[శ్రీ కయ్యూరు బాలసుబ్రమణ్యం రచించిన ‘నీ సిగలో మల్లెనై..!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
ఓ ప్రియా..!
ఇన్నాళ్ళు తెలియదు నాకు
నా శ్వాసలో గాలివి నీవని
నా హృదయస్పందన నీవని
నేనడిచే దారిలో వెలుతురు నీవని
నా మాటతీరులో సభ్యత నీవని
నేనడుచుకునే సత్ర్పవర్తన నీవని
నా చదువులో ఏకాగ్రత నీవని
నా పయనానికి చుక్కానివి నీవని
నా గమ్యానికి దిక్సూచి నీవని
నా లక్ష్య సాధనలో విజయం నీవని
చివరకు.. ఈ ప్రాణమే నీదని తెలిసి
నీ సిగలో మల్లెనై మురిసిపోయా..
ఈ వరమిచ్చిన దేవుని పాదం చెంత
పద్మమునై జన్మంతా తరించిపోయా!
