల విద్యావిధానాన్ని సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ బలంగా నమ్మాడు. ఆత్మ ఒక శరీరం నుంచి మరో శరీరానికి ట్రాన్స్ మైగ్రేషన్ అవుతుందనే సిద్ధాంతాన్ని పైథాగ్రస్ ప్రతిపాదించాడు. ఈ పరిశోధనలకు సంబంధించిన డాక్యుమెంట్‌ను రాయల్ ఏషియాటిక్ సొసైటీలో ఇవాళ కూడా మనం చూడవచ్చు. పైథాగ్రస్ చేసిన పరిశోధనల్లో, ఆలోచనల్లో భారతీయ విజ్ఞాన ఆలోచనలకు సంబంధించిన బలమైన మూలాలు మనకు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. నిజానికి పైథాగ్రస్‌కంటే చాలా ముందునుంచే.. మనకు గ్రీకు కథలు.. భారతీయ పురాణ కథల మధ్యన సారూప్యత కనిపిస్తుంది. చాలా పురాతనమైన సంబంధాన్ని సూచిస్తుంది. మైసేనియన్ కాలానికి వెళ్తే.. మిట్టానీల (సాంస్కృతిక సమాజం)తో గ్రీకులకు బలమైన సంబంధం ఉన్న కాలమది. హిటైట్లు, మిట్టానీల నుంచి జ్ఞాన ప్రసారం జరిగిన సమయమది.

భారతదేశం నుంచి గ్రీసు, రోమన్లు కాకుండా యూరప్ వైపు సాగిన విజ్ఞాన ప్రసారానికి సంబంధించి నేను మరో విషయాన్ని కూడా ఇక్కడ పంచుకోదలచుకొన్నాను. క్రీస్తుకు పూర్వం 460-370 మధ్య కాలంలో డెమొక్రటీస్.. అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆటమ్ అన్న మాటను పేర్కొన్నాడు. గ్రీకు పదం ఆటోమస్ నుంచి ఆటమ్ అన్న పేరును ఖాయం చేశాడు. కానీ డెమొక్రాటిస్‌కు దాదాపు రెండు శతాబ్దాలకు ముందు క్రీస్తుకు పూర్వం 600 బీసీలో భారతీయ శాస్త్రవేత్త కణాదుడు ప్రతి పదార్థము కూడా సూక్ష్మ, సూక్ష్మాతి సూక్ష్మమైన కణాల కలయికతో ఏర్పడినదేనని ప్రతిపాదించాడు. తన వైశేషిక తత్త్వ చింతన ద్వారా కణాదుడు ఈ భౌతిక శాస్త్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మధ్యప్రదేశ్ రాష్ర్టంలోని అలహాబాద్ జిల్లా ప్రభాస గ్రామంలో జన్మించిన కణాదుడు చిన్నతనాన బియ్యం గింజలను ఏరుకొని తినేవాడట. చిన్న చిన్న రేణువుల మీద పరిశోధనకు అది ఆలోచనాత్మకమైంది. కార్యకారణ సంబంధ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించింది ఈయనే. పది గ్రంథాల సంపుటంగా వైశేషిక సూత్రాలను ఆయన ప్రతిపాదించాడు. విశ్వంలో అణువు అన్నది ఒకటి ఉంటుందని మొట్టమొదట ప్రతిపాదించింది కణాదుడే. ఆత్మ అన్నది అన్ని పదార్థాలలో విస్తరించిందని పేర్కొన్నాడు. అనుభవం, పదార్థం, నాణ్యత, కార్యాచరణత, సాధారణత, ప్రత్యేకత, స్వాభావికతతోపాటు శూన్యంలోనూ ఆత్మ ఉన్నదన్నాడు. భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి విద్య, అవిద్య మౌలిక లక్షణాలను అర్థం చేసుకోవాలని చెప్పాడు. అవిద్య కూడా విద్యేనని ఆయన పేర్కొన్నాడు. ఆధునిక భౌతికశాస్త్ర పితామహుడని పిలువబడే డెమొక్రాటిస్ ఇథియోపియా, ఆసియా, భారతదేశాల్లో పర్యటించి.. అనేక పరిశోధనల అనంతరం తన అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వేదాంత జ్ఞానాన్ని లోతుగా అధ్యయనం చేసి సహజ తత్త్వశాస్త్రం గురించి రాశాడు. భూమి ఒక గోళమని.. అణువులతో తయారైన విశ్వం పెద్ద ప్రపంచాన్ని తయారుచేస్తుందని, సృష్టి అంతా క్షీణించిన అణువులతో తయారైందని.. ఇలా వేదాంతజ్ఞానాన్ని డెమొక్రటీస్ తనపరిశోధనల్లో అంతర్లీనంగా పొందుపరిచాడు. (చూ. రామం భజే శ్యామలం)

పర్షియా, మెసెపొటొమియా లోని ఖగోళశాస్త్రాలను అనువాదం చేసే పనిని అరిస్టాటిల్‌కు అలెగ్జాండర్ అప్పగించాడు. అలెగ్జాండర్ పట్టుకుపోయిన ఈ గ్రంథాలు, అనువదింపబడిన గ్రంథాలు.. అలెగ్జాండ్రియా లైబ్రరీలో ఉంచారు. ఇండిక్ నాలెడ్జిని పశ్చిమ దేశాలకు అందించడానికి ఏర్పాటుచేసిన లైబ్రరీ ఇది. ఈ నాలెడ్జి హిపార్కస్‌కు అధ్యయనం చేయడానికి ఉపయోగపడింది. ఇదే కోవలో మన వాళ్లు ప్రతిపాదించిన మరి కొన్ని అంశాలను చూద్దాం.

సూర్య సిద్ధాంతంలో స్పష్టంగా వివరంగా కార్డ్ టేబుల్ ప్రతిపాదన ఉన్నది. త్రికోణమితి (Trigonometry) కి సంబంధించిన ప్రాథమిక అంశాలు ఉన్నాయి. ఇందులో పేర్కొన్న ‘జ్య’ (Jyā) విలువల ఆధారంగానే తర్వాతి కాలంలో కార్డ్ టేబుల్స్ అభివృద్ధి చెందాయి. (Surya Siddhanta – Britannica)

ఆర్యభట్ట 3.5 సెగ్మెంట్స్‌లో ‘జియా, కొజియా’ పేరుతో సైన్ టేబుల్‌ను ప్రతిపాదించాడు. ఇదే తరువాతికాలంలో సైన్, కోసైన్ అయ్యాయి. ఆర్యభట్ట తన ‘ఆర్యభటీయం’లో 3.75 డిగ్రీల అంతరంతో సైన్ (Jyā) విలువల పట్టికను ఇచ్చారు. భారతీయ గణితంలోని ‘జ్య’ అనే పదం అరబిక్ ద్వారా ‘జిబ్’ (Jib) గా, ఆపై లాటిన్ లో ‘సైన్’ (Sinus) గా రూపాంతరం చెందింది. (Aryabhata’s Sine Table)

పింగళుడు (400 బీసీ) తన ఛందశ్శాస్త్రంలో కాంబినోట్రానిక్స్, బైనామిల్స్ గురించి చర్చించాడు. ‘ఛందశ్శాస్త్రం’లో మాత్రా మేరువు (Pascal’s Triangle) మరియు ద్విపద గుణకాల (Binomial coefficients) గురించి వివరించారు. శూన్యాన్ని గణితంలో ఉపయోగించిన తొలి ఆధారాలు కూడా ఇక్కడే కనిపిస్తాయి. (Pingala and Combinatorics)

వృద్ధగర్గ (500 బీసీ) ఈక్వినాక్స్ గురించి ప్రతిపాదించాడు. 1డిగ్రీని వంద ఏండ్లుగా భావించి ఈక్వినాక్స్ రేట్ ను 36 వేల సంవత్సరాలుగా ప్రతిపాదించాడు. వృద్ధ గర్గ సంహిత వంటి గ్రంథాలలో ఖగోళ శాస్త్ర విషయాలు, గ్రహ గతులు మరియు అయనాంతాల (Precession of Equinoxes) గురించి చర్చించబడింది. 1 డిగ్రీ మార్పుకు 100 సంవత్సరాల కాలాన్ని లెక్కించడం భారతీయ ఖగోళ శాస్త్ర సంప్రదాయంలో కనిపిస్తుంది.

జైనులు, సంస్కృత, వేదాంత స్కాలర్ల ద్వారా అపారమైన విజ్ఞానం అరిస్టాటిల్, అలెగ్జాండ్రియా లైబ్రరీ ద్వారా బదిలీ అయింది. దీన్ని గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త హిపార్కస్ (Hipparchus) అందుకున్నాడు. అతను 190 బీసీ నాటి వాడు. ఇతను కూడా 7.5 సెగ్మెంట్స్‌లో కార్డ్ టేబుల్‌ను ప్రతిపాదించాడు. ఇతను కూడా వృద్ధగర్గ ప్రతిపాదించిన ఇక్వినాక్స్ రేట్‌ను యథాతథంగా ప్రతిపాదించాడు. ఇతని సిద్ధాంతాలకు, భారతీయ గణిత/ఖగోళ శాస్త్రాలకు మధ్య పోలికలు ఉన్నాయి. అలెగ్జాండ్రియా లైబ్రరీ ద్వారా భారతీయ జ్ఞానం గ్రీకులకు చేరిందనే వాదనకు బలమైన చారిత్రక సంకేతాలు ఉన్నాయి. హిపార్కస్ సైన్ పట్టికల నిర్మాణం మరియు కాంబినేట్రిక్స్‌లో పింగళుడి ప్రభావం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

టాలెమీ అన్నది.. ఆర్యభట్ట పరిశోధనలకు మరో ప్రధాన వనరు. రాబర్ట్‌ న్యూటన్ రాసిన ది ఆరిజిన్స్ ఆఫ్ టాలెమీలో ఇందులోని ప్రతి అంశం కూడా వక్రీకరణ జరిగిందని పేర్కొన్నాడు. ఇందులోని ట్రిగొనామెట్రీ ప్రతిపాదనలన్నీ కూడా ఈజిప్టులోని ఎరాతోథెన్స్ అనేవాడు ప్రతిపాదించినవని న్యూటన్ అన్నాడు. నిజమే.. ఈ ఎరాటోస్థీన్స్ అనేవాడు.. అలెగ్జాండ్రియా లైబ్రరీలో లైబ్రేరియన్‌గా పనిచేశాడు. ఇతనికి చాలా ఖాళీ సమయం దొరకడంతో భారతదేశం నుంచి అక్కడికి వచ్చిన మాన్యుస్క్రిప్టులు అన్నీ చదవడానికి సమయం దొరికింది. వీటి ద్వారానే భూమి ఎంత కోణంలో భ్రమణం తిరుగుతుంది.. భూమికి, సూర్యుడికి ఉన్న దూరం.. భూమి చుట్టుకొలత, సూర్యుడి చుట్టుకొలత వంటివన్నీ ఈ లైబ్రేరియన్ కనుక్కొన్నాడు. ఇవే అంశాలను యాజ్ఞవల్క్యుడు 3000 బీసీలోనే కనుక్కొని రాశాడు కూడా. యాజ్ఞవల్క్యుడి మాన్యుస్క్రిప్టు కూడా ఈ లైబ్రరీలో ఉన్నది. దీన్నిబట్టి పాశ్చాత్యుల ‘కనుగొనడాల’ వెనుక ఏం జరిగిందో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ఈ లైబ్రరీ.. తూర్పు నుంచి పశ్చిమానికి నాలెడ్జి టాన్స్రిమిషన్‌కు ప్రధాన మార్గంగా పనిచేసింది. ఇలా చెప్పుకుంటూపోతే.. 1000 సీఈ నుంచి 1700 సీఈ మధ్య కాలంలో గణితం, మెడిసిన్, ఖగోళశాస్త్రం, కెమిస్ట్రీ, టాక్సికాలజీ, మతం, కళలకు సంబంధించిన విజ్ఞానమంతా ఇతర దేశాలకు అనువాదాల ద్వారా పెద్ద ఎత్తున బదిలీ అయింది. ముఖ్యంగా గ్రీకు, రోమన్లతో ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడింది.

క్రీస్తు పూర్వం 4 వ శతాబ్దంలో అలెగ్జాండర్ భారతదేశ యాత్రతో గ్రీకు చరిత్రకారులకు భారతీయత తాత్త్విక చింతనతో ప్రత్యక్ష అనుభవం కలిగింది. ఓనెసిరిటస్ (Onesicritus), కాలిస్తెనిస్, నియార్కస్ లు భారత యాత్రా చరిత్రలు రాశారు. భారత్ లోని రుషుల వర్ణనలు చేశారు.

స్ట్రాబో, ఆరియన్, ప్లినీ వంటి గ్రీకు ఫిలాసఫర్లు భారత సన్యాసులను జిమ్నోసోఫిస్ట్లులు అని పిలిచేవారు. భారత యోగుల దగ్గర అసాధారణ మానసిక శక్తి, ఇంద్రియాలను త్యజించే లక్షణం, ఆత్మ జ్ఞానాన్వేషణ అనే అద్భుత లక్షణాలున్నాయని స్ట్రాబో రాశాడు. “They despise death, endure pain willingly, live naked or half-clad, and consider freedom from desire as the highest good.” (Strabo, Geography, XV.1.59–60) భారత దేశానికి చెందిన ఒక ఋషి అలెగ్జాండర్ ను చూసి.. “నువ్వు కాలాతీత సత్యాన్ని కనుక్కోవచ్చు కానీ, ప్రపంచాన్ని జయించలేవు అని అన్నాడని” స్ట్రాబో ఒక చోట కోట్ చేశాడు. “Alexander questioned them on life, death, and the nature of the universe, and their answers were marked by contempt for worldly power.” (Strabo, XV.1.63)

అలెగ్జాండర్ తో పాటు భారత్ కు వచ్చిన అతని నౌకాదళ అధిపతి ఓకెసిరిటస్ (Onesicritus) భారత యోగులతో మాట్లాడిన మాటలను రికార్డు చేశాడు. “The naked philosophers of India told Alexander that possession and conquest only burden the soul, and that freedom is attained by renunciation.” (Arrian, Anabasis of Alexander, Book VII.1–3)

అలెగ్జాండర్ తన వెంట తన గురించి రాయడానికి తెచ్చుకున్న చరిత్రకారుల్లో ఒకడు కాలిస్తెనిస్ (Callisthenes) హిస్టరీ ఆఫ్ అలెగ్జాండర్, హెల్లెనికా వంటి గ్రంథాలు రాశారు. ఈ రెండు కూడా మిషనరీల కారణంగా నష్టమయ్యాయి. అయితే స్ట్రాబో, డియోడరస్, ప్లుటార్క్ వంటి వారు ఈయన రాసిన గ్రంథంలోనుంచి కోట్ చేశారు. భారత ఫిలాసఫీని గ్రీకు ప్రపంచానికి మొదట పరిచయం చేసిన వాడు కాలిస్టెనిస్ అని వారు కొనియాడారు. సీ వొయేజ్ అకౌంట్ అన్న గ్రంథాన్ని రాసిన నియార్కస్ (Nearchus) భారత దేశ తీర ప్రాంతాలు, వాణిజ్యం, ప్రజల జీవన శైలి, ఆహారం, తపస్సు వంటి వాటి గురించి విస్తృతంగా రాశాడు.

మరో గ్రీకు రచయిత ప్లూటార్క్.. తాను రాసిన ‘లైఫ్ ఆఫ్ అలెగ్జాండర్’లో భారత రుషుల గురించి ఏం రాశాడో చదవండి.. “Alexander admired the wisdom of the Indian philosophers, who taught that nothing which is mortal is worthy of fear or desire.” (Plutarch, life of Alexander, p.64).

ఇంకో రచయిత డియోడరస్ సిక్యులస్ బిబ్లియోథెకా హిస్టారికా రెండో వాల్యూమ్ లో “The Indian sages laughed at those who sought to rule others before mastering themselves.” (Diodorus, Bibliotheca Historica, Book II.p.40)

గ్రీకు, భారత్ ఫిలాసఫీల మధ్య సారూప్యతలను మనం కింది విధంగా గమనించవచ్చు.

గ్రీకు తత్త్వం భారత తత్త్వం
Stoicism Yoga, Samkhya
Platonism Vedanta
Pythagoreanism Upanishadic Numerology
Skepticism Ajivika, Buddhist Madhyamika
Cynicism Digambara asceticism

ఇలా భాషలు, పురాణాలు, ఖగోళ, వైద్య, గణిత శాస్త్రాల సమాచారం పరస్పర మార్పిడి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. బౌద్ధ, గాంధార విగ్రహాలలో గ్రీకు, డ్రేపరీ, గ్రీకు మానవ ఆకృతుల ప్రభావం కనిపిస్తుంది. బౌద్ధ చిహ్నాలతో పాటు గ్రీకు దేవతలు కూడా కనిపిస్తారు. అంతెందుకు 12వ శతాబ్దంలో నిర్మించిన తెలంగాణలోని వరంగల్‌లో కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయంలో ఈజిప్ట్ మనుషుల విగ్రహాలు కనిపిస్తాయి. అంటే ఎక్కడో దక్షిణాన ఉన్న తెలంగాణ ప్రాంతంతో కూడా గ్రీకులు, రోమన్లు రాకపోకలు సాగించారని తేలుతుంది. దీంతో పాటుగా వాణిజ్య సంబంధాలు కూడా గ్రీకు, రోమ్, భారత్ ల మధ్యన క్రీస్తుకు పూర్వం నుంచే అద్భుతంగా సాగుతూ వచ్చాయి. భారత్ నుంచి మసాలాలు, బట్టలు, రత్నాలు, లోహాలు, చేపలు, ఉక్కు.. గ్రీకు, రోమన్ మార్కెట్లలో ముఖ్యమైన వస్తువులుగా మారాయి. రోమ్ నుంచి బంగారం, వెండి, వైన్, సీసం, గాజు, చిత్రాలు భారత్‌కు వచ్చాయి. భారత్, పర్షియా, గ్రీసు దేశాల మధ్యన పరస్పర వాణిజ్యం జోరుగా సాగింది. అందుకు ఉదాహరణగా భారత్లో అనేక ప్రాంతాల్లో గ్రీకు నాణేలు లభించాయి. గ్రీసు వ్యాపారులు భారత సుగంధ ద్రవ్యాలను ఇంపోర్ట్ చేసుకున్నారు. భారత్ రోమ్ మధ్యన సముద్ర వాణిజ్య నిర్మాణం ఎంత వ్యవస్థీకృతంగా సాగిందో 1920లో కనుగొన్న ముజిరిస్ పాపిరస్ డాక్యుమెంట్ చెప్తుంది.

your other administrators or managers, and on agreement(?) [I will give (?)] to your (?) camel-driver . .. (?) for the extra charges [of the journey up] to Koptos; and I will convey the goods through the desert under guard and protection [up to the] public tax-receiving warehouses at Koptos, and [I will] place them under the [authority] and seal of yourself, or of your administrators or whichever one of them is present, until their loading at the river; and I will load them [at the] required time onto a safe ship on the river; and I will convey them down to the warehouse for receiving the quarter-tax [at] Alexandria, and [likewise] will place them under the authority and seal of yourself or your men. For (?) all the payments [for the ship (?)] from now to collection of the quarter-tax, and of (?) the desert transport and the carrying-charges of the river-workers and the other incidental (?) expenses . . . on occurrence of the date for repayment specified in the contracts of loan for the trip to Muziris, if I do not [then] duly discharge the aforesaid loan in my name, that then [you] and your administrators or managers are to have the option and complete authority, if you so choose, to carry out execution without [notification] or summons to judgement, to possess and own the afore[said] security and pay the quarter-tax, to convey the [three] parts which will be left where you choose and to sell or use them as security [and] to transfer them to another person, if you so choose, and to deal with the items of the security in whatsoever way you choose, and to buy them for yourself at the price current at the time, and to subtract and reckon in what falls due [on account of the aforesaid loan, on terms that the responsibility for what falls due [lies] with you and your administrators or managers and we are free from accusation in every respect, and that the surplus or shortfall from the capital [goes] to me the borrower and giver of security . . .

{Verso}

Gangetic nard: 60 boxes, of which likewise the price is reckoned with the box at 4,500 drachmas of silver, 45 talents. Ivory: first {A}, sound: 78 talents-weight 54 ¾ minas, of which likewise the price is reckoned, first {A1}, 78 talents-weight 4[3] minas which become by the standards of the quarter-tax, the talent being reckoned at 95 pounds, total 7,478 pounds, from which the equivalent is, reckoning 97 ½ pounds to the talent on the ratio which is normally reckoned among merchants, 76 talents-weight 45 minas, with the mina at 100 drachmas, total 76 talents 4,500 drachmas.

Then {A2}, the remaining tusks, taken at the higher weight by the arabarchs for the collection of the quarter-tax in the sum of tusks despite the equivalence when undergoing collection of the quarter-tax, 11 ¾ minas with the mina at the same 100 drachmas, 1,175 drachmas [of silver] Makes total 76 talents 5,675 drachmas. Then {B}, fragments: 13 talents-weight 9 ¾ minas, of which likewise the price is reckoned, first {B1}, 12 talents-weight 4[7] minas which, as explained above, become in turn (?) by the standards of the quarter-tax 1,214 pounds, and, according to how among the merchants it is reckoned, are 12 talents-weight 27 minas, with the mina at 70 drachmas, 8 talents 4,290 drachmas of silver. Then {B2}, the remaining fragments, taken at the higher weight for collection of the quarter-tax as explained above, 22 ¾ minas, with the mina at the same 70 drachmas, 1,592 ½ dr, of silver. Total for fragments: 8 talents 5,882 ½ drachmas. Total price of ivory: [85 talents cargoes 5,557 ½ drachmas] of silver. Makes the price of the 3 parts of the cargoes shipped out in the ship ‘Hermapollon’ 1,154 talents 2,852 drachmas of silver. (This document is of great importance for our understanding of trade between the Roman Empire of India. The translation is by D. Rathbone, “The Muziris papyrus (SB XVIII.13167): financing Roman trade with India”, in BSAA 46 (2000), pp.39–50. A shorter discussion of the contents of the papyrus, by the same author, is available online (Oxford Research Encyclopedias )).

ఒక వ్యాపారి, ఒక ఫైనాన్షియర్ ల మధ్య జరిగిన ఒప్పందం ఇది. ఎంత పకడ్బందీగా ఆనాడు వ్యాపార లావాదేవీలు సాగాయో ఈ డాక్యుమెంట్ చెప్తుంది. ఈ డాక్యుమెంట్‌ను 1980లో ఆస్ట్రియన్ నేషనల్ లైబ్రరీ కొనుగోలు చేసి 1985లో ప్రచురించింది. రోమ్ నుంచి దాదాపు 50 మిలియన్ల సెస్టెరిషియస్ (sestertius) బంగారాన్ని అంటే ఇవాల్టి లెక్కలో 100 మిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని భారత్‌కు ఎగుమతి చేసేది. ప్లిని ది ఎల్డర్ (pliny the elder) ఈ వివరాలను తన నేచురల్ హిస్టరీ గ్రంథంలో రికార్డ్ చేశారు. ప్రపంచంలో మొదటి ఎన్‌సైక్లోపీడియాగా దీన్ని అభివర్ణిస్తారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక విషయాలను చెప్పవచ్చు. గ్రీకు రోమన్ ప్రాంతాలు భారతదేశానికి భౌగోళికంగా చాలా దూరంగానే ఉన్నప్పటికీ సాంస్కృతికంగా, తాత్త్వికంగా, వాణిజ్యపరంగా ఈ మూడు నాగరికతలను మహా ప్రపంచాలుగా చెప్పవచ్చు. ఈ నాగరికతలు వేటికవే స్వతంత్రంగా విలసిల్లినప్పటికీ వీటి మధ్యన సమానతలు అనేకం మనకు కనిపిస్తాయి.

(ఇంకా ఉంది)

Exit mobile version