[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
చాప్టర్ 10.
ఏది సత్యం.. ఏదసత్యం?? క్రీస్తు అస్తిత్వానికి సంబంధించి ఈ ప్రశ్నలు వేసుకుంటే.. కచ్చితమైన జవాబు మాత్రం దొరకదు. ఏసుక్రీస్తు ఉనికిని గురించి సువార్తలలో ఉన్న ప్రస్తావన చాలా తక్కువ. ఉన్నవి నాలుగు. వాటిలో రెండింటిలో మాత్రమే ఏసు జనన ప్రస్తావన ఉన్నది. ఈ సువార్తలు ఒకటో శతాబ్దంలో రాసినట్టుగా అంచనా వేస్తారు తప్ప కచ్చితత్వం లేదు. మార్క్ రాసిన మొదటి సువార్తలో ఏసు జననం గురించిన సమాచారం లభించదు. యోహాను చేత ఏసు ఆచార బద్ధంగా శుద్ధి చేయటంతో మార్కు సువార్త మొదలవుతుంది. అంతకుముందు ఏం జరిగిందన్నది తెలియదు. జాన్ లేదా యోహాన్ సువార్త ఒక స్తోత్ర వాక్యంతో మొదలుపెట్టి.. యేసు బాప్తిజాన్ని వివరిస్తాడు. ముందరి వ్యాసాల్లో చెప్పుకున్నట్టు మాథ్యూ, లూకా సువార్తల్లో మాత్రమే ఏసు జననం రెండు భిన్న కథనాలుగా సంక్షిప్తంగా కనిపిస్తుంది. క్రీస్తు శకం 300 తరువాత మాత్రమే బైబిల్ పాత నిబంధన వెలుగు చూసింది. లూకా సువార్తలో ‘ఏసు 12 సంవత్సరాల వయసులో కుటుంబంతో కలిసి జెరూసలేం తీర్థయాత్రకు వెళ్లినప్పుడు తన తల్లిదండ్రుల నుంచి ‘జారుకున్నట్టు’ చెప్తారు.. వారు అతడిని జెరూసలేం దేవాలయంలోని బోధకులతో చర్చిస్తూ కనుగొన్నారు (2:41). దాని తరువాత ప్రస్తావన ‘సుమారు 30 ఏండ్ల వయస్సులో తన పరిచర్యను ప్రారంభించినప్పుడు కనిపిస్తుంది (లూకా 3:23). ఆ తరువాత ఏసు తన తల్లిదండ్రులతో నజరేతుకు తిరిగి వచ్చి ‘‘జ్ఞానంలోను, ఎదుగుదలలోను, దేవుని మరియు మనుష్యుల దయలోను అభివృద్ధి చెందాడు” అని లూకా తన సువార్తలోని రెండో అధ్యాయంలో చెప్తాడు. ఏసు జీవితంలో ఈ 18 సంవత్సరాల అంతరం గురించి బైబిల్ కొత్త నిబంధనలో తీవ్రమైన చర్చ జరిగింది. మార్కు తన సువార్తలో ఈ అజ్ఞాత సంవత్సరాలలో నజారేత్ లోని గలీలీలో ఏసు వడ్రంగిగా జీవించారని పేర్కొన్నారు. దాదాపు 12వ శతాబ్దం నుంచే ఏసు అజ్ఞాత సంవత్సరాల గురించిన చర్చ మొదలైంది. ఈ గల్లంతైన సంవత్సరాల గురించి చాలా రకాల కల్పితం, ఊహాజనితమైన కథనాలను రాసుకుంటూ వచ్చారు. ఏసుక్రీస్తు ఈ 18 సంవత్సరాల కాలంలో బ్రిటన్, ప్రాచీన అమెరికా, చివరకు భారతదేశం వరకు వెళ్లారని రక రకాల సిద్ధాంతాలు పుష్కలంగా వెలువడ్డాయి. 19వ శతాబ్దంలో నికోలస్ నొటోవిచ్ ఏసు జీవితంపై రాసిన రాతలతో ఈ చర్చ మరింత తీవ్రరూపం తీసుకున్నది.
క్రీస్తుకు సంబంధించి ఇంతవరకు కనిపించిన అస్పష్టంగా ఉన్న ఆధారాలను సైతం క్రైస్తవ సమాజం, చర్చి ఆమోదించింది. విశ్వాసంలోకి తీసుకుంది కూడా. అయితే మరికొన్ని ఆధారాలను ప్రస్తావిస్తూ వచ్చిన రచనలు వేరే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది పైన పేర్కొన్న రష్యన్ చరిత్రకారుడు నికోలస్ నోటోవిచ్ రాసిన ‘ప్రపంచానికి తెలియని జీసస్ క్రీస్తు జీవితం’ (“unknown life of jesus christ” by nicolas notovitch) అన్న రచన. ఈ గ్రంథం ప్రస్తుత క్రైస్తవ సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకంగా ఉండటం కారణంగా క్రైస్తవ సమాజం దీన్ని నిషేధించింది. ఇందులోని అంశాలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇంతకీ ఈ నొటోవిచ్ ఎవరు? ఈ గ్రంథం ఎందుకు నిషేధానికి గురయ్యేలా సంచలనం సృష్టించింది?
రష్యన్ ఆంత్రోపాలజిస్ట్ అయిన నికోలస్ నొటోవిచ్ 1887లో భారతీయ సంస్కృతిని అధ్యయనం చేయడం కోసం ఈ దేశానికి వచ్చాడు. యూదు కుటుంబంలో 1858 లో జన్మించిన నోటోవిచ్ రష్యన్ సైన్యంలో పనిచేశాడు. తరువాత బాల్కన్, మధ్య ఆసియా, పర్షియా ప్రాంతాలలో పర్యటించాడు. ఆ తరువాత ఆయన 1887లో భారత్‌కు చేరుకున్నాడు. ఆయన తొలుత అడుగుపెట్టింది ఉత్తరాన ఉన్న లడ్డాక్‌లో. లడ్డాక్ నుంచి ఆయన కారాకోరం పర్వత శ్రేణుల మీదుగా చైనా, టర్కీ మీదుగా రష్యాకు తిరిగి వెళ్లాలని భావించాడు. లడ్డాక్ చేరుకున్న నొటోవిచ్ అక్కడ ఉన్న బౌద్ధారామంలోని బౌద్ధ భిక్షువుతో మాట్లాడాడు. ఆయన ఈసాకు సంబంధించిన గ్రంథాలు టిబెట్ లోని లాసాలో ఉన్నాయని చెప్పారు. అప్పటికి టిబెట్ లోకి విదేశీయుల రాకపై నిషేధం అమలులో ఉన్నది. లడాక్ నుంచి లేహ్‌కు ఆయన ప్రయాణిస్తుండగా గుర్రం మీది నుంచి కిందపడి కాలు విరగడంతో.. నోటోవిచ్ ను హెమిస్ బౌద్ధారామానికి తరలించారు.
Returning to Leh, Notovitch sent the head of the Hemis monastery some valuable gifts in the hope of being allowed to return in the near future, and so perhaps catch a glimpse at last of the precious manuscripts. It so chanced that, a little time later while out riding near Hemis, he fell from his horse, landed awkwardly enough to break a leg, and was perforce compelled to entrust himself into the care of the monks. Recovering in bed, he sent out a heartfelt plea, and two large bound volumes of loose 10 Jesus Lived in India leaves yellowed with age were finally brought to him. The reverend abbot himself proceeded to read aloud from the extraordinary document, which was written mostly in single verses that did not follow on from each other. Notovitch took careful notes of his interpreter’s renditions in his travel diary. Later, sometime after his expedition had come to an end, he arranged the verses in chronological order and succeeded in rounding off the many sepa rate texts so as to give a continuous narrative.’ (jesus lived in India, holger kersten p.9,10)
లేహ్‌లో అక్కడి ఆరామ అధిపతి నొటోవిచ్‌తో మాట్లాడుతూ.. ‘ఈసా అన్న పేరు బౌద్ధులకు చాలా గౌరవమైన పదం. మహాత్ముడైన బుద్ధుడు బ్రహ్మ అవతారం. ఆయన ఎప్పుడూ నిర్మలస్థితిలో ఉంటారు. భూమిపై కాలాతీతమైన అనేక అంశాలు ఆయనలో నిక్షిప్తమై ఉంటాయి. ఆయనే శాక్యమునిగా అవతరించాడు. ఆ తరువాత 23 అవతారాలు దాల్చాడు. దాదాపు రెండు వేల ఏండ్ల క్రితం ఒక పేద కుటుంబంలో పుట్టిన ఒక పూర్ణ మానవుడు చిన్న వయసులోనే భారత్‌కు వచ్చి బౌద్ధ బోధనలను అధ్యయనం చేశారు. ఆయనే ఈసా. అతని రాకకు సంబంధించిన రాత ప్రతులు (మ్యానుస్క్రిప్టులు) భారత్ నుంచి నేపాల్ కు, నేపాల్ నుంచి టిబెట్ కు చేరుకున్నాయి. అందులోని భాష పాలీలో ఉన్నది. దానికి సంబంధించిన ఒక కాపీ మా భాషలో అనువదించి ఉన్నది’ అని పేర్కొన్నారు. బైండ్ చేసిన రెండు వాల్యూమ్ లను తమ భాషలో చదువుతూ ఉండగా రష్యన్ అనువాదకుడు తనకు అనువదించి చెప్పాడని వాటిని తాను చాలా శ్రద్ధగా కాపీ చేసుకున్నానని నొటోవిచ్ పేర్కొన్నాడు. 13 సంవత్సరాల వయసులో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఏసు తల్లిదండ్రులను వదిలి.. జెరూసలేం నుంచి వ్యాపారులతో బయలుదేరి సింధ్ ప్రాంతానికి ప్రయాణించాడని నొటోవిచ్ చెప్పాడు.
“When Issa had attained the age of thirteen, the age at which an Israelite is expected to marry, the house where his parents lived became a meeting place of rich and noble people, who wished to have as son-in-law the young Issa, already famous for his edifying discourses in the name of the Almighty.
It was then that Issa secretly left his father’s house, departed from Jerusalem, and, in company with merchants, journeyed toward Sindh, with the object of perfecting himself in the divine word and studying the laws of the great Buddhas.” (“unknown life of jesus christ” by nicolas notovitch, p.31-32)
భారత ఉపఖండానికి చేరుకున్న తరువాత ఈసా వేదాలు, ఇతర తాత్త్విక ధోరణులను అధ్యయనం చేశాడు. తరువాత విగ్రహారాధనను విమర్శించి దేవుడు ఒక్కరే అని బోధించాడని దీనికి కొనసాగింపుగా నొటోవిచ్ రాశాడు. హిమాలయ పర్వత శ్రేణుల నుంచి ఈసా నేపాల్ ఎలా చేరుకున్నాడు.. అక్కడ ఆరు సంవత్సరాలు బౌద్ధ బోధనలు ఎలా అధ్యయనం చేశాడో నొటోవిచ్ పేర్కొన్నాడు. “Issa left the land of the pagans and went toward the north of India, in the country of Nepal and the Himalayan mountains, where he settled among the Buddhists.” (“unknown life of jesus christ” by nicolas notovitch, p.36-37) ఆ తరువాత ఈసా తన శిష్యులకు ప్రేమ, కరుణ, త్యాగం గురించిన బోధనలు చేశాడు. ఈసాను చాలా గొప్ప వ్యక్తిగా మహాత్ముడిగా బౌద్ధులు గౌరవించారని పేర్కొన్నాడు. ఈసా అక్కడ చాలా సంవత్సరాల పాటు అక్కడ ఉన్నాడని తెలిపారు. ఇక్కడ ఆయన అనేక అంశాలను అధ్యయనం చేసి తరువాత ఇజ్రాయిల్‌కు తిరిగి వెళ్లినప్పుడు తనదైన సంఘాన్ని(చర్చి) స్థాపించాడని చెప్తారు. హాల్గర్ కెర్స్టెన్ రాసిన జీసస్ లివ్‌డ్ ఇన్ ఇండియా గ్రంథంలో క్రీస్తు భారత్‌కు రావడం బౌద్ధాన్ని, వేదాలను అధ్యయనం చేయడం వల్లనే ఆయన బోధనల్లో అత్యధికంగా బుద్ధుడి బోధనల ఆనవాళ్లు కనిపిస్తాయని పేర్కొన్నారు. ఆయన స్థాపించిన సంఘం (చర్చి)లో భారతీయ సంప్రదాయాలు, ముఖ్యంగా బౌద్ధ సంప్రదాయాలు అధికంగా కనిపిస్తాయని కూడా పేర్కొన్నాడు.
Jesus cannot be said definitively to have belonged to any of these various groups for he evidently refused to be categorically subject to any imposed laws, choosing, like Buddha, just ‘to do the right thing at the right time’. The huge physical distance between Palestine and India had over the centuries widened the gulf in understanding between the leaders of the spiritual faith who subscribed to the principles of Buddhist philosophy in India and their equivalents in Israel. Jesus could for this reason be accurately described as a ‘reformer’ who was sent to re-establish a unity o. belief among the ‘lost sheep’, to strengthen their resolve, and to give them spiritual and moral support in their struggle against Roman occupiers, Sadducees, Pharisees and Orthodox Jews. Jesus was the Divine Messenger for whom many had earnestly longed during a time of tumult and confusion. The two disciples sent by John the Baptist asked him, ‘Art thou he that should come, or do we look for another?’ (Matthew 11:3). John the Baptist was a prophet to the Nazarenes, and was known as ‘the Saviour’ in Galilee. Flavius Josephus describes the Baptist as
…an honourable man, who inspired the Jews to do good and to treat each other well, and who urged them to receive baptism. Then, he declared, God would look with favour on the baptised – for baptism conferred physical healing and was not merely the washing away of sin. Atonement for sin must come beforehand, and must centre on the leading of a virtuous life. Massive crowds thronged around John, much moved by what he said..
Ritual immersion in water originated in India and continues to be practised daily by the Hindus with the same devotion as it was thousands of years ago – a tradition as old as any mysteries. In Palestine the Essene rite of baptism marks a major point of departure from the dogmas of the Jewish tradition, and especially from the blood sacrifice, which was based on the crude premise that sins are forgiven if blood is shed. Ritual immersion is meant to symbolize release from all that is earthly, on the one hand, and the rebirth of the spirit in a pure body, on the other. The second Book of the Laws of Manu, which deals with the sacraments, contains the injunction to pour consecrated water over a newborn baby before severing the umbilical cord. Then a mixture of honey, clarified butter (ghee) and salt should be placed on the baby’s tongue with a small, golden spoon, while auspicious prayers are continuously recited.
The Atharva Veda contains the passage, ‘Whoever is not purified after birth with the water of the Ganges blessed by the holy invocations will be subject to as many wanderings as years he spent in impurity’ (‘wanderings’ refers to life either as a spirit or after a rebirth in another body).
John’s form of baptism seems also to have constituted a token of belonging to a certain community, members of which were clearly distinguishable from non-members by their fulfilment of various ritual preconditions. This makes it clear that the Nazarenes were an independent sect who celebrated their own version of the mysteries of an established teaching. Meanwhile, esoteric sect-leaders who attract emotional crowds while yet keeping a low public profile have always been the target of distrust and persecution by the ruling authorities. Paul faced the same hostility when he was accused by Tertullus before the governor Felix of being ‘a ringleader of the sect of the Nazarenes’ (Acts 24:5). (jesus lived in india, p.81-82)
పవిత్ర నదిలో మునక వేసి స్నానం చేయించడం ద్వారా బాప్టిజం చేయించడం అన్నది భారతీయ సంప్రదాయం నుంచి స్వీకరించిందేనని హాల్గర్ కెర్స్టెన్ అన్నాడు. నదిలో పవిత్ర స్నానం చేయడం, పుణ్యం సాధించడం, భౌతిక శరీరాన్ని పవిత్రం చేయడం అన్నది అథర్వ వేదంలో, మనువు రాసిన చట్టాల్లో ఉన్నదని వివరించాడు. అదే విధంగా నవజాత శిశువు బొడ్డుతాడు కత్తిరించేముందు ఆ శిశువుపై పవిత్రజలాన్ని చల్లి శిశువు నాలికపై బంగారు గరిటెతో తేనె, నెయ్యి, ఉప్పు మిశ్రమాన్ని ఉంచాలని కూడా భారతీయ ప్రాచీన సంప్రదాయం చెప్తున్నదని దాన్ని ఈసా తన బోధనల్లో చెప్పినట్టుగా హాల్గర్ తన గ్రంథంలో పేర్కొన్నాడు.
నొటోవిచ్ మరో విషయాన్ని కూడా పేర్కొన్నాడు. ఈసా ఎస్సేన్ తెగకు చెందిన యూదు అని.. వీరు అహింసను పాటిస్తారని, శాకాహారమే స్వీకరిస్తారని, జంతువులకు సంబంధించిన దేన్నీ వారు స్వీకరించరని పేర్కొన్నాడు. ఈ సంప్రదాయ ఆచారాలన్నీ కూడా బౌద్ధుల నుంచి స్వీకరించినవేనని నొటోవిచ్ గట్టి అభిప్రాయం. ఈ విషయంపై తాను యూరప్‌కు తిరిగి వెళ్లిన తరువాత అక్కడి చర్చి పెద్దలతో కలిసి నొటోవిచ్ ఈ అంశాలను చర్చించాడు. దీన్ని ఒక గ్రంథంగా తీసుకొని రావాలనుకుంటున్నట్టుగా తన కోరికను వెల్లడించాడు. కానీ చర్చి పెద్దలు ఆయన ప్రతిపాదనను తిరస్కరించారు. దీనివల్ల మీరు సాధించే మంచి ఏమున్నది.. మీకు డబ్బే కావాలంటే కావలసినంత డబ్బు ఇస్తాము.. ఈ విషయాన్ని మర్చిపో అని కూడా ఖండితంగా చెప్పేశారు.
Back in Europe, Notovitch tried to get in touch with several Church dignitaries of high official standing in order to tell them of his astounding discovery. The Metropolitan of Kiev advised him in the strongest terms not to publicize what he had found, but refused to give any reason. In Paris, Cardinal Rotelli explained that publication of the texts would only provide fuel for those who hated, despised or misunderstood the Gospel teachings, and would be premature at that time. At the Vatican, a close colleague of the Pope put it this way: ‘What good will printing it do? No one will see it as of any great significance, and you will make a lot of enemies. But you are still very young. If it is a question of money, I could arrange for a payment to be made in exchange for your notes, to remunerate you for the work you have done and the time it has taken…’ Notovitch rejected the offer. Only the critic, religious historian and celebrated Orientalist Ernest Renan showed a lively interest in the notes. But even then, it soon became clear to Notovitch that Renan was interested solely in using the material for his own purposes, as a member of the Académie Frangaise, and so he did not follow up his proposals. (jesus lived in India p.12).
నొటోవిచ్ ఏదోవిధంగా తన నోట్స్‌ను పుస్తకంగా తెచ్చినప్పటికీ, చర్చి ఆధిపత్యం ముందు ఆ పుస్తకం నిలువలేకపోయింది. ఈ గ్రంథంలోని ఏ అంశాన్ని కూడా బోధించడానికి కానీ, చర్చించడానికి కానీ అనుమతిని చర్చి నిరాకరించింది. ఆ సమయంలో నొటోవిచ్ కూడా శాస్త్రీయ ఆధారాలను హెమిస్ బౌద్ధారామం నుంచి సేకరించి పరిశోధకులకు చూపించలేకపోయాడు. ఆ తరువాత నొటోవిచ్ పేర్కొన్న మ్యానుస్క్రిప్టులు ఎక్కడ ఉన్నాయన్నది ఎవరికీ తెలియకుండా పోయింది. దీంతో నొటోవిచ్ గ్రంథానికి కూడా ఆధారం లేకుండా పోయింది. క్రీస్తుకు సంబంధించిన ఈ ఆధారం కూడా నిరాధారంగానే మారిపోయింది. కానీ నొటోవిచ్ పేర్కొన్న ఈ రాత ప్రతులను చూసిన వారిలో శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులైన స్వామి అభేదానంద, స్వామి త్రిగుణాతితానంద ఉన్నారు. వీరు విడివిడిగా వేర్వేరు సందర్భాలలో హెమిస్ బౌద్ధారామానికి వెళ్లి.. అక్కడ నొటోవిచ్ అధ్యయనం చేసిన మ్యానుస్క్రిప్టును చూశారు. నొటోవిచ్ నోట్‌ను స్వామి అభేదానంద ఇంగ్లిష్ లోనికి అనువదించారు. ఈ ఇంగ్లిష్ వెర్షన్ ప్రచురణ అయిన వెంటనే భారత్ లోని బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని నిషేధించింది. ఈ రాత ప్రతులను వెతకడానికి లడాక్ ప్రాంతానికి పలువురు ముస్లింలను హిందువుల వేషాల్లో పంపించింది. రాత ప్రతులను సేకరించి వాటిని నాశనం చేయడానికి ప్రయత్నించింది. స్వామి త్రిగుణాతితానంద కూడా ఈ రాత ప్రతులతో పాటు ఈసాకు సంబంధించిన రెండు పెయింటింగ్ లను కూడా చూశారు. వీరితో పాటు డాక్టర్ నికోలస్ రోరిచ్ ఈ మ్యానుస్క్రిప్టును చూశారు. ఈ విషయాన్ని ఆయన తన ది హార్ట్ ఆఫ్ ఆసియాలో ప్రస్తావించారు. 1921లో హెన్రిట్టా మెర్కిర్, హెమిస్ బౌద్ధారామాన్ని సందర్శించి ‘ “In Leh is the legend of Jesus who is called Issa, and the Monastery at Hemis holds precious documents fifteen hundred years old which tell of the days that he passed in Leh where he was joyously received and where he preached.” అని తన the World’s Attic గ్రంథంలో రాసింది. 1939లో ఎలిజబెత్ కాస్పరీ హెమిస్ కు వెళ్లినప్పుడు అక్కడి మఠాధిపతి అక్కడి కొన్ని తాళపత్రాలు చూపించి వీటిలో మీ జీసస్ ఇక్కడ ఉన్నారన్న సమాచారం ఉన్నదని తెలిపారు. 1975లో రాబర్ట్ రావిజ్ (కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆంత్రొపాలజీ ప్రొఫెసర్) హెమిస్‌కు వచ్చి అక్కడ జీసస్ తన అజ్ఞాత సంవత్సరాలను గడిపిన ప్రదేశం గురించి లామాలతో చర్చించాడు. 1970 వ దశకం చివరలో Amidst Ice and Nomads in High Asia రచయిత ఎడ్వర్డ్ నోక్ తన భార్యతో కలిసి హెమిస్‌ను సందర్శించారు. “There are manuscripts in our library that describe the journey of Jesus to the East.” అని అక్కడి బౌద్ధ భిక్షువు తనతో చెప్పినట్టుగా ఆయన రాశారు. గత శతాబ్దపు చివరలో మొరావియన్ మిషనరీ కార్ల్ మార్క్స్, నొటోవిచ్ రాసిన తాళపత్రాల గురించి తాను రాసుకున్న డైరీలు లభించాయి. ఇప్పుడు అవి మొరావియన్ మిషన్ మ్యూజియంలో ఉన్నాయి. కానీ అందులోనుంచి నొటోవిచ్‌కు సంబంధించిన కాగితాలు మాయమయ్యాయి. ఇప్పుడు వాటి ఉనికిని అంగీకరించే పరిస్థితి లేదు. అయితే.. ఆ కాగితాలు మాయమయ్యే ముందు యూరోపియన్ పరిశోధకుడు ఒకరు వాటిని ఫోటో తీసి పబ్లిక్ ముందు ఉంచారు. జీసస్ జీవితానికి సంబంధించిన ఇండియా, చైనా, ఈజిప్ట్, అరేబియాల నుంచి సేకరించిన 63 మ్యానుస్క్రిప్టులు వాటికన్ లైబ్రరీలో ఉన్నాయని కూడా నొటోవిచ్ పేర్కొన్నాడు. 1812 లో మీర్ ఇజ్జత్ ఉల్లా అనే పర్షియన్‌ను ఈస్ట్ ఇండియా కంపెనీ లడాక్, సెంట్రల్ ఆసియాకు పంపించింది. ఆయన తన Travels in Central Asia: లో “They keep sculptured representations of departed saints, prophets and lamas in their temples for contemplation. Some of these figures are said to represent a certain prophet who is living in the heavens, which would appear to point to Jesus Christ.” అని రాశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బిపిన్ చంద్రపాల్ తన అటో బయోగ్రఫీలో రామకృష్ణ పరమహంస శిష్యుడైన విజయకృష్ణ గోస్వామి గురించి రాశారు. ఆయన చాలా కాలం పాటు ఆరావళి పర్వతాల్లో ఉన్నారని ఆ సమయంలో ఆయన పలువురు నాథయోగులను కలిశారని చెప్పారు. ఆ సన్యాసులు తమ సంప్రదాయంలోని గొప్ప గురువులలో ఒకరైన ఈశానాథ్ గురించి ఆయనతో మాట్లాడారట. తమ పవిత్ర గ్రంథాలలో ఒకటైన నాథ నామావళిలో నమోదైన ఈసా జీవిత చరిత్రను చదివి వినిపించారు. “It is also their conjecture that Jesus Christ and this Isha Nath are one and the same person.” Perhaps they were the yogis with which Isha lived either before his return to Israel or after his secret return to India after his ascension. Here is the relevant portion of the Nathanamavali: ఈసాయే క్రీస్తు అని నాథయోగులు భావించినట్టుగా బిపిన్ చంద్రపాల్ పేర్కొన్నారు. ఉత్తర భారతదేశంలో రిషికేశ్ కు ఎగువన ఒక గంట సేపు నడిస్తే గంగానది తీరంలో వశిష్ట గుహ అన్న పేరుతో ఒక గుహ ఉన్నది. ఈ గుహ నుంచి అయిదు నిమిషాలు కాలినడకన వెళ్తే.. అక్కడ మరో గుహ ఉన్నది. దీన్ని జీసస్ గుహ అని పిలుస్తారు. ఇక్కడి నుంచి హిమాలయాలు, గంగానది అద్భుతంగా కనిపిస్తాయి. ఈ గుహను స్వామి రామతీర్థ, స్వామి రామదాస్ (పాప) వేర్వేరు సమయాలలో సందర్శించారు. ఈ గుహ గురించి మరికొన్ని వివరాలను స్వామి నిర్మలానంద గిరి రాశారు. పరమహంస యోగానంద జీసస్‌ను చూసినట్టుగా చెప్తారు.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
