[వాణి వేమవరపు గారు రచించిన ‘నిజానిజాలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
కొలువైన దేవుడు కరుణామయుడే,
కనులుండి కాంచలేని భక్తజనులెందరో,
ఓ భగవాన్ ఏ రీతిని నిను కొలువను?,
తలచిన వెంటనే
ప్రసారమాధ్యమాలలో ప్రకటనలు,
ఏ దేవుడిని పూజిస్తే ఎంత లాభమని,
భయంగా పూజలు,
వందల కొద్ది వెర్రితనాలు.
జీవులలో దేవుడిని
మన గ్రంథాలు,
మంచిలో మాధవుడని మన ప్రవచనాలు,
కానీ, గ్రంథాలకు గడియలు, పురాణాలకి తలుపులు.
కొమ్మకి కూర్చున్న భగవంతుని
సత్ దర్శన భాగ్యాలు.
ఇచ్చాపూర్తి సులభ మార్గాలు,
అంతులేని ఆర్భాటాలు,
తెలపలేని కొండంత పూజలు .
తల్లికి తెలియదా బిడ్డల ఆకలి,
ఆ భగవంతుడు ఎరుగడా మదిన సద్భక్తి,
సర్వాంతర్యానికి తెలియదా నిజానిజాలు.
