
ప్రముఖ రచయిత శ్రీ సి. ఎన్. చంద్రశేఖర్ గారు రచించిన ‘నా మొదటి నేస్తం.. మా అమ్మ’ అనే నవలను కొత్త ధారావాహికగా అందిస్తున్నాము.
~
అమ్మతో అనుబంధం అంటే కేవలం ఆమె నుంచి ప్రేమానురాగాలను పొందడమే కాదు.. ఆమె బిడ్డగా మన బాధ్యతలను నిర్వర్తించడం, కుటుంబ బంధాలను పదిలంగా నిలుపుకోవడం కూడా!
శ్రీ సి. ఎన్. చంద్రశేఖర్ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని, తండ్రి నుంచి నేర్చుకున్న జీవిత విలువలను, కుటుంబం పట్ల, బంధుమిత్రుల పట్ల తాను నిర్వర్తించిన బాధ్యతలను హృద్యంగా అక్షరబద్ధం చేసిన నవల ‘నా మొదటి నేస్తం.. మా అమ్మ’.
తన జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలను ఎలాంటి కల్పనలకూ తావివ్వకుండా యథాతథంగా చిత్రించిన ఈ నవల, బాధ్యతలను స్వీకరించడంలోనూ, వాటిని నిర్వర్తించడంలోనూ ఎంతటి ఆనందం ఉంటుందో భావితరాలకు తెలియజేసే ఒక దిక్సూచి.
ప్రతి చదువరికీ స్ఫూర్తిదాయకమై, లుప్తమౌతున్న సామాజిక, కుటుంబ, వ్యక్తిగత విలువలను, బహువిధ బాధ్యతలను, ఓర్పు, సహనాల విలువలను, సంతానం పట్ల బాధ్యతాయుతమైన పెంపకమూ వాటి ఫలాలను మరపురాని ప్రత్యేక శైలిలో అందించిన ఈ నవల ప్రతి మనసు మూలాలలో చెరగని ముద్ర వేస్తుందనడంలో సందేహం లేదు.
~
చదవండి.. చదివించండి..
సంచికలో..
వచ్చే వారం నుండి..
‘నా మొదటి నేస్తం.. మా అమ్మ’.
