Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-8

[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

చాప్టర్ 9.

ఏసుక్రీస్తు ఎవరు? ఎక్కడ పుట్టారు.. క్రైస్తవం మూలాలు ఏమిటి? ఎలా విస్తరించింది? అన్న అంశాలను తెలుసుకుంటే తప్ప దాని విస్తరణ వ్యూహాలు.. అది చేసిన ధ్వంసం వెనుక కుట్ర అర్థం కాదు. ఇందుకోసం క్రీస్తు పుట్టుక నుంచి అధ్యయనం మొదలుపెట్టాల్సి ఉంటుంది. క్రైస్తవం గురించి మాట్లాడటం మొదలైనప్పుడు యేసుక్రీస్తు జననం, ఆయన జీవితం, ఆయన ఇచ్చే సందేశం, ఆయన అనుభవించిన యాతన.. పాపములనుంచి విముక్తి కల్పించడం వంటివి ఆధారంగా చేసుకొని మిషనరీలు ప్రజలకు బోధనలు చేస్తుంటారు. ఏసుక్రీస్తు తన బోధనలు, జీవితం ద్వారా ప్రజల మనసులను గెలుచుకున్నాడని.. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని క్రైస్తవులు మతం ప్రారంభమైనదని క్రైస్తవులు నమ్ముతారు. అందరికీ తెలిసినట్టుగానే క్రైస్తవ మూలాలు జుడాయిజంలో ఉన్నాయి. మోషే ద్వారా వచ్చిన కానూన్ (చట్టాలు, లేదా నిబంధనలు) లను అనుసరిస్తారు. క్రైస్తవుల ఓల్డ్ టెస్ట్‌మెంట్ తనాఖ్‌ను ఆధారం చేసుకొని రూపొందింది. ఆ తరువాత దేవుడి దూతగా మెసయ్యా వచ్చాడు.. అతడినే ఏసు అని ప్రజలు విశ్వసించారు. ఏసుక్రీస్తు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి 4 వశతాబ్దం మధ్యలో జన్మించినట్టుగా భావిస్తారు. బెత్లెహమ్‌లో మేరీ, జోసెఫ్‌లు ఆయన తల్లిదండ్రులు. ఏసుక్రీస్తు పుట్టుకపై వివాదాలు ఉన్పప్పటికీ.. శాస్త్రీయమైన ఆధారాలపై అనేక వాదోపవాదాలు జరిగాయి. క్రీస్తు పూర్వం 4-6 మధ్యలో క్రీస్తు ఉన్నాడని ఒకరు రాస్తే.. మరొకరేమో ప్రస్తుత శకం 37 నుంచి 100 మధ్యలో క్రీస్తు ఉన్నట్టుగా పేర్కొన్నారు. ‘At this time there was a wise man named Jesus, if it be lawful to call him a man. He was a doer of wonderful works..” (Antiquities of the Jews, Flavius Josephus), జోసిఫస్ ఒకటో శతాబ్దపు యూదు చరిత్రకారుడు. అందువల్ల ఈయన చరిత్రకు సాధికారత ఉండే అవకాశం ఉంది. కానీ, అయితే ఈ వాక్యం జోసిఫస్ రాసినదేనా లేక క్రైస్తవ అనువాదకులు రాసిందా అన్న వాదన ఇప్పటికీ కొనసాగుతున్నది. కానీ, క్రైస్తవులు మాత్రం ఈ వాక్యాన్ని విశ్వసిస్తారు. టాకిటస్ (tacitus) అనే రచయిత రాసిన అనల్స్ (annals, 15.44) లో “Christus, from whom the name (Christian) had its origin, suffered the extreme penalty during the reign of Tiberius at the hands of one of our procurators, Pontius Pilate..” రోమన్ కాలంలో ఏసు శిలువనెక్కిన విషయాన్ని ఈ వాక్యం చెప్తున్నది. నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులను క్రూరంగా వెంటాడినప్పుడు వారి ప్రవక్త అయిన క్రీస్తును పైలట్ చేత శిక్షించాడని ఇందులో పేర్కొన్నారు. సూటోనియస్ (Suetonius), ప్లిని ది యంగర్ (Pliny the Younger) ల రచనల్లో ఏసు ప్రస్తావన లేకపోయినప్పటికీ.. క్రైస్తవుల ఉనికిని గురించి సూచనలు మనకు కనిపిస్తాయి. “Did Jesus Exist? The Historical Argument for Jesus of Nazareth” అన్న గ్రంథం రచించిన బార్ట్ ఎహ్ర్మన్ అనే నాస్తిక చరిత్రకారుడు ఏసు అనే వ్యక్తి చారిత్రకంగా ఉన్నాడని పేర్కొన్నారు. కాకపోతే.. కన్య గర్భధారణ వహించడం అన్నది మాత్రం క్రైస్తవ మత విశ్వాసానికి సంబంధించింది మాత్రమేనని చెప్తారు. బైబిల్ ఏసు జనన సంవత్సరాన్ని స్పష్టంగా ఇవ్వదు. మాథ్యూ లేదా మత్తయ్య, లూకా సువార్తలలో మాత్రమే మరియాకు ఏసు జన్మించిన కథ వివరంగా ఉంటుంది. మాథ్యూ సువార్తలో 1:18 నుంచి 2:16 మధ్యన ఏసు జన్మ వృత్తాంతం వస్తుంది. మరియ కన్యగా ఉన్నప్పుడే గర్భవతి కావడంతో జోసెఫ్ ఆమెను సందేహించి విడిచిపెట్టాలని భావిస్తాడు. కానీ, దేవదూత అతని కలలో కనిపించి అది దేవుని కార్యమని చెప్పటంతో విశ్వసిస్తాడు. బెత్లెహామ్‌లో ఏసు జన్మిస్తాడు. ఆ సమయంలో ‘తూర్పు దేశాల నుంచి జ్ఞానులు’ వచ్చి ఏసును దర్శించి వెళ్తారు. మాథ్యూ వెర్షన్‌లో నక్షత్రాలు, హేరోడ్ కథలు ప్రధానంగా ఉంటాయి. ఈ నక్షత్రాల గురించి తరువాతి వ్యాసాల్లో వివరంగా తెలుసుకుందాం. లూకా సువార్తలో మాత్రం దేవదూత మరియాకు ప్రత్యక్షమై ఏసు జన్మ గురించి ప్రకటించడం, జనాభా లెక్కల కారణంగా మరియా జోసఫ్‌లు బెత్లెహమ్ వెళ్లగా అక్కడ గుడిసెలో ఏసు జన్మించడం ఈ వృత్తాంతాన్ని దేవదూతలు గొర్రెల కాపరులకు చెప్తారు. సువార్తలు నాలుగు ఉన్నాయి. ఇవి మాథ్యూ (మత్తయి), మార్కు, లూకా, జాన్ (యోహాను). వీరిలో లూకా తన సువార్త 1:1-4 లో “మొదటివారి నుంచి మేము వినిన వాటిని గట్టి ఆధారంగా రాశాము’’ అన్న వాక్యం ఉంటుంది. ఇక్కడ మొదటి వారు అంటే ఏసుక్రీస్తు అని భావించాలి. జెరూసలెంలో క్రీస్తు సమాధి (Golgotha)ని రోమన్ చక్రవర్తి కన్స్టాంటిన్ తల్లి హెలెనా 326 లో గుర్తించినట్టు విశ్వాసం. మరికొందరు ప్రొటెస్టెంట్లు మాత్రం అక్కడే ఉన్న గార్డెన్ టోంబ్‌ను క్రీస్తు సమాధిగా నమ్ముతారు. కానీ దీనికి పెద్దగా గౌరవం లేదు.

ఏసుక్రీస్తు పార్థివదేహానికి చుట్టబడినదిగా భావించే పవిత్ర వస్త్రం (shroud of turin) పై దీర్ఘ కాలంగా పరిశోధనలు జరుగుతూ వస్తున్నాయి. ఈ వస్త్రం 4.4 మీటర్ల పొడవు, 1.1 మీటర్ల వెడల్పుతో రెండువైపులా జీసస్ చిత్రం కలిగి ఉన్నది. ఇది జీసస్ క్రీస్తు పార్థివ దేహం మీద కప్పబడినదిగా విశ్వసిస్తూ వస్తున్నారు. క్యాథలిక్‌లు ఈ వస్త్రాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. కానీ, ఇది ఏసుక్రీస్తు కాలానికి చెందినదా కాదా అన్నది వివాదాస్పదంగానే ఉన్నది. క్రైస్తవ మత పెద్దల కథనాల ప్రకారం ఈ వస్త్రం రెండువేల సంవత్సరాల క్రితం జెరూసలేంలో.. ఆ తరువాత టర్కీలోని ఎడెస్సా, షాన్లియుర్సా కు చేరింది. ఆ తరువాత కాన్స్టాంటినోపుల్ (ఇప్పటి ఇస్తాంబుల్) కు చేరింది. అక్కడి నుంచి యూరప్‌కు వచ్చింది. కానీ ఈ కథనాలకు మనకు ఆధారాలైతే కనిపించవు. ఈ వస్త్రం మొట్టమొదట 1353, 57 మధ్యన ఫ్రాన్స్ లోని లీరేలో కనిపించింది. ఆ తరువాత అనేక ప్రాంతాలకు మారుతూ వచ్చింది. ప్రస్తుతం ఇటలీలోని టూరిన్ నగరంలోని సెయింట్ జాన్ బాప్టిస్ట్ చర్చిలో ఉంచారు. ఈ వస్త్రం పై ఉన్న డీఎన్‌ఏ పై సుదీర్ఘ కాలంగా పరిశోధనలు జరుగుతున్నా.. 2026 మార్చిలో ఇటలీలోని పడోవా విశ్వవిద్యాలయం ఒక పరిశోధన ఫలితాలను వెలువరించింది.

ఈ విశ్వవిద్యాలయం 1978 లో 12 నమూనాలు సేకరించి పరిశోధన ప్రారంభించింది. ఈ పరిశోధన కోసం యూనివర్సిటీ పరిశోధకులు నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ((NGS – Next Generation Sequencing)ను వినియోగించారు. వస్త్రంపై ఉన్న డీఎన్ఏ కచ్చితత్వాన్ని తేల్చడం కోసం మానవ డీఎన్‌ఏను సేకరించారు. 12 నమూనాల్లో ఏడు నమూనాల నుంచి తీసుకున్న డీఎన్‌ఏలో 10 శాతం మానవ డీఎన్‌ఏ లభించింది. డీఎన్ఏ పొడవు చాలా చిన్నగా ఉండటం వల్ల ఇది చాలా పాత డీఎన్ఎగా భావించారు. ఈ పరిశోధనలో అనేక మైటోకాండ్రియల్ జన్యువులను గుర్తించారు. ముఖ్యంగా K1a1b1a, H2a2, H1b, H33 జన్యువులు కనిపించాయి. K1a1b1a జన్యువు యూరప్ లోని అష్కెనాజీ యూదు (Ashkenazi Jewish) జాతికి సంబంధించినది. ఇక H1B యూరప్ లో సాధారణంగా కనిపించే జన్యువు. H33 జన్యువు మధ్య ప్రాచ్యంలో అరుదుగా కనిపిస్తుంది. H2A2 అనేది సాధారణంగా అన్నిచోట్లా కనిపిస్తుంది. వీటితో పాటుగా భారత ఉపఖండానికి సంబంధించిన M39, M56, R7, R8 జన్యువులు కూడా లభించాయి. 38.7% భారత దేశానికి చెందిన మానవ జన్యు పదార్థం (డీఎన్ఏ) ఆనవాళ్లు లభించినట్టు స్కాలర్లు నివేదికలో పేర్కొన్నారు. దాదాపు 14 మంది వ్యక్తుల డీఎన్‌ఏ లభించిదని పరిశోధకులు చెప్తున్నారు. దీనితోపాటు 19కి పైగా మొక్కలు, పిల్లులు, కుక్కలు,కోళ్లు, చేపల డీఎన్‌ఏ ఆనవాళ్లు వెల్లడైనట్టు ఆ నివేదిక చెప్తున్నది. ఆ నారవస్త్రం లేదా, వస్త్రాన్ని తయారు చేయడానికి వాడిన నూలు దారం భారతదేశం నుంచి వచ్చిందని ఈ నివేదిక చెప్తున్నది. ఆనాటి వాణిజ్య మార్గాల ద్వారా భారతదేశం నుంచి మధ్య ప్రాచ్యానికి చేరుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఫలితాలు క్రీస్తుకు చాలా కాలం ముందు నుంచి పశ్చిమ ఐరోపా, ఈశాన్య ఆఫ్రికా, తూర్పు ఆసియా, మధ్య ఆసియా, కాకసస్ ప్రాంతాలతో భారతదేశానికి, ఇక్కడి ప్రజలకు ఉన్న సంబంధాలను వెల్లడి చేస్తున్నది. అంటే క్రైస్తవానికి చాలా ముందు నుంచే భారతదేశం నుంచి వాణిజ్యం, రాకపోకలు మధ్య ప్రాచ్యానికి, రోమ్ సామ్రాజ్యానికి, ఐరోపాకు సాగినట్టుగా ఈ పరిశోధన తేల్చింది.

In this study, we also identified human mitochondrial variants, which can be classified into one main haplogroup (K1a1b1a, which is the same of the collector), and those with diagnostic motifs of different lineages, such as H1b, an ancient late glacial marker common in Western Eurasia, and H33, which is typical of the Near East and particularly frequent among the Druze as previously documented by Barcaccia et al.. Notably, the Druze population shares a common genetic ancestry with Jews and Cypriots, and has historically intermingled with other Levantine populations, including Palestinians and Syrians. Although additional single nucleotide polymorphisms (SNPs) were identified, it was not possible to reconstruct complete mitogenome haplotypes that could be confidently classified into any of the South Asian minor lineages (e.g., M39, M56, R7, and R8) identified in our previous study by analyzing mtDNA hypervariable segment I (HVS-I) from a different sample of the Shroud of Turin. In that study, over 55.6% of the human mtDNA HVS-I reads were classified into Near Eastern lineages, while Western European lineages accounted for less than 5.6%. The presence of approximately 38.7% of Indian ethnic lineages could have resulted from historical interactions or the Romans importing linen from regions near the Indus Valley, associated with the term “Hindoyin” found in rabbinic texts. Notably, the term “Shroud”, derived from the Greek “Sindôn” meaning fine linen, may be related to Sindh, a region renowned for its high-quality textiles. Historical evidence supports trade links between India and the Mediterranean, underscoring the significance of these textiles and inviting further exploration of ancient cultural interactions and trade practices. Indeed, the biblical scholar Levergne stated that the term “Sindôn” refers to a fabric of Indian origin, valued for its qualities and used for various and multiple purposes. In brief, a reappraisal of those outcomes from the analysis of the DNA traces found on the Shroud of Turin suggests the potentially extensive exposure of the cloth in the Mediterranean region and the possibility that the yarn was produced in India.. Genomic DNA was previously isolated and analyzed from organic residues recovered in 1978 from different parts of the body image on the back of the Shroud, and from threads taken from the edges and used in 1988 for radiocarbon dating of this sacred artifact. Analysis of the DNA extracted from organic particles and textile strands sampled from the Shroud revealed chloroplast and mitochondrial genome sequences representing multiple plant species, as well as various human biogeographical origins. In particular, these analyses revealed the presence of at least 19 plant species common in the Mediterranean Basin, in addition to plants whose primary center of origin is Asia (China), the Middle East, and the Americas, some of which reflects their introduction to the Old World after the 12th century. In addition, the analyses revealed sequences from at least 14 people of different geographic ancestry, based on the Eurasian haplogroups identified which are common to Western Europe and North-eastern Africa, as well as from the Middle East, the Arabian Peninsula, the Caucasus region, and also rare haplotypes from the Indian sub-continent (9). A quantitative assessment of the overall amplicon sequencing data revealed that over 55.6% of the human DNA corresponds to lineages from the Near East, while Western European lineages account for less than 5.6%. The presence of 38.7% of the overall human genomic data from Indian lineages is unexpected and is potentially linked to historical interactions associated with importing linen or yarn from regions near the Indus Valley, referred to as “Hindoyin” according to rabbinic texts. The present study aimed to isolate and characterize genomic DNA sequences from Turin Shroud samples using a different molecular methodology (NGS vs.PCR) and an original sample consisting of linen filaments collected in 1978 by the late Prof. Pierluigi Baima Bollone from various sections of the Turin Shroud. After DNA extraction in clean rooms, shotgun genomic libraries were sequenced using an NGS strategy with the main goal to determine the quantity and quality of human DNA and any residual DNA from microbial, fungal, plant, and animal species. The genetic results obtained were then correlated with historical information, the corresponding geographical areas of origin, and the modern distribution of plant species and human geographic groups with the aim of acquiring new data and providing novel clues as to the origin of the Shroud of Turin.

(https://www.biorxiv.org/content/10.64898/2026.03.19.712852v1.full.pdf)

1978 లో సేకరించిన ఈ వస్త్రంనుంచి సేకరించిన రెండు నమూనాలకు కార్బన్ డేటింగ్ చేయగా.. ఇది సుమారుగా 1451 నుంచి 1600, 1642 నుంచి 1800 సీఈ కాలానికి చెందినదిగా భావిస్తున్నట్టు ఈ నివేదికలో పేర్కొన్నారు.

An in-depth metagenomic analysis was conducted on several linen strands collected from different areas of the body image of the Man of the Shroud during the official sampling in 1978. Our analyses revealed several human DNA lineages, including one common in Western Eurasia and another prevalent in the Near East. Additionally, the diversity of animal and plant species identified details the significant environmental contamination of the Shroud that likely occurred in recent centuries, particularly following the voyages of Marco Polo and Christopher Columbus. Radiocarbon dating of two distinct textile residuals from the Shroud’s reliquary indicated a time range between 1451 and 1800 CE, overlapping with the period of its repair interventions.

(https://www.biorxiv.org/content/10.64898/2026.03.19.712852v1.full.pdf)

1532 లో ఈ వస్త్రం వెండిపెట్టెలో ఉన్నప్పుడు కాలిపోతే.. ఈ వస్త్రాన్ని నన్ లు కుట్టారని.. అందువల్ల ఆ డేటింగ్ రావొచ్చని భావిస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాలతో కొత్త సందేహాలు ప్రారంభమయ్యాయి. ఇది క్రీస్తు పార్థివదేహంపై కప్పిన నిజమైన Shroud of Turin యేనా అని.

ఏసుక్రీస్తు పుట్టుకపై ఒక అవగాహన.

అంశం స్థితి
ఏసు అనే వ్యక్తి చరిత్రలో ఉన్నారా? జోసిఫస్, టాకిటస్, తదితరుల రచనలు దీనికి ఆధారాలు.
కన్యగర్భధారణ, దేవుడి పుత్రుడు అనే విషయాలు శాస్త్రీయంగా నిరూపించలేని మత విశ్వాసాలు
సమాధి స్థలం జెరూసలేంలోని Church of the Holy Sepulchre కు పురావస్తు మద్దతు ఉంది
క్రీస్తు పార్థివదేహంపై కప్పిన గుడ్డ (Shroud of Turin) ఇంకా వివాదాస్పదం, పునఃపరీక్షలు జరుగుతున్నాయి
పునరుత్థానం మతపరమైన విశ్వాసం, శాస్త్రీయంగా నిరూపణ లేదు

(ఇంకా ఉంది)

Exit mobile version