
ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.
***
“మేము సమోసా నుండి మాట్లాడుతున్నాము.”
“సమోసా.. అదేంటండీ?”
“తినేది కాదండీ. మీరు వినలేదా? సరస మోసగాళ్ల సాహితీ వేదిక.. చిన్నగా సమోసా.”
“శభాష్!”
“మీరు మాకు ఓ పుస్తకం వ్రాయాలి.”
“ఎందుకు?”
“ఇంత అమాయకులైతే ఎలా సార్?”
“చెప్పండి.”
“మోసం చెయ్యటం ఎలా? అది మీ పుస్తకం టైటిల్. సమోసా వారు ప్రచురిస్తారు!”
***
చురకలు వేస్తూ, చమక్కులు చూపిస్తూ, చేదు నిజాలు తీపిగా చెప్తూ, హాయిగా చదివింపజేసే నవల ‘మోసం చెయ్యటం ఎలా?’
వేదాంతం శ్రీపతిశర్మ రచించిన హాస్య నవల… మోసం చెయ్యటం ఎలా?’
చదవండి..చదివించండి..కలసి నవ్వుకోండి.
వచ్చే వారం నుంచే..
