Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నీరులా జారే

[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘నీరులా జారే’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నీరులా జారిన మబ్బుసంచి
ఎక్కడినుంచో
తడితడి వాసన మోసుకొచ్చింది

పాదరసంలా పాకిన సూర్యుడు
తూర్పు నుంచి వచ్చి,
పడమటి దిక్కున కనుమరుగు
మరో వైపున పొడిచేందుకు వెళ్ళిండు

పాపం గంటల డ్యూటీ కదా!
మరో చోటుకు పోయే
నన్ను నిద్రలో చీకటి జాగారం చేయమని
సూర్యునికైనా పనిలో నాకైనా
నియమం తప్పక వచ్చిపోవుడే క్రియ

అయితే
అలా వచ్చి ఇలా పోయేటోళ్ళకు
సరదా పచార్లు కొట్టడం
పనిలేదు పాడులేదు
దేశదిమ్మరి వాడికి మేనమామ సుమా!

నీరు పల్లంలో వాలుడు
రసం అస్థిర మూర్చనలతో నెలపై ఊగుడు
మరి మనిషి పనీ!?
అయోమయం జగన్నాథం
ప్రపంచపు జగన్నాటకంలో
నాంది నుండి సమాప్తం అంచుల్లో
ఆదినుండి తుదివరకు వరకు గోప్యం శూన్యం

Exit mobile version