కోవెల సంతోష్ కుమార్ అందిస్తున్న సరికొత్త వ్యాస పరంపర.. త్వరలో- ప్రకటన
సంచిక టీమ్
భారతదేశంలో ఒక పద్ధతి ప్రకారం రాముడిని, రామాయణాన్నీ తక్కువచేసి, బుద్ధుడిని బౌద్ధాన్ని ఆ స్థానంలో నిలపటం ద్వారా భారతీయ మూలాలను దెబ్బతీయాలని జరుగుతున్న కుట్రలను సప్రామాణికంగా నిరూపించిన వ్యాస పరంపర ‘రామమ్ భజే శ్యామలం‘ అందించారు రచయిత కోవెల సంతోష్ కుమార్.
ఆ తరువాత, భారతదేశంలో ఇస్లామీయులు అడుగుపెట్టినప్పటినుంచి దేశవిభజన వరకూ సప్రామాణికంగా మూలగ్రంథాల పరిశోధన ద్వారా చారిత్రక సత్యాలను నిక్కచ్చిగా, నిజాయితీగా, నిర్భీతిగా, నిర్మొహమాటంగా ప్రదర్శించి తెలుగులో ఒక అరుదయిన ప్రామాణిక చరిత్ర గ్రంథం ‘కల్లోల భారతం‘ అందించారు.
ఇటీవలే, వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకుని, రావణాసుర పాత్ర ఆధారంగా సమాజంలో వెదజల్లుతున్న అనృతాలను, దురూహలను, అపోహలను ఖండిస్తూ, రావణపాత్ర అసలు స్వరూపాని విశ్లేషణాత్మకంగా అందించారు ‘రావణ రహస్యం‘ వ్యాస పరంపరలో..
ఇప్పుడు సంచికకోసం ప్రత్యేకంగా మరో వ్యాస పరంపరను మూల గ్రంథాలను శోధించి, సత్యాలను వెలికితీసి అందిస్తున్న నూతన వ్యాస పరంపర సంచికలో ఆరంభమవుతున్నది అతి త్వరలో!!!!
ఆ వ్యాస పరంపర ఏ అంశం గురించో తెలుసుకోవాలంటే, వచ్చేవారం, సంచిక ప్రకటన చూడాల్సిందే..
అంతవరకూ.. ఊహిస్తూండండి, ఈసారి మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఏ అంశం ఆధారంగా కోవెల సంతోష్ కుమార్ తన పరిశోధనాత్మక వ్యాసపరంపరను రచిస్తున్నారో!!!!!!