Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘నగ్మే కిస్సే వాదేఁ బాతేఁ – ఆనంద్ బక్షి జీవితం పాటలు’ పుస్తకావిష్కరణ – ఆహ్వానం

‘యువభారతి’ సాహితీ సాంస్కృతిక సంస్థ మరియు ‘సంచిక’ తెలుగు సాహిత్య వెబ్ పత్రిక సంయుక్తాధ్వర్యంలో

‘తెలుగు వెలుగు’ సమాఖ్య కార్యక్రమాలు – 26 వ సమావేశం

రచయిత, అనువాదకులు, శ్రీ కొల్లూరి సోమ శంకర్ గారు అనువదించిన

‘నగ్మే కిస్సే వాదేఁ బాతేఁ – ఆనంద్ బక్షి జీవితం పాటలు’ గ్రంథావిష్కరణోత్సవం

మరియు ‘తెలుగు సినీ గీతాల విశ్లేషణ ప్రసంగాలు’

తేది: 1 నవంబర్ 2026 (ఆదివారం)

సమయం: సాయంత్రం 6.00 గంటలకు

వేదిక: శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం, సుల్తాన్ బజార్, కోఠి, హైదరాబాద్.

~

ముఖ్య అతిథి & గ్రంథావిష్కర్త:

డా. వోలేటి పార్వతీశం గారు,

సాహితీవేత్త, ‘దూరదర్శన్’ కార్యక్రమ నిర్వహణ (విశ్రాంత) అధికారి

సభాధ్యక్షులు:

ఆచార్య వంగపల్లి విశ్వనాథం గారు,

వ్యవస్థాపక సమావేశకర్త, ‘యువభారతి’ సాహితీ సాంస్కృతిక సంస్థ

గ్రంథ సమీక్షకులు:

డా. ఆచార్య ఫణీంద్ర గారు

అధ్యక్షులు, ‘యువభారతి’ సాహితీ సాంస్కృతిక సంస్థ

గ్రంథకర్త:

శ్రీ కొల్లూరి సోమ శంకర్ గారు

రచయిత, ఉప సంపాదకులు, ‘సంచిక’ తెలుగు సాహిత్య వెబ్ పత్రిక

ప్రధాన వక్తలు: 

శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు

సంపాదకులు, ‘సంచిక’ తెలుగు సాహిత్య వెబ్ పత్రిక, తెలుగు విశ్వవిద్యాలయం ‘ప్రతిభా పురస్కార‘ స్వీకర్త

(అంశం : తెలుగు, హిందీ సినీగీతాల తులనాత్మక విశ్లేషణ)

శ్రీ కుంతి (కుంతీపురం కౌండిన్య తిలక్) గారు

తెలుగు విశ్వవిద్యాలయం ‘పద్యకావ్య పురస్కార’ స్వీకర్త, కథా రచయిత

(అంశం: ఆరుద్ర సినీగీత వైభవం)

సాహిత్యాభిమానులందరికి ఇదే మా ఆహ్వానం

సమయ పాలన మన క్రమశిక్షణ

‘సాధన’ నరసింహాచార్య, కె.వి.ఎన్. ఆచార్య సమావేశకర్తలు,

‘తెలుగు వెలుగు’ సమాఖ్య

పత్రి అశ్వని కుమార్

కార్యదర్శి, సమావేశ కర్త, ‘యువభారతి’

లంకా నాగరాజు

వ్యవస్థాపకులు, ‘సంచిక’ తెలుగు సాహిత్య వెబ్ పత్రిక

Exit mobile version