సంచిక-స్వాధ్యాయ, తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహిస్తున్న సాహిత్య సభకు ఆహ్వానం.
~
తెలుగు సాహిత్య ప్రపంచంలో కథల కార్యశాలల్లో కథలు రాయని వాళ్ళంతా వచ్చి కథలెలా రాయాలో నేర్పుతారు. సృజనాత్మక రచనల్లో అనుభవంలేని వారంతా, ఎత్తుగడ, ముగింపు అంటూ కథా విమర్శన పాఠాలు చెప్పి కథలు రాయమంటారు.
అందుకు భిన్నంగా, ఎలా రాయాలో చెప్పటం కాదు, సృజనాత్మక రచనలు విశిష్టంగా రచిస్తున్న రచయితలు తాము రచనలెలా చేస్తారో వివరించే కార్యక్రమం ఇది.
అంటే, సృజనాత్మక రచనలెలా చేయటమో కాదు, సృజనాత్మక రచనలు చేస్తున్నవారి అనుభవాలను పరిచయం చేయటం ద్వారా రచనలెలా చేస్తారో వివరించే కార్యక్రమం.
~
అంశం- ‘నేను నవలలు రచించే పద్ధతి…’
తమ నవల రచనా పద్ధతిని వివరించే నవలా రచయితలు
- శ్రీమతి తమిరిశ జానకి- విశాలి నవలా రచయిత్రి
- శ్రీ సలీం- కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ గ్రహీత
- శ్రీ చిత్తర్వు మధు- సైన్స్ ఫిక్షన్ రచయిత
- శ్రీ పాణ్యం దత్తశర్మ- సంచికలో సూపర్ హిట్ సీరియల్ సాఫల్యం రచయిత
- శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి- నవలా రచయిత్రి
- శ్రీ వేదాంతం శ్రీపతి శర్మ- విశిష్టమైన రచనా శైలికల నవలా రచయిత
30.7.2022, ఉదయం 10 గంటలకు, స్వాధ్యాయ లైబ్రరీ హాల్, నారపల్లిలో..
చిరునామా:
స్వాధ్యాయ రీసెర్చ్ సెంటర్,
ఇంటి నెంబరు 4-48/12,
రోడ్ నెం.3, బాబానగర్, నారపల్లి,
ఘటకేసర్ మండల్, పోచారం మున్సిపాలిటీ,
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.
హైదరాబాదు-500088
అందరూ ఆహ్వానితులే.
మరిన్ని వివరాలకు 9849617392 నెంబరుకు ఫోన్ కానీ వాట్సప్ మెసేజ్ కానీ చేయవచ్చు.