Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నీకే

[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘నీకే’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నా ప్రపంచాన్ని అందంగా
మలుచుకునే క్రమంలో
నన్ను తెలుసుకోవడానికి
రోజూ చదివే దినపత్రికవే

చదివే స్థాయి నుండి
ముద్రించే స్థాయికి చేరాలని
నన్ను అంకితం చేసుకోవాలని
ఓ కలని వ్రాసిపెట్టుకున్నాను..

Exit mobile version