Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నా కన్నీటితో కాస్తైనా

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘నా కన్నీటితో కాస్తైనా’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

గుండెలో సాగరమంత బాధ
కన్నీటి కడవలతో ఎంత తోడినా
విషాద సంద్రాన్ని
వీసమంతైన కదిలించగలదా
గొంతు దాటి రానంటున్న
ఆవేదనను అణువైనా
మరిపించగలదా
కానీ.. నేస్తమా
నేనో సాయం చేయగలను
నా రెండు కన్నులనూ
నీవిగా చేయగలను
నీ ఎదలోని బాధను
నా కన్నీటితో
కాస్తైనా చెరిపేయలన్నదే నా తపన
తల్లడిల్లిన గుండెకు ఆలంబన కావాలన్నదే
నా ఆలోచన

Exit mobile version