[శ్రీ నండూరి రామచంద్ర రావు రచించిన ‘నిక్కచ్చిగా’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
రచయితకు కాగితం విలువ తెలియదు
పత్రిక వారికి రేయి సుఖం తెలియదు
డాక్టర్ కు రోగి నొప్పి ఎంతో తెలియదు
ఉన్నదాని విలువ లేనంత వరకు తెలియదు
సూర్యచంద్రులకు వేరే దిక్కులతో పనిలేదు
వకీలుకు అసలు నిజంతో పనిలేదు
రైలు డ్రైవర్‌కు ఎక్కి దిగే వారితో పనిలేదు
గానుగెద్దుకు అడ్డదారితో పనిలేదు
పిల్లలకు సరైన పెంపకం ముఖ్య అవసరం
మొక్కకు సరైన సంరక్షణ ఎంతో అవసరం
సాధనకు లక్ష్యంపై శ్రద్ధ చాలా అవసరం
ఎంతెత్తుకు ఎగిరినా నేలేంతో అవసరం
ఆపదలో సమయస్ఫూర్తి అవసరం
బంధాల నిలకడకు సహనం ఎంతో అవసరం
సమాజంలో సంయమనం చాలా అవసరం
వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనం అవసరం
