[గిద్దలూరు సాయి కిషోర్ రచించిన ‘నాన్నే నాకు ఓ బిరుదు..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
నాన్న అనే మాట విలువైన ఓ బిరుదే
నాన్న అనే పిలుపు పెదాలకు అందనివే
నాన్న అనే పిలుపు ధైర్యమే
నాన్న అనే పిలుపుకు సంతోషము
నాన్న అనే పిలుపుకు ఆనందమే
కూతుళ్ళతో కోడళ్ళలో
ఆ పిలుపే ఓ మధురమే
నాన్న ప్రొద్దుననక పోయి
రాతిరి సంధ్య సమయానికి తిరిగొస్తాడు
నాన్న పిల్లల భవిష్యత్తు కోసం ఆరా తీస్తాడు
ఎందుకో నాన్న తినలేకున్న
తిన్నానని చెప్తాడు
ఎందుకో మరి నాన్న అబద్ధాలు చెప్తాడు
పిల్లల కోసం ప్రతిక్షణం
శ్రమతో శ్రమిస్తాడు నాన్న
నాన్నకు పురస్కారాల కన్నా
పిల్లల క్షేమమే ఎక్కువ
బరువు, బాధ్యతలంటే
పిల్లలకు నేర్పిస్తాడు
పిల్లల కోసం
నాన్న చాలా వెనకబడ్డాడు.
గిద్దలూరు సాయి కిషోర్ 2004 జూన్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జన్మించారు. గిద్దలూరు మురళి, లక్ష్మి వీరి తల్లిదండ్రులు. గిద్దలూరు నందిని వీరి చెల్లెలు. ఆమె చిత్రలేఖనంలో ప్రతిభ కనబరుస్తున్నారు. సాయి కిషోర్ బాల్యం నుంచే సాహిత్య ప్రపంచం వైపు ఆకర్షితుడయ్యారు. తాత్వికత, సమాజం, ప్రకృతి, కాలం వంటి అంశాలను తన కలం ద్వారా ప్రతిబింబింపచేస్తున్నారు. కవిత్వం, కథలు, తాత్విక ఆలోచనలు వీటన్నిటిలోనూ ఆయనకు ప్రత్యేక ప్రతిభ ఉంది. వీరి పదాలు సున్నితమైన భావవ్యక్తీకరణతో పాఠకుడిని ఆలోచనలోకి నడిపిస్తాయి. తెలుగు భాషా సౌందర్యాన్ని ఆధునిక భావాలతో మేళవించడం ఆయన రచనల ముఖ్య లక్ష్యం.
సాయి కిషోర్, అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఫౌండేషన్లో ప్రచార కార్యదర్శిగా తెలుగు భాషా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. సాహిత్యంతో పాటు విజ్ఞానం, విద్య, సాంకేతికత పట్ల కూడా ఆయనకు ఆసక్తి ఉంది. వీరి సృజనలో “ఆశయమే పిడికిలి”, “నాన్నే నాకు ఓ బిరుదు”, “మట్టే మనిషోయ్”, “కాల ప్రవాహం” వంటి రచనలు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాయి.
