Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-33

[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

లెజెండ్ అంటే?

‘లెజెండ్’ అనే పదాన్ని మనం ఎల్లప్పుడూ ప్రేమగా గుర్తుంచుకునే వ్యక్తుల కోసం, దశాబ్దాలుగా వారి కృషి నిలిచి ఉన్న వ్యక్తుల కోసం ఉపయోగిస్తాం. ఈ పదానికి మరో అర్థం కూడా ఉంది, దానిని నేను ఓ మామూలు మనిషి నుంచి తెలుసుకున్నాను. అతడు పిల్లనగ్రోవిలు అమ్ముకునే, అణకువ గల ఓ సాధారణ వ్యక్తి.

కొన్ని సంవత్సరాల క్రితం, ఒక యువకుడు వేణువులు అమ్ముకుంటూ, మెహబూబా సినిమాలోని ‘మేరే నైనా సావన్ భాదో’’  పాట వాయించడం విన్నాను. అతను మా ఇంటి పక్కనుండి మా వీధిలో నడుస్తున్నాడు. నేను అతన్ని పిలిచి రెండో అంతస్తుకి రమ్మన్నాను.

అతను వేణువుని అద్భుతంగా వాయిస్తున్నాడని, అతనికి బహుమతి ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పాను. అతనికి 50 రూపాయలు కానుకగా ఇచ్చాను. అతను ఆ డబ్బును తీసుకున్నాడు. కానీ, నేనో ఫ్లూట్ కొనబోవడం లేదని గ్రహించి ఆశ్చర్యపోయాడు. అతని కాళ్ళకి చెప్పులు లేవని గమనించాను.

ఓ వేణువు తీసుకోమని అతను పట్టుబట్టాడు, తీసుకోక తప్పలేదు. అతను తన వృత్తిలో గర్వించదగిన వ్యక్తి. కష్టపడి తన జీవనోపాధిని సంపాదించుకుంటున్నాడు. వేణువులను అమ్మడానికి వీధిలో అతను వాయిస్తున్న పాట రచయిత, సంగీత స్వరకర్త, గాయకుడి పేరు తెలుసా అని అతనిని అడిగాను. అతను తెలియదని బదులిచ్చాడు.

నేను అతన్ని లోపలికి రమ్మని చెప్పి మా లివింగ్ రూమ్‌కి తీసుకెళ్లాను, అక్కడ అలమారలో నాన్న ట్రోఫీలు, అవార్డులెన్నో ప్రదర్శనగా ఉన్నాయి. నాన్న, ఆయన సహోద్యోగుల ఆల్బమ్‌ను తెరిచి నాన్నది, ఆర్‌డి బర్మన్ గారిది, అనేక ఇతర ‘దిగ్గజాల’ ఫోటోలను అతనికి చూపించాను. అతను వారి గురించి వినలేదని, వారి ఫోటోలను చూడలేదని, కానీ రేడియోలో పాట విని నేర్చుకున్నానని ఒప్పుకున్నాడు.

నేను అతనికి చూపించిన ప్రతి ఫోటోను చేత్తో తాకి, వారి ఆశీర్వాదం కోరుతున్నట్లుగా, ఆ చేతిని తన హృదయంపై ఉంచుకున్నాడు. అతని ఈ చర్య నన్ను కదిలించింది. ఎందుకలా చేస్తున్నావని అడిగాను. అతను, “సాబ్, ఇన్ లోగోం కీ వజహ్ సే హమ్ తీన్ వక్త్ కీ రోటీ ఖాతే హై” (ఈ వ్యక్తుల వల్లే మాకు మూడు పూటలా భోజనం లభిస్తుంది) అని జవాబిచ్చాడు.

నాన్న సినిమాలలో నాకు బాగా ఇష్టమైనవి

సినిమా కథకు స్వరకర్తలు, గాయకులు, దర్శకులు, నటులు, సంగీతకారులతో కలిసి ఆనంద్ బక్షి సృష్టించిన పాటలకు న్యాయం చేయాలంటే, ఒకటి కంటే ఎక్కువ సంపుటాలను ప్రచురించాల్సిన అవసరం ఉంటుందని నేను నొక్కి చెబుతున్నాను. నాన్న పాటల గురించి బాగా అర్థం చేసుకోవడానికి, క్రింద అందించిన కొన్ని సినిమాల పేర్లను చూడవచ్చు, ఆ సినిమాలోని పాటలను వినవచ్చు. ఇవి  ఆయన పాటలు రాసిన దాదాపు 630 కంటే ఎక్కువ చిత్రాల నుండి నాకు ఇష్టమైన వాటిలో కొన్ని మాత్రమే. ఈ చిత్రాలను చూడమని నేను ఎందుకు సూచిస్తున్నాను? ఎందుకంటే ఒక గీత రచయిత గొప్పతనం, సినిమా కథ సందర్భంలో ఉత్తమంగా ప్రశంసలందుకుంటుంది.

1959

భలా అద్మీ, సిఐడి గర్ల్, ఏక్ అర్మాన్ మేరా, లాల్ నిషాన్, మైనే జీనా సీఖ్ లియా.

1960వ దశకం

మెహలోం కే ఖ్వాబ్, జాసూస్, జమీన్ కే తారే, రజియా సుల్తానా, వారెంట్, బంకే సావారియా, ఆయే దిన్ బహార్ కే, కాలా సముందర్, జబ్ సే తుమే దేఖా హై, ఫూల్ బనే అంగారే, మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే, హిమాలయ్ కీ గోద్ మే, తీస్రా కౌన్, ఆస్రా, చోటా భాయ్, దేవర్, ఆమ్నే సామ్నే, చందన్ కా పల్నా, నైట్ ఇన్ లండన్‌, తక్దీర్, రాజా ఔర్ రంక్, అన్జానా, ఆయా సావన్ ఝూమ్ కే, జీవన్ కీ రాహ్, జిగ్రీ దోస్త్, మహల్, సాజన్, మెహందీ లగీ మేరే హాత్, జబ్ జబ్ ఫూల్ ఖిలే, మిలన్, ఫర్జ్, ఆరాధన, దో రాస్తే.

1970వ దశకం

ఆన్ మిలో సజ్నా, గీత్, ఇష్క్ పర్ జోర్ నహీ, జీవన్ మృత్యు, కటీ పతంగ్, అమర్ ప్రేమ్, ఖిలోనా, మై లవ్, మేరే హమ్‌సఫర్, షరాఫత్, ద ట్రైన్, ఆప్ ఆయే బహార్ ఆయీ, దుష్మన్, హాథీ మేరే సాథీ, హరే రామ హరే కృష్ణ, మై  సుందర్ హూఁ, మర్యాదా, మెహబూబ్ కీ మెహందీ, మేరా గాఁవ్ మేరా దేశ్, నయా జమానా, పరాయ ధన్, ఉప్‌హార్, అనురాగ్, అప్నా దేశ్, మోమీ కి గుడియా, జవానీ దివానీ, రాజా జానీ, సీతా ఆర్ గీతా, జిందగీ జిందగీ, బాబీ, హీరా పన్నా, జీల్ కి ఉస్ పార్, జుగ్ను, కచ్ఛే ధాగే, లోఫర్, నమక్ హరాం, రాజా రాణి, మంచాలి, షరీఫ్ బద్మాష్, ఆప్ కీ కసమ్, అజ్‍నబీ, దోస్త్, మజ్‌బూర్, ప్రేమ్ నగర్, రోటీ, చుప్కే చుప్కే, జూలీ, ప్రతిజ్ఞ, ప్రేమ్ కహానీ, షోలే, ఆప్ బీతీ, బాలికా వధు, బరూద్, బైరాగ్, చరస్, మహా చోర్, మెహబూబా, అమర్ అక్బర్ ఆంథోనీ, అనురోధ్, అప్నాపన్, ధరమ్ వీర్, డ్రీమ్ గర్ల్, ముక్తి, యేహీ హై జిందగీ, ఆహుతీ, సత్యం శివం సుందరం, ఆజాద్, దిల్ ఔర్ దీవార్, మై తులసీ తేరే ఆంగన్ కీ, పతి పత్ని ఔర్ వో, షాలిమార్, గౌతమ్ గోవింద, జుర్మానా, ఖాళీ ఘటా, మిస్టర్ నట్వర్‌లాల్, సర్గం, సుహాగ్, ది గ్రేట్ గ్యాంబ్లర్.

1980వ దశకం

ఆప్ కే దీవానే, ఆశా, ఆస్ పాస్, అబ్దుల్లా, దోస్తానా, హమ్ పాంచ్, జుదాయి, కర్జ్, పతిత, షాన్, ఏక్ దుజే కే లియే, లవ్ స్టోరీ, నసీబ్, రాకీ, బేమిసాల్, దేశ్ ప్రేమ్నీ, గజబ్, రాజ్‌పుత్, శక్తి, తేరీ కసమ్, విధాత, అంధా కానూన్, అర్పన్, అవతార్, బేతాబ్, కూలీ, హీరో, లవర్స్, నాస్తిక్, వో 7 దిన్, జరా సీ జిందగీ, సోహ్ని మహివాల్, ఆర్ పార్, మేరీ జంగ్, యుద్ధ్, అమృత్, కర్మ, నామ్, నాగిన్, సిందూర్, షహెన్‍షా, చాల్‌బాజ్, చాంద్‌నీ, రామ్ లఖన్, త్రిదేవ్, ఆవార్‍గీ, అగ్నిపథ్.

1990వ దశకం

అకేలా, పతి పత్నీ ఆర్ తవైఫ్, హమ్, లమ్హే, సౌదాగర్, అంగార్, హీర్ రాంఝా, ఖుదా గవా, క్షత్రియ, పరంపర, విశ్వత్మా, డర్, గుమ్రాహ్, ఖల్ నాయక్, సాహిబాన్, మోహ్రా, దిల్‍వాలే దుల్హానియా లే జాయేంగే, రామ్ జానే, త్రిమూర్తి, ధున్, జాన్, రాజ్‌కుమార్, తెరే మేరే సప్నే, అంఖోన్ మే తుమ్ హో, దీవానా మస్తానా, దిల్ తో పాగల్ హై, గులామ్-ఈ-ముస్తఫా, గుప్త్, పర్‌దేశ్, దుష్మన్, జబ్ ప్యార్ కిసీసే హోతా హై, జఖ్మ్, ఆర్జూ, దిల్ క్యా కరే, కచ్ఛే ధాగే, తాళ్, లవ్ యూ హమేషా.

2000, 2001, 2002

హద్ కర్ ది ఆప్నే, యే రాస్తే హై ప్యార్ కే, నాయక్, ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్, రాహుల్, రాజు చాచా, మొహబ్బతేఁ, గదర్: ఏక్ ప్రేమ్ కథ, అశోక (ఒక పాట), యాదేఁ, ముఝ్ సే దోస్తీ కరోగే, క్రాంతి, కిత్నే దూర్ కిత్నా పాస్, న తుమ్ జానో న హమ్, ద హీరో.

2012

యే జో మొహబ్బత్ హై (ఒక పాట)

విడుదలైన, విడుదల కాని చిత్రాల నుండి కొన్ని విడుదల కాని పాటలు కూడా ఉన్నాయి, అవి మీ అందరికీ చెందినవి కాబట్టి, వాటిని నాన్న పేరిట YouTube ఛానెల్‌లో శ్రోతల కోసం అందుబాటులో ఉంచాను.

***

ప్రియమైన పాఠకులారా! నాకు శక్తినిచ్చే ఓ అంశంతో నేను మీకు వీడ్కోలు పలుకుతున్నాను, అది నాన్న స్టేట్‌మెంట్. పరిస్థితి లేదా స్థితిగతులు నన్ను బాధపెట్టినప్పుడల్లా – రాత్రి లేదా తెల్లవారుజామున ప్రార్థనగా నేను ఈ వాక్యాన్ని నేను చదువుకుంటాను:

“నా స్థితిగతుల కంటే ఉన్నతమైనది, జీవితంలోని ఏ పరిస్థితి కన్నా బలమైనది నాలో ఏదో ఉంది.”

(మేరే భీతర్ కుఛ్ హై – జో మేరే హాలాత్ ఔర్ జిందగీ కీ కిసీ బీ పరిస్థితి సే బెహతర్ హై.)

రాకేష్ ఆనంద్ బక్షి

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version