Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ముక్కలైన మనుషుల కోసం!

[‘ముక్కలైన మనుషుల కోసం!’ అనే అనువాద కవితని అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. మూలం నైజీరియన్ కవి క్వాబనే ఫోలి.]

ఒకటి చెప్పు! నువ్వు కూడా ఒక చికిత్సకుడవని ఎలా తెలిసిందేంటి నీకు?
ఎలా నయం చేస్తావసలు ఇంతమంది దుఃఖాలను?
*
ఎందుకంటే, నేను తరచూ
ముక్కలైపోయిన మనుషుల ప్రేమలో పడుతూ ఉంటాను.
వాళ్లందరితోనే కదా నేను ఉండేది?
*
ఓహో మరి నువ్వు ఒంటరిగా ఎందుకు ఉన్నట్లో?
నీకు ఎందుకు ఇంత ఒంటరితనం మరి?
*
ఎందుకంటే, నేను కూడా మిగతా వాళ్ళ లాగా,
లోలోపల ధ్వంసమై ముక్కలైపోయి ఉన్న వాణ్ణే!
అందుకే నిత్యం నాతో నేనే ప్రేమలో పడుతూ ఉంటాను!
నన్ను నేను ఎలా నయం చేసుకుంటూ ఉంటానో,
ఆ చికిత్స రుచి నేను కూడా చూడాలిగా మరి?

మూలం: క్వాబనే ఫోలి, నైజీరియన్ కవి.
అనువాదం: గీతాంజలి.

క్వాబనే ఫోలి, నైజీరియన్ కవి

Exit mobile version