[శ్రీ నండూరి రామచంద్ర రావు రచించిన ‘నెగడు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
నిరాశక్త నిర్లిప్తపు బ్రతుకులో
నిన్నటి జ్ఞాపకాల నివురులో
నిత్య నిస్పృతితో మిగిలున్నాను
మరల పలకరించకు సఖీ
దహనం జరిగేది ఒకసారే..
వసంతమని మురిసాను
మేఘాలను చూపావు
పున్నమి రేయని మురిసాను
వీడని గ్రహణం అన్నావు
నీవే లోకమనుకున్నాను
లోకులలో కలిసిపోయేవు
ఈ తోడు చాలనుకున్నాను
శూన్యాన్ని మిగిల్చి వెళ్ళిపోయావు
అసలు కలవక పోతే అనాలోచించలేదు
గులాబీలు పూస్తేనే కదా దాని విలువ తెలిసేది
నిరాశక్త నిర్లిప్తపు బ్రతుకులో
నిన్నటి జ్ఞాపకాల నివురులో
నిత్య నిస్పృతితో మిగిలున్నాను
మరల పలకరించకు సఖీ
దహనం జరిగేది ఒకసారే..
