[శ్రీమతి పుట్టి నాగలక్ష్మి రచించిన ‘మౌనం-మౌనం’ అనే కవితని అందిస్తున్నాము.]
మౌనం కాదు నిశ్శబ్దం
మౌనం భావ పరంపర
మౌనం కాదు శూన్యం
మౌనం పరిశీలనం
మౌనం కాదు ధ్యానం
మౌనం పరిశోధనాత్మకం
మౌనం ఎదగడానికో ఆలంబన
మౌనం ఉన్నతశిఖరాలకో నిచ్చెన
మౌనం అవమానాగ్నినంగీకరించే
అర్ధాంగీకారం కాదు
తలొంచుకునే పూర్ణాంగీకారం కాదు
మౌనంగా ఉన్నవారు
మౌనమునులు కారు
ధనుర్ధారులు వారు
వారివి ధనుష్టంకారాలు
కాదు కాదు
మౌన ధనుష్టంకారాలు..
