[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
చాప్టర్ 25.
ఈజిప్టులోని అలెగ్జాండ్రియా గురించి ఎందుకు ఇంత వివరంగా చెప్పవలసి వస్తున్నదంటే.. ప్రపంచ చరిత్ర, నాగరికత, సంస్కృతి అంతా దీనితో ముడిపడి ఉన్నది. ఇవాళ ప్రపంచంలో కనిపెట్టేదేదైనా, కనిపెట్టేదెవరైనా సరే.. అంతా క్రైస్తవులేనని చెప్పుకుంటుంటారు. ఇది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది. దానికి జవాబు ఇదిగో అలెగ్జాండ్రియా.. ఇస్లాం, క్రైస్తవాలు పుట్టడానికి ఎంతో ముందు నుంచే ఎన్నెన్నో అత్యద్భుత ఆవిష్కరణలు జరిగాయి. ఎన్నో వినూత్న ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. పరిశోధనలు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా మేధస్సు, విజ్ఞానం యావత్ప్రపంచాన్నంతా చుట్టి ప్రయాణించింది. సూర్య కాంతిలాగా యావత్ప్రపంచంపై ప్రసరించింది. ముఖ్యంగా భారతీయ శాస్త్రీయ విజ్ఞానం, మేధస్సును గ్రీకులు అందిపుచ్చుకున్నారు. గ్రీకుల విజ్ఞానం మన వైపు ప్రసరించింది. ఇందుకు ఒక కేంద్రంగా అలెగ్జాండ్రియా వర్ధిల్లింది. అలాంటి అలెగ్జాండ్రియాను ఒక ఛాందస సమాజం, తెలివిలేని గుంపు.. మతం పేరుతో మంటల్లో తగులబెట్టింది. కేవలం ఆ పరిశోధనా సంస్థనే కాదు.. అందులోని మేధావులను కూడా పాశవికంగా, కిరాతకంగా చంపేసింది. ఇందుకు ఉదాహరణ.. ఆనాటి గొప్ప మహిళా గణిత శాస్త్రవేత్త హైపాటియా క్రూర హత్య.
అలెగ్జాండ్రియా నుంచి వెలుగు చూసిన గొప్ప మేధావులలో, శాస్త్రవేత్తల్లో హైపాటియా (Hypatia) ఒకరు. గణితం, అస్ట్రానమీలో ఆమె పరిశోధనలు అపూర్వమైనవి. అంతే కాదు. హైపాటియా ఫిలాసఫర్ కూడా. నియో ప్లాటోనిక్ ఫిలాసఫీని ఆమె బోధించేవారు. ప్రస్తుత శకం 350-370 ల మధ్య కాలంలో అలెగ్జాండ్రియాలోనే జన్మించారు. ఆమె తండ్రి థియోన్ అలెగ్జాండ్రియా గ్రంథాలయంలోనే ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్తగా ఉండేవారు. అలెగ్జాండ్రియా అన్నది కేవలం గ్రంథాలయమో, పరిశోధన సంస్థగానే కాకుండా ఈనాటి విశ్వవిద్యాలయం మాదిరిగా కూడా ఒక విద్యాకేంద్రంగా విలసిల్లింది. ఈ విద్యాలయానికి అధిపతిగా గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా కూడా ఆయన పనిచేశారు.
“Theon was a member of the Museum of Alexandria and a prolific writer on mathematics and astronomy… He is best known for his edition of Euclid’s Elements, which became the standard text for centuries.” – Maria Dzielska, Hypatia of Alexandria, Page 67.,, and Edward Gibbon, The History of the Decline and Fall of the Roman Empire, Chapter XLVII.
థియోన్ కేవలం ప్రొఫెసర్గా మాత్రమే కాకుండా గ్రంథాలయంలోని పాత శాస్త్రీయ గ్రంథాలను పరిష్కరించే పని కూడా చేశారు. ముందరి వ్యాసాల్లో మనం ప్రస్తావించుకున్న యూక్లిడ్ ఎలిమెంట్స్ గ్రంథాన్ని థియోన్ ఎడిట్ చేశారు. ఇవాళ్టికీ మనకు అందుబాటులో ఉన్న రేఖాగణిత సూత్రాలు థియోన్ పరిష్కరించినవే. అంతే కాదు ప్రసిద్ధ శాస్త్రవేత్త టొలోమీ అల్మగెస్ట్ (Ptolemy’s Almagest) ఖగోళ శాస్త్ర సంబంధిత గ్రంథానికి విస్తృతమైన వ్యాఖ్యానం రాశారు. ఈయన కూతురే హైపాటియా. కూతురుకు తండ్రి, గురువు కూడా థియోనే. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు కూడా హైపాటియా అలెగ్జాండ్రియాలోనే చదువుకుంది. తండ్రి బాటలోనే తండ్రే గురువుగా గణిత శాస్త్ర మెళుకువలను నేర్చుకున్నది. అక్కడితో ఆగకుండా ఖగోళశాస్త్రం (ఆస్ట్రానమీ), ఫిలాసఫీ ల మీద కూడా విస్తృతమైన పరిశోధనలు చేసింది. తరువాత నియో ప్లేటోనిజం పై తత్త్వ శాస్త్ర పాఠాలను బోధించింది. ప్రసిద్ధ తత్త్వవేత్త ప్లేటో తాత్త్విక చింతనను వినూత్న ప్రతిపాదనలతో హైపాటియా బోధించారు.
“She used to put on her philosopher’s cloak and walk through the middle of the city and explain publicly the writings of Plato, or Aristotle, or any other philosopher to all who wished to hear… There was a great crowd around the doors [of her house], a confusion of men and horses, some coming, some going, and others standing about.” (Hypatia of Alexandria by Maria Dzielska, Page 122.)
తండ్రిని మించిన కూతురుగా హైపాటియాను ఆమె సమకాలికుడు సోక్రటీస్ స్కోలాస్టికస్ తన ఎక్లేసియాస్టికల్ హిస్టరీలో ప్రశంసించాడు. హైపాటియా ఎంత గొప్ప ఫిలాసఫరో.. అంత గొప్ప గణిత శాస్త్రవేత్త. డయోపాంటస్ అరిథ్ మెటికా (Diophantus’ Arithmetica) గ్రంథానికి హైపాటియా 13 సంపుటాల సుదీర్ఘమైన విస్తృతమైన వ్యాఖ్యానాన్ని రాశారు. ఆల్జీబ్రాలోని ఇన్డిటెర్మినేట్ ఈక్వేషన్లను సమర్థంగా పరిష్కరించారు.
“The commentary of Hypatia on the Arithmetica of Diophantus is unfortunately lost, but there is reason to believe that she contributed to the preservation of the text and possibly added some of the problems and solutions found in the later manuscripts. Her work was not merely copying but a critical analysis of algebraic problems.” (A history of Greek mathematics, sir Thomas heath, vol 2, p. 448)
అపోలోనియస్ కోనిక్స్కు సంబంధించి conic sections, ellipse, parabola, hyperbola పై హైపాటియా ప్రపంచానికి ఎంతో ఉపయోగపడే పరిశోధనలు చేశారు. “Hypatia dealt with the hardest part of the mathematics of her time. In her commentary on the Conics of Apollonius, she simplified the geometric proofs, making the difficult theories of curves accessible to her students. Hypatia’s most important achievement in astronomy was her commentary on the Astronomical Canon… She also authored a commentary on Diophantus’s Arithmetica and on Apollonius of Perga’s Conics. These works demonstrate that she was the most eminent mathematician and astronomer of her time” (Hypatia of Alexandria by Maria Dzielska. P.72).
భారతదేశంలో ఖగోళం, గణితం, సంఖ్యాశాస్త్రం, వైద్యం వంటి రంగాలు స్వర్ణయుగంలో ఉన్న కాలంలో హైపాటియా (350-415) జీవించి ఉన్నారు. రోమ్తో వర్తక వాణిజ్యాలు విస్తృతంగా కొనసాగుతున్న కాలంలో భారతీయ మేధస్సు కూడా అలెగ్జాండ్రియాకు పయనించింది. అంతకుముందే.. యూక్లిడ్, ఎరటోస్తనిస్ వంటి మహానుభావులు భారతీయ విద్యను అధ్యయనం చేయడమే కాకుండా స్వీయ పరిశోధనలతో అద్భుత ఆవిష్కరణలు చేశారు. అదే పరంపరలో హైపాటియా కూడా భారతీయ గ్రంథాలను అధ్యయనం చేశారు. హైపాటియా, ఆమె తండ్రి థియోన్ ప్రతిపాదించిన, పరిష్కరించిన అంశాలు చాలా వరకు ఆర్యభట్టు, బ్రహ్మగుప్తుడి పరిశోధనలతో దాదాపు పోలి కనిపిస్తాయి. హైపాటియా వ్యాఖ్యానించిన డాయోఫాంటస్ సమీకరణాలను అంతకంటే లోతుగా భారతీయులు పరిష్కరించారు. కుట్టక పద్ధతిలో భారతీయులు బీజగణితంలోని సమీకరణాలకు పరిష్కారాన్ని చూపారు. ట్రిగొనామెట్రికీ సింబంధించి టోలెమీ కార్డ్స్ (chords) పట్టికలపై హైపాటియా పనిచేశారు. భారతీయులు సైన్ పట్టికలను ఇదే కాలంలో అభివృద్ధి చేశారు.
హైపాటియా ఖగోళ నక్షత్రాలో గతి స్థితులను లెక్కించేందుకు ఆస్ట్రోలేట్ పరికరాన్ని తయారు చేశారు. దీన్ని మన ఖగోళ శాస్త్ర పరిభాషలో ‘యంత్ర రాజ’ గా పిలుస్తారు. ద్రవాల సాంద్రతను కొలిచేందుకు హైడ్రోమీటర్ను కూడా ఆమె ఆవిష్కరించారు. దురదృష్టవశాత్తూ ఆమె రాసిన రచనలన్నీ కూడా అలెగ్జాండ్రియా లైబ్రరీ విధ్వంసంలో కాలి బూడిదైపోయాయి. చరిత్రకారులు, ఆమె శిష్యులు రాసిన రచనల ద్వారా ఆమె పరిశోధనలు తిరిగి వెలుగులోకి వచ్చాయి. “To the philosopher [Hypatia].. You have always been a mother, a sister, a teacher, and a benefactor to me, and everything that can be expressed in an honored name.” (The Letters of Synesius of Cyrene, translated by Augustine FitzGerald (1926), Page 233.). హైపాటియా తన శిష్యులకు ఒక తల్లిగా, సోదరిగా, టీచర్ గా కనిపించేదని ఆమె శిష్యుడు సైనీసియస్ సిరేన్ (Synesius of Cyrene) పేర్కొన్న తీరును చూస్తేనే ఆమె ఎంత మేధావో.. ఎంత ఉదారశీలియో, ఎంత ప్రేమగలిగిన మనిషో అర్థమవుతుంది. కేవలం రోమ్ నుంచి మాత్రమే కాకుండా ఆమె బోధనలను వినడానికి ఐరోపా ఆసియా ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు అలెగ్జాండ్రియాకు రప్పించుకున్న అత్యంత ప్రతిభావంతురాలు హైపాటియా.
ఇంతటి మేధావి.. అలెగ్జాండ్రియాలో మత ఉన్మాదం పెచ్చరిల్లిన సమయంలో జన్మించడం ప్రపంచం చేసుకున్న దురదృష్టం. క్రైస్తవంలో కానీ, ఇస్లాంలో కానీ ఆలోచించే స్వేచ్ఛ నిషేధం. ఆ రెండు పుస్తకాల్లో ఏం చెప్పారో, ఏం రాసి ఉన్నదో అదే శిరోధార్యం. దాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. భారతదేశంలో మాత్రమే, భారతీయ ధర్మంలో మాత్రమే ఎందుకు అన్న ప్రశ్నతో శోధన అన్నది మొదలవుతుంది. ఈ శోధన నిన్ను నువ్వు తెలుసుకోవడంతో ప్రారంభమై, అనంత చైతన్యానికి కారణమైన బ్రహ్మం అంటే ప్లేటో చెప్పిన ‘ది వన్’ అన్న చైతన్యాన్ని శోధించి తెలుసుకోవడం దాకా సాగుతుంది. ఇది మన ధర్మంలో మాత్రమే ఉన్న చైతన్య స్రవంతి. ఇస్లాం క్రైస్తవాలకు ముందు గ్రీకు, మాయా నాగరికతలు కూడా ఈ ప్రవాహంలోనే ముందుకు సాగాయి. చర్చి కాలు మోపడంతోనే సమస్త చైతన్యం మసకబారింది. హైపాటియా వంటి అద్భుతమైన మేధావులు అన్యాయంగా కాలగర్భంలో కలిసిపోయారు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్న సిద్ధాంతాన్ని బలంగా చెప్పిన పాపానికి గెలీలియోకు జీవితకాల గృహ నిర్బంధ శిక్షను చర్చి విధించింది. విశ్వం అనంతం, విశ్వంలో అనేక ప్రపంచాలు ఉన్నాయి అన్నటువంటి సిద్ధాంతాలను చర్చి ఏనాడూ అంగీకరించలేదు. ఇందుకోసం జియార్డొనో బ్రూనోను 1600 లో చంపేశారు. అంటే.. రెండుమూడు వందల ఏండ్ల క్రితం వరకు కూడా చర్చి తన మూఢ విశ్వాసంలోనే బతికింది. తన ప్రజలను కూడా అదే విశ్వాసంలో నడిపించింది. అలాంటిది క్రీస్తు శకం 350- 415 మధ్యన చర్చి ఏ స్థాయి మూఢత్వం ప్రదర్శించిందో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు.
హైపాటియా విషయంలో కూడా జరిగింది అదే. ఆమె బోధిస్తున్న నియోప్లాటనిజం, అరిస్టాటిల్ ఫిలాసఫీ లను చర్చి మత విశ్వాసాలకు విరుద్ధంగా భావించింది. హైపాటియా క్రైస్తవానికి సంబంధించిన వ్యక్తి కాదు. చర్చి ఫాగన్ మతాలుగా ముద్రవేసిన క్రైస్తవేతర మహిళ. ఆమె గ్రీకు తత్వానికి సంబంధించిన మహిళ. పైగా ఆమె విశ్వాన్ని తర్కం (లాజిక్) తో అర్థం చేసుకోవాలని చెప్పటం.. భక్తి మార్గాన్ని బుద్ధి ద్వారా అనుసరించాలని చెప్పటం, సైన్స్నో బోధించడం.. ఇవన్నీ ఆమెను, ఆమె ప్రవర్తనను అనుమానాస్పదం చేశాయి. క్రైస్తవులు ఆమెను ఒక మంత్రగత్తెగా ప్రచారం చేశారు. దీనికి తోడు రాజకీయంగా కూడా ఆమె అధికార కేంద్రంలో తీవ్రమైన ప్రభావం చూపించింది. సోక్రటీస్ స్కాలస్టికస్.. అలెగ్జాండ్రియాలో జరిగిన మత ఉన్మాదాన్ని తన Ecclesiastical History, Book VII లో చాలా వివరంగా రచించారు. ఈయన హైపాటియాకు సమకాలికుడు. అయిదో శతాబ్దం ప్రారంభంలో రోమన్ సామ్రాజ్యానికి గవర్నర్ గా ఒరెస్టిస్ వచ్చాడు. ఇతను క్రైస్తవ మతస్తుడు కాదు. రోమన్ రాజ్యాధికారాన్ని నిలబెట్టడం కోసం పనిచేశాడు. అయితే.. అలెగ్జాండ్రియాలో బిషప్ గా సిరిల్ ఉన్నాడు. ఇతను అలెగ్జాండ్రియాలో క్రైస్తవ మతాన్ని అత్యంత శక్తిమంతంగా అమలు చేస్తూ వచ్చాడు. తమ మతానికి సంబంధం లేని ఏ ఒక్క అస్తిత్వాన్ని కూడా మనుగడ లేకుండా నాశనం చేయాలన్నది అతని ప్రధాన లక్షణంగా ఉంటూ వచ్చింది. చర్చి అధికారాన్ని బలపరచడం లక్ష్యంగా సిరిల్ పని చేశాడు. ఈ రకమైన వైరుధ్యాలు ఓరెస్టిస్, సిరిల్ల మధ్యన తీవ్రమైన రాజకీయ ఘర్షణలకు వేదిక అయింది. ఇద్దరూ రెండు పవర్ సెంటర్ లుగా ఎదిగారు. రెండు అధికార కేంద్రాల మధ్యన విభేదం అత్యంత తీవ్రమైనప్పుడు ఒక రాజ్యం ఎంత కల్లోలంగా ఉంటుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఓరెస్టిస్ తన అధికార పరిధిలో చర్చి చొరబాటు ప్రయత్నాన్ని పడనివ్వలేదు. మతాధికారం కోసం సిరిల్ ఓరెస్టిస్ పై తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించాడు. ఇది చిలికి చిలికి గాలివానగా మారింది. వ్యక్తిగత శత్రుత్వం ప్రబలిపోయింది. అలెగ్జాండ్రియాలో తానో, ఓరెస్టిసో ఒకరే అధికారం చెలాయించాలనే స్థాయికి సిరిల్ చేరుకున్నారు. ఈ క్రమంలో అలెగ్జాండ్రియాలోని యూదులపై క్రైస్తవులను రెచ్చగొట్టడంతో తీవ్రంగా దాడులు జరిగాయి. యూదులను అలెగ్జాండ్రియా నుంచి బహిష్కరించారు. వాళ్లకు సంబంధించిన ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేశారు. కొన్ని మందిరాలను స్వాధీనం చేసుకున్నారు. అవి కాల గమనంలో చర్చిలుగా మారాయి. “The Jews having committed a most atrocious outrage.. Cyril, accompanied by an immense multitude of people, going to their synagogues – for so they call their houses of prayer – took them away from them, and drove the Jews out of the city, permitting the multitude to plunder their goods.” (Ecclesiastical History, Book VII, Chapter 13, by Socrates Scholasticus). ఈ పరిణామాలు సిరిల్ తో ఓరెస్టిస్ ఘర్షణను మరింత తీవ్రతరం చేసింది. ఈ మతపరమైన ఉన్మాదాన్ని ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించడానికి ఓరెస్టిస్ సిద్ధంగా లేడు. దాదాపుగా క్రీ.శ. 413లో ఓరెస్టిస్ అధికార పర్యటనలో ఉన్నప్పుడు చర్చి సాధువుల గుంపు ఆయన్ను చుట్టుముట్టింది. అందులో అమోనియస్ అనే ఒక సాధువు ఓరెస్టిస్ పై రాయి విసరడంతో అతనికి తీవ్రమైన గాయాలయ్యాయి. అమోనియస్ ను అరెస్టు చేసిన ఓరెస్టిస్ సైనిక అధికారులు ప్రజల ముందు బహిరంగంగా అతనికి మరణ దండన అమలు చేశారు. “One of them, named Ammonius, threw a stone at Orestes, and struck him on the head… Orestes caused him to be tortured publicly, and he died under the effects of the torture.” (Ecclesiastical History, Book VII, Chapter 14, by Socrates Scholasticus).
దీంతో అమోనియస్ ను అమరవీరుడిగా సిరిల్ ప్రకటించడం మరింత వివాదాస్పదమైంది. ఈ పరిణామాలు శాస్త్రవేత్త హైపాటియా హత్యకు దారి తీసింది. అది ఎంత క్రూరమైన హత్య అంటే చదివితేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒళ్లంతా భయంతో వణికిపోతుంది.
హైపాటియా హత్యకు కారణం బలంగానే ఉంది. ఎందుకంటే ఓరెస్టిస్ అత్యంత గౌరవంగా చూసే మేధావి హైపాటియా.. పరిపాలనలో అధికారులు, ఉన్నత వర్గాలవారే కాదు.. ఓరెస్టిస్ కూడా ఆమె బోధనలు విన్నాడు. అనేక సందర్భాల్లో ఆమె సలహాలను స్వీకరించాడు. “There was a woman at Alexandria named Hypatia, daughter of the philosopher Theon… She had frequent interviews with Orestes; and it was calumniously reported among the Christian populace that it was by her influence he was prevented from being reconciled to Cyril.” (Ecclesiastical History, Book VII, Chapter 15, NPNF, Second Series, Vol. 2 by Socrates Scholasticus). హైపాటియా క్రైస్తవురాలు కాదు. పైగా ఓరెస్టిస్ తో సఖ్యంగా ఉంటున్నారు. ఆమె కారణంగానే బిషప్ సిరిల్కు, ఓరెస్టిస్కు మధ్యన శాంతి చర్చలు జరగటంలేదు. సంధి కుదరటం లేదు అన్న అపవాదును అలెగ్జాండ్రియా అంతటా సిరిల్ వ్యాపింపజేశాడు. ఈ రూమర్ దావానలంలా అలెగ్జాండ్రియా అంతటా వ్యాపించింది. సిరిల్ అనుచరులలో ఒకడైన పీటర్ మరి కొందరు మత ఛాందసులతో కలిసి హైపాటియా హత్యకు భయంకరమైన కుట్ర పన్నారు. 415 సంవత్సరంలో ఆమె ఒకరోజు తన గుర్రపు బగ్గీపై వెళ్తుండగా చుట్టుముట్టి బగ్గీలో నుంచి బలవంతంగా కిందకు లాగారు. ఆమెను ఈడ్చుకుంటూ కేసారియమ్ (caesareum) అనే చర్చికి తీసుకొని వెళ్లారు. అక్కడ బహిరంగంగా ఆమె బట్టలు ఊడదీసి నగ్నంగా నిలబెట్టారు. పెంకులు, పదునైన గులక రాళ్లతో అత్యంత పాశవికంగా ఆమె చర్మాన్ని కోశారు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి యముడికి కూడా భయం వేసేంత క్రూరంగా చంపారు. ఆ తరువాత ఆమె శరీర భాగాలను నగరం బయటకు తీసుకొని పోయి అక్కడ పడేసి తగులబెట్టారు.
There was a woman at alexandria named hyaptia, daughter of the philosopher Theon, who made such attainments in literature and science, as to far surpass all the philosophers of her own time. Having succeeded to the school of plato and photinus, she explained the principles of philosophy to her auditors, many of whom came from a distance to receive her instructions. Such was her self-possession and ease of manner arising from the refinement and cultivation of her mind, that she not unfrequently appeared in public in presence of the magistrates, without ever losing in an assembly of men that dignified modesty of deportment for which she was conspicuous, and which gained for her universal respect and admiration. Yet even she fell a victim to the political jealousy which at that time prevailed. For as she had frequent interviews with Orestes, it was calumniously reported among the Christian populace, that it was by her influence he was prevented from being reconciled to Cyril. Some of them therefore, whose ringleader was a reader named Peter, hurried away by a fierce and bigoted zeal, entered into s conspiracy against her ; and observing her as she returned home in her carriage, they dragged her from it, and carried her to the church called Ceesare um, where they completely stripped her, and then murdered her with shells. After tearing her body in pieces, they took her mangled limbs to a place called Cinaron, and there burnt them. An act so inhuman could not fail to bring the greatest opprobrium, not only upon Cyril, but also upon the whole Alexandrian Church. And surely nothing can be further from the spirit of Christianity than the allowance of massacres, fights, and transactions of that sort. This happened in the month of March during Lent,1 in the fourth year of Cyril’s episcopate, under the tenth consulate of Honorius, and the sixth of Theodosius. Ecclesiastical History written by Socrates Scholasticus. Book VII, Chapter 15)
క్రైస్తవ మతోన్మాదానికి, రాజకీయ అధికారంపై చర్చి ఆధిపత్య పోరాటానికి ఒక గొప్ప మేధావిని ప్రపంచం కోల్పోయింది.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
