ఒకప్పుడు బతకలేక బడిపంతులయినవాడు
సమాజమార్పులతో
బతకగలిగిన బడిపంతులుగా
అందునా….
ప్రైవేట్ ఉపాధ్యాయుడుగా
పనిచేస్తూ
తమరక్తాన్ని గంటలకొద్దీ
యాజమాన్యపు పేరుప్రఖ్యాతలకై
పాటుపడుతూ
అన్నపానాదులు మాని
ర్యాంకుల పంటకై
నిశీధిలో కూడా నిశితపరిశీలనలనిస్తూ
విద్యార్థుల భవితవ్యం కొరకు
పాటుపడిన
ప్రైవేట్ ఉపాధ్యాయుడు
నేడు కరోనావల్ల
ఉద్యోగం లేకపోయినా…..
విద్యార్థులకు ధైర్యం చెప్పిన వాడే
తనకు తాను ధైర్యం చెప్పుకొని
ఇడ్లీ
బండిని పెట్టుకొని
అరటిపళ్ళు అమ్మకుంటూ,
పనికాహార పథకానికిపోతూ
అది,ఇది అని లేకుండా
ఏదో ఒకటి చేస్తూ
ప్రపంచంలో నిజాయితీగా
బతకడానికి
తహతహలాడుతున్నాడు
ఉపాధి లేకున్నా..
ఉపాధ్యాయుడు
నిత్య విద్యార్థిలా..
ఎన్నో పనులు నేర్చుకొని
బతుకీడుస్తున్నాడు
హ్యాట్సాఫ్ టు నేటి ప్రైవేట్ ఉపాధ్యాయుడా!