Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మృత్తికానందం

ట్టిలోనే పెరిగి

మట్టిలోనే కలిసే మనం

మట్టి పరిమళాన్ని ఆస్వాదించలేకపోతున్నాం!

ప్రకృతి సోయగాన్ని

వికృతం చేస్తూ వినోదిస్తున్నాం!

పర్యావరణ కాలుష్యాన్ని విస్తరించి

భవిష్యత్తరాల భవితవ్యం

ప్రశ్నార్థకం చేస్తున్నాం!

విఘ్ననాయకుణ్ణి విష రసాయనాలతో

తయారు చేసి, కృత్రిమ వర్ణాలతో

అలంకరిస్తున్నాం!

ఉత్సవాల పేరుతో వెర్రితలలు వేస్తున్నాం!

గణేశ నిమజ్జనంతో

జీవజలాను కలుషితం చేస్తున్నాం!

విజ్ఞతతో ఆలోచించి

వివేకవంతమైన నిర్ణయం తీసుకుందాం!

మట్టి తోనే గణనాథుని తయారు చేద్దాం!

సహజ సుందరమైన రంగుల్ని అద్దుదాం!

మృత్తికను మృత జీవిని చెయ్యకుండా

మృత్తికానందం పొందుదాం!

భక్తి పారవశ్యంలో ఓలలాడుదాం!

Exit mobile version