Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-36

[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

 

కృతజ్ఞతలు

మా తల్లిదండ్రులు గతించిన తర్వాత నాకు అమ్మానాన్నలా నిలిచినందుకు అన్నయ్య గోగికి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను; అక్క పప్పీ, చెల్లి రాణి, మా జీవితాలకు మద్దతుగా నిలిచిన మరో రెండు స్తంభాలు. నిధి, రోహిత్, నైసా, ఆదిత్య, చాందిని, కహిల్, దివ్య, కరణ్, శ్రేయ, సిద్ధాంత్, వినయ్ దత్, ఇంకా సంజీవ్ బాలి నుండి మాకు లభించే ఆప్యాయతకు, మద్దతుకు మేము కృతజ్ఞులం.

పందొమ్మిది సంవత్సరాలకు పైగా చేసిన ఈ ప్రయత్నం నేను కృతజ్ఞతా ఋణం తీర్చుకునే మార్గం. నాన్న నుండి నాకు లభించిన ప్రతిదానికీ – నేను, ఇంకా లక్షలాది మంది ఇతరులు ఆయన సాహిత్యం నుండి పొందుతున్న స్ఫూర్తికీ ఋణపడి ఉన్నాము. నేను ఉత్తమమైన కొడుకుని కాదు, కాబట్టి ఈ పుస్తకం, ఇంకా http://www.anandbakshi.com వెబ్‌సైట్ నాన్నకి నా చిన్న నివాళులు. ఆయన మా కోసం చేసిన ప్రతిదానికీ నేను ఆయనకు చెల్లించే మూల్యం. పిల్లలమైన మాకు నాన్న, ‘మేరీ మా జీ కా ప్యార్, ఫూలోం కి చావోఁ థీ’ అని చెప్పేవారు. మా అందరికీ, నాన్న ప్రేమ – చల్లని పూలపందిరి క్రింద దొరికే ప్రశాంతమైన నీడ లాంటిది.

ఈ రచన ద్వారా నా కుటుంబానికి, సన్నిహితులకు, ముఖ్యంగా నాన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారి ప్రేమ నాన్న సాహిత్యాన్ని, పాటలను సజీవంగా ఉంచుతుంది. మా వెబ్‌సైట్ కోసం తన డొమైన్ పేరును మాకు బహుమతిగా ఇచ్చిన వినయ్ ప్రజాపతికి ధన్యవాదాలు. ఆనంద్ బక్షిని కవిత్వం రాయడానికి ప్రోత్సహించిన స్నేహితుడు, గుర్తింపు లేని నాయకుడు, కవి, సంపాదకుడు బిస్మిల్ సయీది (టోంక్, ఢిల్లీ) గారికి, మరొక ముఖ్యమైన వ్యక్తి, నాన్నకు ఆత్మీయ మిత్రుడు, వెస్ట్రన్ రైల్వే టికెట్ కలెక్టర్ చితర్ మాల్ స్వరూప్‌కు ఈ పుస్తకం అంకితం చేస్తున్నాను. నాన్న వ్యక్తిగత, వృత్తి జీవితానికీ; మా కుటుంబానికీ ఆధార స్తంభంగా నిలిచిన మా అమ్మ కమలా మోహన్ బక్షికి కృతజ్ఞతలు.

ఈ పుస్తకం కోసం తమ తమ జ్ఞాపకాలను పంచుకున్న – నాన్న స్నేహితుడు, నిర్మాతదర్శకుడు సుభాష్ ఘాయ్; నా బంధువులు అనితా దత్ చోప్రా, కవి నీరా బక్షి, వారి తల్లి శుభ్ ఖేమ్ దత్ గారికి కృతజ్ఞతలు. రచయిత, ఫోటోగ్రాఫర్ షిరాజ్ హసన్‌కి, రావల్పిండిలో ఇప్పటికీ ఉన్న మా పూర్వీకుల ఇంటి ఛాయాచిత్రాల పంపిన పాకిస్తాన్‌కి చెందిన వసీం అల్తాఫ్‌కి; ఈ రచన కోసం మాకు అవసరమైన వివిధ పత్రాలను, చిత్రాలను భద్రపరిచి ఉంచినందుకు మా వ్యక్తిగత సహాయకుడు రాజేంద్ర బంగేరాకి; కొన్ని ఉర్దూ కవితలు/లేఖలను అనువదించినందుకు యూనుస్ ఖాన్, షీబా లతీఫ్, జోహ్రా జావేద్, మరియా, ఉమర్ రియాజ్ లకు; గుజరాతీ ఉత్తర ప్రత్యుత్తరాలను అనువదించినందుకు సుశ్రుత్ మన్కడ్‌కు; ఉర్దూ నుండి అనువదించినందుకు దివంగత భాయ్ మదన్ మోహన్ సింగ్ చిబ్బర్ గారికి; ఉద్వేగభరితమైన రచయిత, లివింగ్ లెజెండ్ అలీ పీటర్ జాన్ గారికి కృతజ్ఞతలు. తన ఆప్యాయతకు గీత రచయిత సమీర్ అంజాన్‌కు ధన్యవాదాలు.

ఇంకా ఆనంద్ బక్షి అభిమానులకు; గీత రచయిత విజయ్ అకేలా; దేవమణి పాండే; స్పాటిఫైకి చెందిన పాడీ; ప్రఖ్యాత చలనచిత్ర పాటల చరిత్రకారులు, రచయితలు డాక్టర్ రాజీవ్ ఎం. విజయకర్, మానెక్ ప్రేమ్‌చంద్ గార్లకు; కవి, మిత్రుడు హర్మీందర్ సింగ్ చావ్లా; వికాస్ మన్హాస్; ఎడిటర్ గంగా శరణ్ సింగ్‌ గార్లకు; హిందీ అనువాదాలకు రేడియో ప్రెజెంటర్ యూనస్ ఖాన్; రాకేష్ మోడీ, సంగీత యాదవ్; ఆనంద్ దేశాయ్; చందు బర్దన్‌వాలా; హేమ్ చంద్; కవి మనోహర్ మొహబ్బత్ అయ్యర్; అజయ్ పౌండరిక్; ఆదిత్య పంత్ లకు కృతజ్ఞతలు. ఆనంద్ బక్షి రచనలను ఎక్కువగా ప్రచురించిన సారెగామా తరఫున గోపాల్ పట్వాల్, రష్నా పోచ్‌ఖానావాలా గార్లకు; యుకెలోని పెర్ఫార్మింగ్ రైట్ సొసైటీకి చెందిన జతనీల్ బెనర్జీ; ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్ సొసైటీ నుండి రాకేష్ నిగమ్, మనీష్ జాని, రుంపా బెనర్జీ లకు. ఇంకా అనేక మందికి కృతజ్ఞతలు.. కొందరికి వారి మార్గదర్శకత్వం కోసం, కొందరికి వారి జ్ఞానం కోసం, కొందరికి వారి ప్రోత్సాహం కోసం!! నాన్న సాహిత్యాన్ని పాడడం ద్వారా, ఆయన పాటలను, ఆయనను సజీవంగా నిలిపిన కోసం అసంఖ్యాకమైన ఇతరులకు నా ధన్యవాదాలు. ఆనంద్ బక్షి హస్రత్ సాబ్ పంచుకున్న అనురాగ బంధానికి గుర్తుగా, ఉర్దూ నుండి ఇంగ్లీషులోకి చేసిన అనువాదాలు సరైనవని నిర్ధారించినందుకు కవి కిశ్వరి జైపురి (హస్రత్ సాబ్ కుమార్తె) గారికి అనేక ధన్యవాదాలు.

2013 నుండి నన్ను ప్రోత్సహిస్తూ, ఈ పుస్తకానికి బీజాలు వేసిన నా స్నేహితుడు, రచయిత, ఎడిటర్ శంతను రే చౌదరికి; నా ఆలోచనలను సమీక్షించినందుకు, నా రాతప్రతిని సవరించి ప్రచురితమైన పుస్తకంగా మార్చినందుకు, అలాగే ఈ విషయం పట్ల వారి ఉత్సాహానికి పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా సీనియర్ కమిషనింగ్ ఎడిటర్ గుర్వీన్ చద్దా గారికి, ఎడిటర్ వినీత్ గిల్ గారికి నా కృతజ్ఞతలు. ఎడిటర్లు మా రచయితలను సంపూర్ణం చేసి ప్రోత్సహిస్తారు. ఒప్పందాలను చర్చించే స్నేహపూర్వక పద్ధతికి, నాలాంటి రచయితలు అర్థం చేసుకోవడానికి కష్టంగా భావించే పదాలను వివరించడానికి, చర్చించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా రచనా ప్రతాప్‌కి ధన్యవాదాలు. అందమైన కవర్ పేజీకి సహకరించిన అహ్లావత్ గుంజన్ (మరియు జితేష్ పిళ్ళై, ఎడిటర్, ఫిల్మ్‌ఫేర్) కు, అందమైన డిజైన్, ఈస్తటిక్ సెన్స్ కోసం అకాంక్ష శర్మకి ధన్యవాదాలు.

ఈ స్నేహితులు, సహచరులు లేకుండా మా జీవితాలు సంపూర్ణంగా లేదా హితవుగా ఉండేవి కావు: రఘు, హర్ష్, పరమజిత్, వీణ, బడ్డీ రోహిత్, బడ్డీ స్వామి, జయంతి, బడ్డీ అంబి, రామన్, సత్య, రీతు, షోమీ, మానెక్, దిల్నాజ్, దిన్యార్, టోనీ, అనుపమ, సోను, ప్రియాంక, మేఘన, బెనైఫర్, ఖుస్రో,  సిద్ధి, బడ్డీ కనిక, అకీరా, ప్రియాంక, అభయ్, రిషి, శశి, పూజ, చంగీజ్, శ్యామ్, మయూర, వివేక్, అంకిత, హిమాంశు, మనోజ్, విద్యుత్, అక్షిత, నిశీల్, అయేషా, సిడ్నీ, అన్నలీస్, డాక్టర్ ఆప్టే, అమీన్, షార్లెట్, డాక్టర్ ఇషాని, బాబి, అమిత్, రోహన్, విద్యున్, టోనీ, మీను, శుశ్రుత్, భవేష్, రుస్తుం, నందు, శరద్, సాకిబ్, సబీనా, శాచి, సుమంత్, బాబుజీ, విమల. ఈ పుస్తకానికి, నా జీవితానికి ఇంత దయతో దోహదపడిన ముఖ్యమైన వ్యక్తుల పేర్లను ప్రస్తావించకపోయి ఉంటే, అందుకు నా క్షమాపణలు, దయచేసి నన్ను మన్నించండి.

నాన్నకు ఎంతో స్ఫూర్తినిచ్చిన, నా జీవితంలో సగం సమయం వరకు నాలో ప్రేరణ నింపిన అద్భుతమైన పత్రిక ‘రీడర్స్ డైజెస్ట్’ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. స్వీడిష్ నటి ఇంగ్రిడ్ బెర్గ్‌మాన్‌కు ధన్యవాదాలు. నేను ఆమె జీవిత చరిత్రను 2002 లో చదివాను, ఆ పుస్తకం – జీవిత చరిత్రలు, రచన, చలనచిత్ర నిర్మాణం, సినిమా పట్ల నా అభిరుచి, ప్రేమను మరింత పెంచింది. అద్భుతమైన ఇంటర్నెట్‌కు, దాని విస్తారమైన వనరులకు కూడా ధన్యవాదాలు. అది లేకపోతే మన జీవితాలు ఎలా ఉండేవో!

తమ కలలను, ఆశయాలను వదులుకోవడానికి నిరాకరించే వారందరికీ ఈ రచన అంకితం. ఎవరూ మద్దతు ఇవ్వకపోయినా. ఆనంద్ బక్షి జీవితం మీ కలలను నమ్మడానికి ఒక వ్యక్తి మాత్రమే అవసరమని ఋజువు చేసింది, ఆ వ్యక్తి మీరే. దశాబ్దాల క్రితం బక్షి బంబై తీరానికి చేరుకున్నట్లుగా, తమ ఏకాగ్రచిత్తపు లక్ష్యాలను వెంబడించడానికి పరాయి ప్రాంతాలకు వెళ్లే వారికి ఇదొక నివాళి.

వీడ్కోలు పలికే ముందు – దైవం పై, విశ్వం పై, మీ విధి పై, మీ పనులపై, మీ ఎంపికలపై, అదృష్టంపై, మీ కుటుంబం మీద, ముఖ్యంగా మీపై నమ్మకం ఉంచమని; అప్పుడప్పుడు ఇవన్నీ మీకు కొంచెం అవసరమవుతాయని నేను దృఢంగా చెప్తున్నాను. ముఖ్యంగా, కృతజ్ఞతతో ఉండండి, ప్రేరణ పొందండి, ఇతరులకు స్ఫూర్తినివ్వండి, ప్రేమను పొందండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. త్వరలో మరికొన్ని కిస్సే, బాతేఁ, యాదేఁ లతో మీతో కలిసి మళ్ళీ ప్రయాణించాలని ఆశిస్తున్నాను.

షుక్రియా.

రాకేష్ ఆనంద్ బక్షి

(సమాప్తం)

Exit mobile version