[అలాన్ జాక్సన్, మార్టినా మెక్‌బ్రైడ్ పాడిన ‘నెవర్ లవ్డ్ బిఫోర్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- అలాన్ జాక్సన్, మార్టినా మెక్‌బ్రైడ్ – ‘నెవర్ లవ్డ్ బిఫోర్’
- ఆల్బమ్ – గుడ్ టైమ్ (2008)
- ప్రొడ్యూసర్ – కేత్ స్టేగల్
- రచన – అలాన్ జాక్సన్
~
ఈ డ్యూయేట్ చాలా సరదాగా సాగుతుంది. అప్పుడే ప్రేమలో పడ్డ ఇద్దరు టీనేజర్లు ఒకరి పట్ల మరొకరికి జనియించిన ఆకర్షణను ఒకరితో ఒకరు వ్యక్తపరచుకోవడం ఈ పాట సారాంశం. చిన్న చిన్న సరదాలు, చిలిపి కలయికలు, తమను అవతలి వాళ్ళు ప్రత్యేకంగా చూడడం, ఇవి ఆ వయసులో ఆకట్టుకునే విషయాలు. ఆ చిన్ని చిన్ని ఆనందాలను ఈ జంట అమాయకంగా బైటపెట్టుకుంటారు. ఆ వయసు పిల్లలలోని అమాయకత్వం, అన్నీ మాకు తెలుసు అనే మొండితనం, తమ మధ్య మొదలయిన ఆకర్షణకు మించినదేదీ ఈ ప్రపంచంలో ఉండబోదన్న ఆత్మవిశ్వాసం ఈ పాటలో ఆ జంట మాటలలో వినిపిస్తుంది.
Girl I swear you got me acting crazy
Half the time I don’t know what my name is
I’m the kind that like to take it slow and lazy
And girl you got me running hot and haziest
Oh, I love you like I never
Oh, I love you like I never
Oh, I love you like I never loved before
(ఓ అమ్మాయీ ఒట్టేసి చెబుతున్నా నువ్వు నన్ను పిచ్చివాడిగా ప్రవర్తించేలా చేశావు. సగం సేపు నా పేరు నేనే మర్చిపోతున్నాను. నాది మెల్లిగా, బద్దకంగా పని చేసే స్వభావం. అలాంటిది నన్ను వేడేక్కించి, పొరలు కమ్మించి, పరుగెత్తిస్తున్నావు, నేను నిన్ను ఎప్పుడూ ఎవరినీ ప్రేమించనంతగా ప్రేమిస్తున్నాను)
అలాన్ గొంతులో చిలిపితనం భళేగా ఉంటుంది వినడానికి. ఇంతే చిలిపితనంతో ఎన్నో సోలో గీతాలను ఆయన పాడి హిట్ చేశారు. ఆ గొంతులో అల్లరి, అమాయకత్వం సమపాళ్లలో వినిపిస్తాయి. పైగా ఈ పాట ట్యూన్ ఎంతో బావుంటుంది. నాట్యం రాని వారికి కూడా హుషారెక్కెత్తిస్తుంది. పాట ప్రారంభం అలాన్ చేసినా కోరస్ మాత్రం ఇద్దరూ పాడడం ఈ పాటకు వన్నె తెచ్చింది.
Boy you got me burning like a rocket
You stole my heart and stuck it in your pocket
Now I got your face inside my locket
I’ve really tried but I don’t think I can stop it baby
Oh I, love you like I never
Oh I, love you like I never
Oh I, love you like I never loved before
(ఓ అబ్బాయి నువ్వు రాకెట్టులా నేను కాలిపోయేలా చేస్తునావు. నా మనసు దోచి నీ జేబులో చెక్కేసుకున్నావు. ఇప్పుడు నీ వదనాన్ని నేను నా లాకెట్టులో దాచుకున్నాను. నేను ఎంత ప్రయత్నించినా, నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. నేను ఎప్పుడూ ఎవరినీ ప్రేమించనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను)
ఇక్కడ సరిగ్గా లోకం తెలియని ఇద్దరు అమాయక టీనేజర్లు కనిపిస్తారు. రాకెట్, పాకెట్, లాకెట్ అనే రైమింగ్ నవ్వు తెప్పిస్తూనే ఆ జంట వయసును గుర్తు చేస్తుంది. ఆ వయసులో ప్రేమలో ఆ వేడి అలాగే ఉంటుంది మరి.
You sat beside me last night on the sofa
I took your hand and pulled you a little closer
You kiss my lips and then you let me hold you
That feels the way that love’s supposed to baby
Oh, I love you like I never
Oh, I love you like I never
Oh, I love you like I never loved before
(నువ్వు నిన్న రాత్రి సోఫాలో నా పక్కన కూర్చున్నావు. నేను నీ చేయి పట్టుకుని కొంచెం దగ్గరకి లాక్కున్నాను. నువ్వు నా పెదాలను ముద్దాడి, నిన్ను కౌగిలించుకోనిచ్చావు. ప్రేమ ఇలాగే ఉంటుందని అనిపించింది ప్రియా, నేను నిన్ను ఎప్పుడూ ఎవరూ ఎవర్నీ ప్రేమించనంతగా ప్రేమిస్తున్నాను)
ఒకరికొకరు అప్పుడే పరిచయం అయ్యాక కాసేపు తగిలీ తగలని చేతులు, పక్క పక్కన కూర్చున్న కొన్న క్షణాలు స్వర్గంలా అన్పిస్తాయి. కొత్త ప్రేమ, తొలి సాంగత్యంలో మాధుర్యం ఎక్కించే మత్తు ఆ జంటను పూర్తిగా అవహించింది.
You held the door when we went to the movies
I like your corky sneaky sense of humor
You’re strong and sweet and all the things I needed
You’re the one that keeps my heart beating baby
Oh, I love you like I never
Oh, I love you like I never
Oh, I love you like I never loved before
(మనం సినిమాకు వెళ్లినప్పుడు నువ్వు నా కోసం తలుపు తెరిచి నుంచున్నావు. నీ విచిత్రమైన దొంగచాటు హాస్య చతురత నాకు చాలా ఇష్టం. తీయటి మనసున్న బలమైన నువ్వు నేను కోరుకున్న అన్ని గుణాలతో నిండి ఉన్నావు. నా గుండె నీ కోసమే కొట్టుకుంటూ ఉంది. నేను నిన్ను ఎప్పుడు ఎవరూ ఇంకెవరినీ ప్రేమించనంతగా ప్రేమిస్తున్నాను)
ఆ వయసులో అవతలి వారు చిన్న చిన్న విషయాలలో చూపే శ్రద్ద గొప్ప ప్రేమ సంకేతంగా అనిపిస్తూ ఉంటుంది. సినిమాకు వెళ్లినప్పుడు ఆమె కోసం తలుపు తెరిచి అతను నించోవడం ఆమెకు చాలా గొప్ప ప్రేమతో నిండిన చర్యగా అనిపించిందట. అతని హాస్య చతురత ఆమెకు ఎంతో ఇష్టం అని, చూడడానికి బలంగా అంతే సున్నితంగా కనిపించే అతని ఆహర్యం తనను పిచ్చిదాన్నిచేస్తుందని ఆమె చెప్పుకుంటుంది. ఆ వయసులో ఓ ఆడపిల్ల మగవానిలో ఏం చూసి ఆకర్షించబడుతుందో ఈ చరణంలో ఆమె చాలా అమాయకంగా విన్నివించుకుంటుంది.
Oh, my heart stops beating
When it’s time for you to leave me
Yeah, and my head starts spinning
Every time that you are near me
Oh, I love you like I never
Oh, I love you like I never
Oh, I love you like I never loved before
Oh, I love you like I never
Oh, I love you like I never
Oh, I love you like I never loved before
(నువ్వు నన్ను వదిలి వెళ్ళే సమయం వస్తుంటే, నా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. నువ్వు నా దగ్గర ఉన్న ప్రతిసారి నా తల తిరిగిపోతూ ఉంటుంది. నేను నిన్ను ఎవరూ ఎప్పుడూ ఎవరినీ ప్రేమించనంతగా ప్రేమిస్తున్నాను)
ఈ చరణంలో ఇద్దరూ ఒకేసారి తమ మనసులలోని అలజడిని చెప్పుకుంటున్నారు. ఆమె తనలో కలిగించే అలజడిని అతను, అతని సాంగత్యం తనలే రేపే ప్రకంపలని ఆమె ఒప్పుకుంటూ ఉండగా ఆ ఇద్దరు గొంతులు కలిసి కోరస్‌గా ధ్వనిస్తూ పాట పూర్తవడం భలే సరదాగా ఉంటుంది.
కంట్రీ డ్యూయేట్స్లో ఈ పాట నాకు చాలా ఇష్టం. తొలి వయసు ప్రేమలోని మాధుర్యాన్ని, అమాయకత్వాన్ని అనుభవంలోని తీసుకొచ్చే గీతం ఇది. ఈ సంగీతం ఇందులో గాయనీ గాయకుల గొంతులోంచి ఒలికే చిలిపితనం చాలా హాయిగా అనిపిస్తుంది. అలాన్ జాక్సన్ గొంతు ఇలాంటి పాటలకే సొంతమా అనిపించేటంత అల్లరిగా సాగుతుందీ గీతం. మార్టినా గొంతులోని ఆ జీర శ్రోతలను మరో లోకంలోకి తీసుకెళుతుంది. డాన్స్ బాలెడ్ కు సరిగ్గా సరిపోయే కంట్రీ గీతం ఇది.
~
(ఈ పాటని యూట్యూబ్‌లో వినవచ్చు/చూడవచ్చు:
https://youtu.be/wPeBfOOh-SE?si=Zlyn0H1XRVVDkeyn )

