[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
చాప్టర్ 30.
మొహమ్మద్ ఘజనీ గుర్తున్నాడా? ఒకసారి సోమ్‌నాథ్‌కు వచ్చినందుకే వాడికి మతిపోయింది. తరువాత 17 సార్లు మీద పడి దోచుకున్నాడు. అంతకు ముందు మహమ్మద్ బిన్ ఖాసిం ముల్తాన్‌లో సూర్య దేవాలయాన్ని దోచుకున్నాడు. ఘోరీలు, ఖిల్జీలు, మంగోలులు, చివరకు బానిసలకు కూడా భారతదేశంలో సంపద వరంగా మారింది. ఇక్కడి వాళ్లకు ఇలాంటి దారిదోపిడీలు గతంలో ఎన్నడూ తెలియవు. దేశంలో రాజ్యాల మధ్యన ఘర్షణలు, యుద్ధాలు జరిగాయేమో కానీ అది అధికారం కోసం తప్ప.. రాజ్య విస్తరణ కోసం తప్ప ఇలా ఎన్నడూ చూడని విధంగా ఆబగా కనిపించిన వాడిని కనిపించినట్టుగా చంపుతూ తలుపులు దూలాలతో సహా దోపిడీ చేసిన ఘనత అరబ్బులు, మంగోలులది. తరువాత పదిహేనో శతాబ్దంలో భారత్‌కు వచ్చిన వాస్కోడిగామాకు ఎలా అనిపించి ఉండాలి ఒక్కసారి ఆలోచించండి. కనీసం వాళ్లకు ఏనుగులు, గుఱ్ఱాలు కూడా ఉంటాయని తెలియని స్థితిలో ఉన్నారు. అలాంటి వాడికి ఇక్కడి ఇంత సంపద, వాణిజ్య వ్యాపారాలు, సుగంధ ద్రవ్యాలు, భారీ నిర్మాణాలు, బంగారు తాపడాలు కనిపిస్తే.. ఎలా అనిపించి ఉండాలి. ఒకే ఒక్క యాత్రతో వాస్కోడిగామాకు తత్త్వం బోధపడింది. ఆ మొదటి యాత్రతోనే దరిద్రంలో ఉన్న లిస్బన్ అంతులేని సంపదతో ఉక్కిరిబిక్కిరి అయింది. చర్చికైతే ఆనందానికి అవధులు లేవు. గామా తన యాత్రను వివరిస్తుంటే ఒక్కొక్కరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పోర్చుగల్ రాజు గామాను హీరో స్థాయిలో కీర్తించాడు. ఘనంగా స్వాగతం పలికాడు. పశ్చిమ దేశాలను పంచుకున్న స్పెయిన్ రాజుకు వెంటనే లేఖ రాశాడు. భారత్‌లో ఏ స్థాయిలో సంపద ఉన్నదో వివరించాడు. కార్డినల్ ప్రొటెక్టర్కు మరో ఉత్తరం రాశాడు. అక్కడి నుంచి పోర్చుగల్ రాజులకు, చర్చికి భారత్ ఆక్రమణపై దృష్టి పడింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మరో బృందాన్ని పంపించాడు. 1500 సంవత్సరంలో ఫెడ్రో అల్వారెజ్ కాబ్రాల్ నాయకత్వంలో పోర్చుగల్ రాజు ఏకంగా బలమైన సైన్యాన్ని పంపించింది. కాబ్రాల్ ఓడ 1500 సెప్టెంబర్‌లో కోజికోడ్‌కు చేరుకుంది. నేరుగా అక్కడి రాజు జమోరిన్ దగ్గరకు వెళ్లి ఈసారి జాగ్రత్తగా ఆయన్ను మెప్పించే బంగారం ఇతర తాయిలాలు సమర్పించుకొని వ్యాపారం చేసుకోవడానికి ఒక ఎంఓయూ చేసుకున్నాడు. ఈ ఒక్క ఎంవోయూనే భారతదేశం రెండున్నర శతాబ్దాల వలస బానిసత్వానికి అడుగు పడేలా చేసింది. జమోరిన్తో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత కాలికట్ లో కాబ్రాల్ పోర్చుగీసు ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు. చేసిన మొదటి రోజు నుంచే స్థానిక మపిల్లా (ముస్లిం) వర్తకులపై దాడులు చేయడం ప్రారంభించాడు. వాళ్ల వ్యాపారాలను అడ్డుకోవడంతో ఘర్షణలు తీవ్రమయ్యాయి. కంపెనీ పెట్టుకున్న రెండో నెలలోనే అంటే 1500 సంవత్సరం డిసెంబర్ 16, 17 తేదీలలో మాపిల్లాలలో తీవ్రమైన ఘర్షణ జరిగింది. విసిగిపోయిన స్థానిక వ్యాపారులు పోర్చుగీసు కంపెనీపై దాడి చేసి అక్కడి అధికారి ఐరెస్ కొరెయాతో పాటు యాభై మంది పోర్చుగీసు సైనికులను చంపేశారు. ఆ మర్నాటి నుంచి అంటే డిసెంబర్ 18 నుంచి మూడు రోజుల పాటు కాబ్రాల్ విలయతాండవమే చేశాడు. కాలికట్ ఓడరేవులో మప్పిల్లాల నౌకలు పదింటిని స్వాధీనం చేసుకున్నాడు. వాటిలో దాదాపు 600 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం సిబ్బందిని అత్యంత క్రూరంగా చంపేశాడు. శవాలను ఓడల్లోనే పడేసి.. తగులబెట్టేశాడు. స్థానికంగా ఉన్న మలయాళీ ఓడను పట్టుకొని అందులోని స్థానిక నాయర్లను అమానుషంగా చంపేశాడు. ఆ ఓడను కూడా కాల్చి బూడిద చేశాడు. కాబ్రాల్ అక్కడితో ఆగలేదు. తన యుద్ధ నౌకలను.. (అవి వ్యాపార ఓడలు కావు.) కాలికట్ నగరం వైపు తిప్పేసి.. ఫిరంగులతో నగరంపై విచక్షణ రహితంగా మందుగుండ్లు కురిపించాడు. దీంతో జమోరిన్ తన సైనిక సంపత్తిలో ముందు వరుసలో ఉన్న నాయర్లను ప్రజలకు రక్షణగా పెట్టాడు.. ఫిరంగులతో పెద్ద పెద్ద మందు గుండ్లతో విరుచుకుపడటంతో కాలికట్ నగరం స్మశానంగా మారింది. వందల కొద్దీ నాయర్లు, వేల సంఖ్యలో సాధారణ ప్రజలు, మహిళలు, పిల్లల శవాలతో నగరం ధ్వంసమైంది. ఎంతో ప్రశాంతమైన, సంపన్నమైన నగరం కాబ్రాల్ పైశాచిక దాడితో నాశనమైపోయింది. అనేక నిర్మాణాలు కుప్పకూలిపోయాయి. పోర్చుగీసు క్రూరత్వానికి ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.
“Cabral’s retaliation was swift and barbarous. He seized ten Arab ships which were in the harbour, confiscated their cargoes, and killed the crews, numbering about six hundred men, either by the sword or by drowning them alive. Some of these unfortunate men were burnt aboard their own vessels. Not satisfied with this massacre, Cabral turned his powerful ships’ artillery upon the defenceless city of Calicut. For two days, a merciless bombardment was kept up, destroying a large number of houses, temples, and public buildings, and killing a vast number of the inhabitants, including women, children, and the Nayar soldiers who attempted to defend the shores. Castanheda describes the scene of horror, noting that the fire from the caravels struck terror into the population as the heavy stones and iron balls tore through the crowded streets, leaving mangled bodies in their wake, an act of terrorism intended to show the absolute power of the King of Portugal.” (Malabar and the Portuguese (1500-1663), K. M. Panikkar, P 40 – 41)
ఇవే ఘటనలను బ్రిటిష్ కాలంలో మలబార్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన విలియం లోగాన్ తన మలబార్ మాన్యువల్ గ్రంథం మొదటి సంపుటిలో ఎలా రికార్డు చేశారో చదవండి. ఈ గ్రంథం 1887 లో అచ్చు అయింది.
“Cabral’s response to the destruction of the Portuguese factory was ruthless and immediate. Before the Zamorin could take steps or offer explanation, the Portuguese captain-major seized ten large ships belonging to the Moorish (Mappilla) merchants then riding at anchor in the Calicut roads. The crews of these vessels, amounting to nearly six hundred men, were systematically slaughtered, and many were burned alive on board their own ships after their valuable cargoes of spices had been transferred to the Portuguese fleet. This butchery was followed by a terrible bombardment of the town itself. For two whole days, Cabral’s ships poured a heavy fire of solid stone and iron shot into the defenceless and crowded streets of Calicut, killing upwards of five hundred of the native inhabitants, including women, children, and the Nayars who guarded the coast, and laying a great part of the city, including several houses and temples, in ruins before he sailed away to Cochin.” (Malabar Manual (Volume 1), p.302)
ఈ ఊచకోత జరిగిన వెంటనే ప్రతీకార దాడులకు భయపడిన కాబ్రాల్ వ్యూహాత్మకంగా కొచ్చిన్ (కొచ్చి), కన్ననూర్ ప్రాంతాలకు వెళ్లి .. 1500 డిసెంబర్ 24న అక్కడ జమోరిన్‌కు శత్రువులైన స్థానిక పాలకులతో చేతులు కలిపి పోర్చుగీసు పునాదులను బలంగా చేసుకున్నాడు. కొచ్చిన్‌లో ఉన్నిగోడ వర్మన్ పరిపాలకుడుగా ఉన్నాడు. జమోరిన్తో అతనికి ఉన్న శత్రుత్వాన్ని కాబ్రాల్ తనకు అనుకూలంగా మలచుకున్నాడు. అతనితో సంప్రదించి కొచ్చిన్‌లో పోర్చుగీసు వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాడెవడో విదేశీయుడు వచ్చాడు.. అతనికి సాయం చేయడం వల్ల రాబోయే విపరిణామాలను ఉన్ని వర్మన్ గ్రహించలేదు. జమోరిన్తో శత్రుత్వం మాత్రమే గుర్తుంది. ఈ పరిస్థితిని కాబ్రాల్ తనకు అనుకూలంగా మలచుకున్నాడు.
Leaving Calicut, Cabral sailed southwards and arrived at Cochin on the 24th of December, 1500. The Raja of Cochin, Unni Goda Varma, was a reluctant vassal of the Zamorin and welcomed the Portuguese as a counterpoise to his suzerain’s power. He readily entered into a treaty of alliance and friendship, allowing Cabral to establish a factory on the shores. The Raja went so far as to provide Nair guards to protect the Portuguese factors. In less than a fortnight, with the active cooperation of the local administration, the ships were fully loaded with pepper and other valuable spices. When Cabral departed, he left behind a fully functioning factory under Gonzalo Gil Barbosa and carried with him several natives, including a prominent Nair youth closely connected to the royal household, who later accepted Christianity in Portugal and was baptised under the name of Manuel.”(Malabar and the Portuguese (1500-1663), K. M. Panikkar, p. 41, 42, 43).
ఆ తరువాత కేవలం పదిహేను రోజుల్లోనే తన నౌకలను మిరియాలు, ఇతర మసాలా సరుకులతో నింపేసుకున్నాడు. అక్కడి నుంచి 1501 జనవరి 15న కాబ్రాల్ నౌక కన్ననూరుకు వెళ్లి అక్కడి రాజు కోలత్తిరిని కలిశాడు. ఇక్కడి నుంచి దాల్చిన చెక్క తీసుకొని పోర్చుగీసుకు తిరిగి వెళ్లాడు. “On his return journey, Cabral anchored at Cannanore on January 15, 1501. The Kolathiri Raja of Cannanore, who was also an independent chieftain hostile to the Zamorin, received the Portuguese admiral with great pomp and warmth. He offered them all facilities for trade, but as Cabral’s ships were already fully laden with the rich spoils of Cochin, he could only accept a small quantity of cinnamon and ginger. A commercial treaty was signed, fixing the prices of commodities, and after leaving a message for any future Portuguese fleets, Cabral weighed anchor on the 16th of January, 1501, bidding farewell to the Indian coast to report his mixed fortunes of discovery, trade, and war to King Manuel.” (Malabar and the Portuguese (1500-1663), K. M. Panikkar).
కేవలం అయిదే అయిదు నెలల వ్యవధిలో పోర్చుగల్ నుంచి వచ్చిన కాబ్రాల్, కాలికట్ ను సంపూర్ణంగా ధ్వంసం చేసి వెళ్లిపోయాడు. దీని గురించి మన చరిత్రకారులు ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడరు.
ఆ తరువాత ఏడాదికి అంటే 1502లో వాస్కొడి గామా మళ్లీ పోర్చుగీసుకు వచ్చాడు. కాలికట్ ప్రాంతంలో పోర్చుగీసులు పాగా వేయడంతో ఈసారి ఏకంగా పోర్చుగల్ రాజు సైనిక కమాండర్‌గా వాస్కొడిగామా వచ్చాడు. మొదటిసారి కేవలం నాలుగు నౌకల్లోనే వచ్చిన గామా.. రెండోసారి ఏకంగా 20 భారీ యుద్ధ నౌకలను వెంటేసుకొని వచ్చాడు. అన్ని ఓడలు కూడా ఫిరంగులు, మందుగుండు సామగ్రితో నిండి ఉన్నాయి. భారీ సైనిక బలగాన్ని వెంటేసుకొని వచ్చాడు. వస్తూ వస్తూనే మక్కా నుంచి తిరిగి వస్తున్న మిరి అనే అరబ్బుల ఓడను మలబార్ తీరంలోనే అడ్డుకున్నాడు. ఆ ఓడలో మహిళలు, పిల్లలతో సహా దాదాపు నాలుగు వందల మంది యాత్రికులు ఉన్నారు. ముందుగా ఓడలో ఉన్న సంపద మొత్తాన్ని దోచుకున్నాడు. ఒక్క వ్యక్తిని కూడా వదలకుండా ఓడలోనే బంధించి నిట్ట నిలువునా ఓడను తగులబెట్టేశాడు. అక్కడి నుంచి నేరుగా జమోరిన్ దగ్గరకు వెళ్లి మపిల్లా వ్యాపారులందరినీ నగరం నుంచి వెళ్లగొట్టాలని ఆదేశించాడు. మొదటిసారి వచ్చినప్పుడు బతిమాలుకున్న గామా.. రెండోసారి వచ్చేసరికే ఆదేశించే స్థాయికి చేరుకున్నాడు. తన మాటను జమోరిన్ వినకపోవడంతో వాస్కోడిగామా తన పైశాచికత్వాన్ని, క్రూరత్వాన్ని కాలికట్ ప్రజలకు చూపించాడు. కాలికట్ నగరంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. సముద్రంలో పట్టుబడ్డ మత్స్యకారుల ముక్కులు, చెవులు, చేతులను కోసి ఒక పడవలో వేసి జమోరిన్ కు కానుకగా పంపించి వీటితో కూర వండుకొని తినాలని ఎద్దేవా చేస్తూ ఒక ఫర్మానా కూడా పంపించాడు. మన దేశంపై దాడులకు పాల్పడ్డ ముస్లింలకు, ఈ క్రైస్తవులకు ఏమైనా తేడా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఇంత భయంకరమైన ఊచకోత దక్షిణ భారతంలో ఇదే తొలిసారి కావచ్చు. వాస్కోడిగామాను అడ్డుకోవడానికి జమోరిన్ రాజు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. క్రమంగా అరబ్బుల ప్రాభవం తగ్గిపోయింది. పోర్చుగీసు వాళ్లు మిరియాల వ్యాపారాన్ని తమ ఆధీనంలోకి తీసేసుకున్నారు. మాపిల్లాలపై ఆంక్షలు విధించారు. వారు మిరియాలు, అల్లం వ్యాపారాలు చేయవద్దని నిషేధం విధించారు. ముస్లింలు లవంగాలు, సోంపు, సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేయరాదని అడ్డుకున్నారు. మూర్లు (ముస్లింలు), మపిల్లా వ్యాపారులకు అరేబియా తీరం, మలక్కా, రేషా, థినాసురి వంటి ఓడరేవుల్లోకి కనీసం ప్రవేశాన్ని కూడా లేకుండా చేశారు. కేవలం ఇరవై ఏండ్ల తక్కువ వ్యవధిలోనే కేరళ తీరం అంతా పోర్చుగీసు పరమైంది. మఫిల్లాలు, మూర్లు పోకచెక్కలు, కొబ్బరికాయలు, చిన్న చిన్న బట్టల వ్యాపారం చేసుకొనే స్థాయిని దిగజారారు. పోర్చుగీసులు ఏ దశలోనూ ముస్లిం, అరబ్ వ్యాపారులపై కనికరం చూపలేదు. వారి ప్రార్థనామందిరాలను దహనం చేశారు. ఖురాన్‌ను కాళ్లతో తొక్కి అవమానించారు. మక్కా యాత్రికులను నిర్దాక్షిణ్యంగా వధించారు. ఈ పరిణామాలను జైన్ ఉద్ దీన్ మక్దూమ్ 2 అన్న ముస్లిం చరిత్రకారుడు తుహ్ఫాత్ అల్ ముజాహిదీన్ అన్న తన గ్రంథంలో రికార్డు చేశాడు. కేరళలో పోర్చుగీసు దురాగతాలు, మలబార్ ముస్లింల ప్రతిఘటనలపై వచ్చిన తొలి సాధికారిక గ్రంథంగా చెప్పవచ్చు. అయితే విలియం లోగాన్ అభిప్రాయం ప్రకారం పోర్చుగీసు వారు కేరళ తీరానికి రాకపోయి ఉంటే.. మలబార్ ప్రాంతం అంతా ఇస్లామీకరణ జరిగి ఉండేదని, పోర్చుగీసు వారు వచ్చి ఈ విపరిణామం జరుగకుండా నిలువరించారని పేర్కొన్నాడు. అయితే, తాను అనుకున్నట్టు పూర్తిగా క్రైస్తవీకరణ కూడా జరుగలేదు. కానీ వాస్కోడిగామా రెండోసారి పర్యటనతో వలస పాలన ప్రారంభమైందని చెప్పాలి. భారత్‌లో యూరోపియన్ల రాజకీయ సైనిక జోక్యం మొదలైంది. 1524లో మళ్లీ వాస్కోడిగామా భారత్‌కు వైస్రాయ్గా వచ్చాడు కానీ.. కొద్ది రోజులకే మలేరియాతో చనిపోయాడు. పోర్చుగీసు రాజ్యాధికారం సాధించుకోవడం సంపూర్ణమైంది.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
